మోడీ డబుల్ గేమ్... కన్ఫ్యూజన్‌లో పవన్‌కళ్యాణ్!

Publish Date:Feb 8, 2023

Advertisement

అసలు బీజేపీ వ్యూహం ఏమిటి?..జనసేన పార్టీతో మైత్రి వెనుక వ్యూహం ఏమిటి? మైత్రి విషయంలో కమలం పార్టీ జనసేనతో ఆడుతున్న దాగుడుమూతలు ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి. ఈ రాజకీయ క్రీడతో ఏం సాధించాలని అనుకుంటోంది. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా రాజకీయ వర్గాలలో నలుగుతున్నచర్చ ఇదే. ఏపీలో రాజకీయ గందరగోళం అన్నది బీజేపీలోనే తప్ప ప్రజలలో కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

జన సేనాని పవన్ కల్యాణ్ తన విధానమేమిటి? దారేమిటి? లక్ష్యం ఏమిటి? అన్న క్లారిటీతో ఉన్నారు. ప్రజలకు కూడా ఆ  విషయం విస్పష్టంగా చెప్పేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనీయను అనడంతోనే పవన్  కల్యాణ్ తన మససులో మాటను విస్పష్టంగా  బయటపెట్టేశారు. ఇక్కడే బీజేపీ గందరగోళంలో పడింది. పవన్ పొత్తు ఎవరితో అన్నది తేలిపోవడంతో.. బీజేపీతో మైత్రికి బీటలు వారాయా అన్న అనుమానం ఆ పార్టీలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అందుకే జనసేనను మిత్రపక్షంగా కాకుండా వైరి పక్షంగా అనుమానంతో చూస్తోంది. అయితే పూర్తిగా తెగతెంపులు చేసుకోకుండా.. జనసేనతోనే తమ పొత్తు అంటూ ప్రకటనలు గుప్పిస్తూ పవన్ ను కన్ఫ్యూజ్ చేయాలన్న వ్యూహాన్ని అనుసరిస్తోంది. కలిసి వస్తే జనసేనతోనే పొత్తు అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తూ ఇటు ప్రజలను కూడా గందరగోళంలోకి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నది.

రోడ్ మ్యాప్ విషయంలో కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది బీజేపీ. అయితే బీజేపీలోని ఒక వర్గం వారు మాత్రం రాష్ట్ర నాయకత్వం వ్యాఖ్యలకు, వ్యూహాలకు పార్టీ హైకమాండ్ సమయం చూసి చెక్ పెడుతుందని అంటున్నారు. అయితే  ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ విషయంలో పార్టీ కేంద్ర నాయకత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని బట్టి చూస్తే రాష్ట్ర బీజేపీలోని రెండు వర్గాలతోనూ పార్టీ హైకమాండ్ డబుల్ గేమ్ ఆడుతోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  జనసేనతో తెగతెంపులు అయ్యేలా, అందుకు జనసేనాని పవన్ కల్యాణే కారణం అనేలా బీజేపీ రాష్ట్ర నాయకులు వ్యవహరిస్తున్న తీరుకు ఆపార్టీ అగ్రనేతల ఆశీస్సులున్నాయా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి.

బీజేపీ రాష్ట్ర క్యాడర్ కూడా ఇవే సందేహాలను వ్యక్తం చేస్తోంది. కలిసి వస్తేనే జనసేన.. లేకపోతే జనంతోనే మా పొత్తు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా జనసేనానిని రెచ్చగోట్టే వ్యూహంతో చేసినవేనని అంటున్నారు. అలాగే ఇటీవల భీమవరంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమోదించిన రాజకీయ తీర్మానంలో కూడా జనసేనతో పొత్తు ఉంటుందన్న స్పష్టత లేకపోవడం, భావసారూప్యత ఉన్న పార్టీతో పొత్తు అంటూ పేర్కొనడం కూడా బీజేపీ, జనసేనల మైత్రి ఉందా.. ఉంటుందా.. అన్న సందేహాలకు తావిచ్చింది.  ఒక వైపు మిత్ర పక్షం అంటూనే మరో వైపు  జనసేనను, ఆ పార్టీ  అధినేత పవన్  కల్యాణ్ ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం ద్వారా రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రజలకు ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటోందన్న ప్రశ్న తలెత్తుతోంది.  అదే సమయంలో బీజేపీ హై కమాండ్ మాత్రం జనసేనతో మైత్రి విషయంలో ఎలాంటి శషభిషలూ లేకుండా సానుకూల ప్రకటనలు చేస్తోంది.

తెలంగాణలో బీఆర్ఎస్ ను ఎదుర్కొని విజయం సాధించాలంటే బీజేపీకి.. ఆ రాష్ట్రంలో కూడా అసంఖ్యాక అభిమాన బలం ఉన్న జనసేనాని అండ అవసరం. ఇప్పటికే జనసేనాని తెలంగాణలో జనసేన పోటీ ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు. అలాగే తెలంగాణలో ఖమ్మం సభ తరువాత తెలుగుదేశం కూడా చురుకుగా మారింది. ముందుముందు మరిన్ని సభలతో ఎన్నికల నాటికి బలీయ శక్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీకి   ఈ రెండు పార్టీల అండా లేకుండా తెలంగాణలో అధికారంలోకి రావడం అంత తేలిక కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అందుకే ఏపీలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం జనసేనతో పొత్తు, మైత్రి పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అధిష్ఠానం మాత్రం మౌనన్నే ఆశ్రయిస్తోందంటున్నారు. పరిస్థితులను బట్టి తెలంగాణలో బీజేపీ అవసరాలను బట్టి ఏపీలో బీజేపీ పొత్తల విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. అందుకే రాష్ట్ర నాయకుల ప్రకటనలతో సంబంధం లేకుండా  జీవీఎల్ వంటి బీజేపీ నేతలు జనసేనతో మాత్రమే తమ పార్టీ పొత్తు ఉంటుందని స్పష్టం చేస్తున్నారని అంటున్నారు.  

By
en-us Political News

  
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి
ప్రస్తుత సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.
పెరిగిన నిత్యావసరాలు నిర్మాణ సామగ్రి ధరలతో సామాన్యులకు సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ఒక కష్టతరమైన సవాలుగా మారుతున్న తరుణంలో
తెలంగాణలో రూ.96 కోట్ల ప్రభుత్వ నిధులకు గండి.!
ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసి బస్సులో చిన్నపాటి చిల్లర గొడవ కాస్తా ఊహించని సంఘటనకు దారితీసింది.
గంటకు 140 కి.మీ వేగంతో పెనుగాలులు..అప్రమత్తమైన యంత్రాంగం.!
ఒకవైపు ధరల మంట.. మరోవైపు కృత్రిమ కొరతలు..!
హైదరాబాద్ మహానగరంలో మరోసారి తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.