Publish Date:Mar 12, 2025
ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోంది. కేంద్రంలో ప్రభుత్వ మనుగడకు ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండడానికి ఏపీకి అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్నామని చెబుతూనే.. మరో పక్క వైసీపీ ప్రయోజనాలు ఇసుమంతైనా దెబ్బతినకుండా ఢిల్లీ నుంచి చక్రం తిప్పుతోంది. సోము వీర్రాజు ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. బీజేపీ ఇంకా జగన్ కు అండదండగానే ఉందనడానికి సోముకు ఎమ్మెల్సీ టికెట్ కంటే గట్టి తార్కానాలు, ఆధారాలు కనిపిస్తున్నాయి. తాజాగా రాజ్యసభలో ప్యానల్ వైస్ చైర్ పర్సన్ గిరీని వైసీపీ ఎంపీ నిరంజనర్ రెడ్డి దక్కించుకున్నారు. రాజ్యసభ ప్యానెల్ వైస్ చైర్మన్ అంటే డిప్యూటీ స్పీకర్ తో సమానం. అటువంటి కీలకమైన పోస్టును వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి దక్కించుకున్నారు.
గతంలో అప్పటి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి ప్యానల్ వైస్ చైర్మన్ గా ఉండేవారు. ఆయన వైసీపీకీ, రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత నిరంజన్ రెడ్డిని ఆ స్థానంలో కేంద్రం భర్తీ చేసింది. అంటే ఇప్పటికీ వైసీపీకి క మలం పార్టీ ఎంత దన్నుగా నిలుస్తోందో అర్ధమౌతుంది. ఇంతకీ నిరంజన్ రెడ్డి ఎవరంటే.. జగన్ కేసులను వాదించే సీనియర్ లాయర్. అసలు నిరంజన్ రెడ్డిని జగన్ రాజ్యసభకు పంపించడానికి కారణమే ఆయన తన కేసులు వాదించడం అనడంలో సందేహం లేదు. నిరంజన్ రెడ్డి తెలంగాణ వాసి అయినా, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి అయినా కూడా జగన్ రాజ్యసభకు పంపించడానికి ఒకే ఒక కారణం ఆయన జగన్ కేసులు వాదిస్తుండటమేనని పరిశీలకులు విశ్లేషణ.
రాజ్యసభ ప్యానెల్ వైస్ చైర్ పర్సన్ లను రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ సోమవారం (మార్చి10) ఎంపిక చేశారు. మొత్తం ఎనిమిది మంది ప్యానెల్ వైస్ చైర్ పర్సన్ లకు ఎంపిక చేస్తారు. ఆ ఎనిమిది మందిలో వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి ఒకరు. సాధారణంగా రాజ్యసభలో సీనియర్లు, సంఖ్యా బలం ఎక్కువగా ఉన్న పార్టీల సభ్యులను ప్యానెల్ వైస్ చైర్ పర్సన్ లుగా ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన ప్యానెల్ వైస్ చైర్ పర్సన్ లు రాజ్యసభ చైర్మన్ అందుబాటులో లేని సమయంలో చైర్ లో కూర్చుని సభా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అటువంటి కీలకమైన పోస్టుకు సీనియారిటీ లేకపోయినా, సంఖ్యాబలం కూడా అంతంతమాత్రమే అయినా వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డిని ఎంపిక చేయడమే బీజేపీ ఆడుతున్న డబుల్ గేమ్ కు అద్దంపడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-double-game-continue-39-194251.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.