పదివేల నిత్యవసర మోడీ కిట్ల పంపిణీ!

Publish Date:May 3, 2020

Advertisement

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు జంటనగరాల ప్రజల కోసం మరోమారు పదివేల నిత్యవసర మోడీ కిట్లను సిద్ధం చేశారు.(ఇది వరకే 10 వేల నిత్యావసర కిట్లు పంపిణీ జరిగింది) మసబ్ ట్యాంక్ లోని బంజారా ఫంక్షన్ హాల్ లో ఈ దఫా మరో పది వేలు నిత్యవసర కిట్లు సిద్ధమవుతున్నాయి. ఈరోజు మంత్రి గారి సతీమణి శ్రీమతి కావ్య కిషన్ రెడ్డి ఇతర బీజేపీ నేతలు ప్రకాష్ రెడ్డి , గౌతం రావు , దీపక్ రెడ్డి , ఛాయా దేవి లతో కలిసి ప్యాకింగ్ తీరును పరిశీలించారు. 

ప్రతి కిట్లో  మేలురకం రైస్- 5 కిలోలు,
మేలురకం పప్పు -ఒక కిలో, నూనె -1 లీటర్, 
పసుపు, కారం, చింతపండు -  ఒక్కొక్కటి పావు కిలో చొప్పున
పికిల్ పాకెట్ -150గ్రామ్స్, ఎనర్జీ జ్యుస్ -1 లీటర్, మాస్కులు-4
లెక్కన మొత్తం 9 వస్తువులతో 10 వేల కిట్ల ప్యాకింగ్ బంజారా పంక్షన్ హాళ్ళో అయింది. 

సురక్షితంగా  ప్యాకింగ్  అవుతున్న తీరును  పరిశీలించిన  శ్రీమతి కావ్యా కిషన్ రెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ ఇంకా పొడిగించడంతో జంటనగరాల్లోని పేద ప్రజలకు ఈ కిట్లు అందించాలని కిషన్ రెడ్డి గారు  నిర్ణయించారని, అందుకే అన్ని జాగ్రత్తలతో  ప్యాకింగ్ సిబ్బందితో కిట్లను సిద్ధం చేసామని తెలిపారు. ఈ కిట్లను రేపు మధ్యాహ్నం నగరం నలుమూలలకు ప్రత్యేక వాహనాల ద్వారా పంపిణీ చేయనున్నట్లు ఆమె తెలియజేశారు. ఇప్పటికే నిత్యావసర కిట్లతో  పాటు  2 దఫాలుగా  నాణ్యమైన  తాజా కూరగాయలు 44 టన్నులు నగరానికి తెప్పించి పేద ప్రజలకు పంపిణీ చేయించామని, అంతేకాకుండా సెల్ఫ్ హెల్ప్ ఒమెన్ గ్రూప్స్ తో ప్రత్యేక కాటన్ క్లాత్ మాస్కులు కుట్టించి పేద ప్రజలకు పంపిణీ చేయించడం జరుగుతుందని కావ్య తెలిపారు. 

ఢిల్లీలో దేశవ్యాప్త కమాండ్ కంట్రోల్ రూమ్ బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్న మంత్రి కిషన్ రెడ్డిగారు ప్రతినిత్యం తన హైదరాబాద్ కార్యాలయ సిబ్బందితో,పార్టీ క్యాడర్ తో,స్వచ్చంద సంస్థలతో  చర్చిస్తూ జంట నగర ప్రజల కోసం పని చేస్తున్నారని ,ఈ కష్ట కాలంలో కరోనాను జయించడమే మన అందరి లక్ష్యమని కావ్య కిషన్ రెడ్డి అన్నారు. లాక్‌డౌన్‌ కు సహకరిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపారు. అలానే ప్రాణాలకు తెగించి కరోనాపై  పోరాడుతున్నా డాక్టర్లు, పారిశుద్ధ కార్మికులు, పోలీసులు, మీడియా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.