ఏపీలో బీజేపీ డబుల్ గేమ్

Publish Date:Nov 12, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ డబుల్ గేమ్ వ్యూహం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక పక్కన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొడుకు మాదిరిగా ట్రీట్ చేస్తున్నట్లే కనిపిస్తుంది. జగన్ పట్ల మోడీ ఎప్పుడూ సానుకూలంగా ఉంటారని పలువురు కేంద్ర మంత్రులు కూడా సమయం చిక్కిన ప్రతీసారీ చెబుతుంటారు. దాంతో పాటుగా ఏపీలోని వైసీపీ ప్రభుత్వం అవినీతి, వైఫల్యాలపై మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఛార్జిషీట్లు సిద్ధం చేసి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని తన పార్టీ కోర్ కమిటీ నేతలకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేస్తారు. దాంతో పాటుగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సంతకాల సేకరణ కూడా చేయాలని ఆదేశిస్తారు. మోడీ ఏపీ పర్యటనకు రెండు రోజుల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తనను కలవాలని పేర్కొంటూ పీఎంఓ నుంచి సమాచారం పంపించడం ఆసక్తికరంగా ఉంటుంది.

అంటే.. మోడీ విశాఖలో పర్యటన కోసం వస్తున్న క్రమంలో ప్రోటోకాల్ ప్రకారం సీఎం జగన్ ఆహ్వానించాలి. అలాగే ఆహ్వానించారు. అలాగే చేశారు. మోడీ సభను సక్సెస్ చేయడం కోసం లక్షలాది మందిని తరలించారు. అయినప్పటికీ.. సభా వేదికపై ఉండేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి జగన్ ఒక్కరికే అవకాశం ఇవ్వడం గమనార్హం.

మరో పక్కన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలరింగ్ ఇస్తుంది. విశాఖ పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ అరగంటకు పైగా ఆయనతో మోడీ భేటీ అయ్యారు. విశాఖలో పవన్ కంటే ముందుగా బీజేపీ కోర్ కమిటీ నేతలతో మోడీ సమావేశం షెడ్యూల్ ఉన్నా.. ముందుగా పవన్ తోనే మోదీ భేటీ అయ్యారు. పది నిమిషాలే పవన్ కు ముందుగా సమావేశం ఇచ్చిన మోడీ 35 నిమిషాలు చర్చలు జరిపారు. కానీ.. బీజేపీకి ఎప్పటి నుంచో మిత్రుడిగా ఉన్న పవన్ కళ్యాణ్  అడుగుతున్న రోడ్ మ్యాప్ మాత్రం ఇచ్చారో లేదో తెలియదు. మోడీతో భేటీ సందర్భంగా స్థానిక బీజేపీ నేతలతో జనసేనకు ఉన్న సమస్యల్ని పవన్ కళ్యాణ్ లేవనెత్తినట్లు సమాచారం. అయితే.. ఆ సమస్యల పరిష్కారం గురించి పవన్ వద్ద మోడీ ఏమైనా పెదవి విప్పారా? అనేది మాత్రం బయటకు రావడం లేదు. ఇటీవలి తాజా పరిణామాలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్- టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దగ్గర అవుతున్న నేపథ్యంలో మోదీ ఏం మాట్లాడారనేది తెలియాలంటే వారిద్దరిలో ఎవరో ఒకరైనా బయటకు చెప్పాల్సి ఉంది.

సరే.. మిత్రుడు పవన్ ను చాలా ఏళ్ల తర్వాత కలుసుకునేందుకు ప్రధాని మోడీ అవకాశం అయితే.. ఇచ్చారు.. కానీ భేటీ సందర్భంగా పవన్ చెప్పిన విషయాలపై ఆయన అంతగా స్పందించలేదనే అనుమానాలు వస్తున్నాయి. మోడీతో భేటీ తర్వాత బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ మీడియాతో తాను చెప్పదలచుకున్న ‘ఎనిమిదేళ్ల తర్వాత మోడీతో భేటీ అయ్యాను. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన మీటింగ్. ఏపీలోని అన్ని విషయాలు మోడీ అడిగి తెలుసుకున్నారు. ఏపీకి మంచి రోజులు రానున్నాయనే విశ్వాసం పెరిగింది.’ అని చెప్పారు. అయితే.. మీడియా ప్రతినిధులు అడగబోయిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండానే పవన్ అక్కడి నుంచి వెళ్లిపోవడం ఈసారి విశేషం. మీడియా ప్రతినిధులు ఎప్పుడు ఏ ప్రశ్నలు వేసినా ఓపిగ్గా విని సమాధానాలు చెప్పే పవన్ కళ్యాణ్ ఈ సారి అందుకు విరుద్ధంగా వ్యవహరించడం కొట్టొచ్చినట్లు కనిపింది. పైగా మీడియా సమావేశం సందర్భంగా పవన్ కళ్యాణ్ ముభావంగా ఉన్నారని చెబుతున్నారు. ఇటీవల విశాఖలో జరిగిన పరిణామాలపై ప్రధానికి వివరించారా? అన్న ప్రశ్నకు సమాధానం దాటవేయడమే కాకుండా.. ఇవన్నీ త్వరలో తెలియజేస్తానని మీడియా సమావేశాన్ని ముగించుకుని పవన్ కళ్యాణ్వెళ్లిపోయిన తీరుచూస్తే పవన్ కళ్యాణ్ విషయంలో మోడీ ఏవిధంగా వ్యవహరించారో అనే అనుమానాలు వస్తున్నాయంటున్నారు.

ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఏకం చేసేందుకు కృషిచేస్తానంటూ పవన్ కళ్యాణ్ చాలా రోజులుగా బహిరంగంగానే చెబుతున్నారు. ఆ క్రమంలో ఆయన టీడీపీకి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖ ఘటన తర్వాత, మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఆవేశపూరితంగా వైసీపీ నేతలపై వ్యాఖ్యలు చేసిన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లి పవన్ కు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో చంద్రబాబుకు పవన్ దగ్గర కాకుండా చేయాలనే వ్యూహంతోనే ఇన్నేళ్ల తర్వాత జనసేనానితో మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారనే అనుమానాలు వస్తున్నాయి. ఒక పక్కన తమ మిత్రుడు అని చెప్పుకుంటూనే.. పవన్ అడిగిన రోడ్ మ్యాప్ ఇవ్వకుండా తాత్సారం చేస్తారు. మరో పక్కన వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ప్రయత్నాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ను ఆ దారిలో ముందుకు వెళ్లకుండా బంధం వేయాలనే వ్యూహం ఏదో బీజేపీ చేస్తోందని అపిస్తోందంటున్నారు.

ఇక.. వైసీపీ వ్యతిరేక ఓటు టీడీపీ వెళ్లకుండా చేయడమే తమ కార్యక్రమం అని బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి మాటలు ప్రస్తావించుకోవచ్చు. అంటే.. వచ్చే ఎన్నికల్లో జనసేన- టీడీపీ కలిసి పోటీకి వెళ్లకుండా చేయాలనేది ఆ పార్టీ వ్యూహం అని అర్థం అవుతోందంటున్నారు. మొత్తానికి ఏపీలో బీజేపీ రాజకీయంగా డబుల్ గేమ్ ఆడుతోందనే సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.