బీజేపీ తేల్చేసింది!.. తెలుసుకోవలసింది తెలుగుదేశం, జనసేనే!

Publish Date:May 23, 2023

Advertisement

ఏపీలో బీజేపీ స్టాండ్ ఏమిటన్నది స్పష్టంగా తేలిపోయింది. ఏవో ఏవేవో రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ సర్కార్ పై చార్జిషీట్లు అంటూ హడావుడి చేస్తున్నా.. బీజేపీ వాస్తవంగా రాష్ట్రంలో జగన్ సర్కార్ కు మద్దతుగానే ఉండాలన్న కృత నిశ్చయంతో ఉందని తేలిపోయింది.

ఇంకా అమయాకంగా జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీ మా మిత్ర పక్షం.. రాష్ట్రంలో మరో సారి వైసీపీ సర్కార్ అధికారంలోకి రాకుండా ఉండేందుకు బీజేపీని కూడా కలుపుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్నానంటూ కాలం గడిపేయడం వాస్తవాన్ని చూడకుండా కళ్లు మూసుకోవడమే అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అందుకోసం బీజేపీ పెద్దలతో మాట్లాడతాను అని పవన్ ఇప్పటికీ అనడం అమాయకత్వమేనంటున్నారు. బీజేపీకి ఏపీలో  కనీసం ఒక శాతం కూడా ఓటు బ్యాంకు లేదన్నది తెలిసిన విషయమేనని గుర్తు చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటం.. ఎన్నికల సమయంలో వ్యవస్థలను మేనేజ్ చేస్తుందన్న భయం, అనుమానంతోనే జనసేన, తెలుగుదేశం పార్టీలు కమలం పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారని రాజకీయ వర్గాలలో గట్టిగా చర్చ జరుగుతోంది.

కర్నాటక ఫలితాల తరువాతనైనా ఎన్నికల సమయంలో వ్యవస్థలను మేనేజ్ చేయడం అంత సులభం కాదని ఆ పార్టీలు తెలుసుకోవాలని, సొంత బలం, పోల్ మేనేజ్ మెంట్ పై గట్టిగా దృష్టి పెట్టాలని పరిశీలకులు సూచిస్తున్నారు.తాజాగా.. మోడీ సర్కార్ రెవెన్యూ లోటు నిధులు అంటూ ఏపీ కి 10,460. 87 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇదేమీ ఇప్పటి లోటు కాదు. రాష్ట్ర విభజన సమయంలో ఏర్పడిన లోటు. ఆ లోటును భర్తీ చేయాలని నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత అప్పట్లో ఎన్ని ప్రయత్నాలు చేశారో.. ఎన్ని సార్లు హస్తిన పర్యటించారో.. ఎన్ని సార్లు స్వయంగా మోడీని కలిసి విజ్ణప్తి చేశారో లేక్కే లేదు. తరువాత తరువాత మోడీ చంద్రబాబుకు అప్పాయింట్ మెంట్ ఇవ్వకుండా మొహం చాటేశారు. అది వేరే సంగతి.

నిధుల కోసమే, విభజన హామీల అమలు కోసమే అప్పట్లో తెలుగుదేశం ఎన్డీయేతో గొడవ పడింది. బయటకు వచ్చేసింది. అంతేనా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వంటి మంత్రులు రక్షణ నిధులను ఇచ్చేయమంటారా అంటూ ఎద్దేవా కూడా చేశారు. అలాంటిది కేంద్రానికి ఇప్పుడు హఠాత్తుగా ఏపీ  మీద కాదు కాదు జగన్ సర్కార్ మీద ఎక్కడ లేని ప్రేమా పుట్టుకొచ్చేసింది. అడగకుండా పెట్టకుండా.. జగన్ ఆర్థిక కష్టాలు తీర్చేయడానికి ఆఘమేఘాల మీద నిధులు విడుదల చేసేసింది. దీంతో ఎన్నికల సంవత్సరంలో జగన్ సర్కార్ కు ఆర్థిక చీకాకులు లేకుండా సహకారం అందించింది. ఇది చాలదన్నట్లూ ఎప్పుడడిగితే అప్పుడు అప్పులు తీసుకోవడానికి పచ్చ జెండా చేతిలో పట్టుకుని రెడీగా నిలుచుంటోంది.

దీంతో ఏపీ విషయంలో బీజేపీ వైఖరి ఏమిటో.. ఆ పార్టీ ఎటువైపు ఉంటుందో, ఎవరికి మద్దతుగా నిలుస్తోందో? నిలుస్తుందో అందరికీ పూర్తిగా అర్ధమైపోయింది. అసలు ఇప్పుడేమిటి? గత నాలుగేళ్లుగా బీజేపీ ఎలాంటి దాపరికం లేకుండా తన వైఖరి ఏమిటో చెబుతూనే వస్తోంది. జనసేనానికే ఇంకా పూర్తిగా అర్ధమైనట్లు కనిపించడం లేదు. అలాగే తెలుగుదేశం కూడా జనసేన అధినేత బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఏపీలో వైసీపీకి వ్యతిరేక వైఖరి తీసుకునేల ఒప్పించగలరన్న ఆశ అంటూ ఏమైనా ఉంటే దానిని వదిలేసుకుని ముందుకు నడవాల్సిన అవసరం ఉంది.  

By
en-us Political News

  
ఫార్ములా ఈ రేసు కేసులో ఎసిబి విచారణకు  కెటీఆర్ హజరైవెనుదిరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. ఉదయం  ఎసిబి ఆఫీసు గేటు ముందు వరకు వెళ్లిన కెటీఆర్ ఎసిబి ఆఫీసులోకి ఎంటర్ కాలేదు.
ప్రముఖ క్రికెటర్ యజువేంద్ర చాహల్ ,కొరియోగ్రాఫర్  ధనశ్రీ వర్మ  మధ్య విడాకుల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భార్య ధనశ్రీతో దిగిన ఫోటోలను యజువేంద్ర డిలీట్ చేశాడు.
గత కొంత కాలంగా ఛత్తీస్ గఢ్ కాల్పుల మోతలతో దద్దరిల్లిపోతున్నది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా చేపడుతున్న ఆపరేషన్ తో మావోయిస్టుల కంచుకోట బద్దలౌతున్నది.
సంధ్య థియేటర్ ఘటనలో నిందితుడైన , నటుడు అల్లు అర్జున్ కు రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించనున్నట్లు రాంగోపాల్ పేట పోలీసులకు సమాచారమందింది.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం (జనవరి 6) ఏసీబీ విచారణకు తన న్యాయవాదులతో హాజరయ్యారు. ఏసీబీ కార్యాలయం వరకూ వచ్చిన ఆయన అక్కడ మాత్రం హైడ్రామా ఆడారు. ఏసీబీ కార్యాలయంలోకి ఒంటరిగా హాజరయ్యే ప్రశ్నే లేదనీ, తన న్యాయవాదులను కూడా అనుమతించాలని పట్టుబట్టారు. అందుకు సహజంగానే ఏసీబీ అధికారులు నిరాకరించారు.
కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు.  కలెక్టర్ సుమిత్ కుమార్ ఎస్పీ మణికంఠ ఇప్పటికే ఏర్పాట్లను సమీక్షించారు.  మధ్యాహ్నం ద్రవిడ యూనివర్శిటీ చేరుకుని ఆడిటోరియంలో కుప్పం 2029 విజన్ ఆవిష్కరించారు
నటుడు మంచు మోహన్ బాబు బెయిలు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో బీజేపీ పయనం బావిలో కప్ప మాదిరిగా తయారైంది. రాష్ట్రంలో ఆ పార్టీ ప్రస్థానం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నచందంగా సాగుతోంది. అధికారమే తరువాయి అన్నట్లుగా ఒక సమయంలో బలంగా కనిపించిన ఆ పార్టీ ఆ తరువాత బలహీనపడింది. దక్షిణాదిన బలోపేతం కావడానికి ఆశాదీపంగా తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ భావిస్తోంది.
దేశంలో నల్లధనాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్రమోడీ 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో దేశంలో ఒక్కసారిగా సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ నానా ఇబ్బందులూ పడ్డారు. 2016 నవంబర్ 8న ప్రధాని పెద్ద నోట్లు రద్దు చేసినట్లు ప్రకటించారు.
చైనాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ను ప్రపంచ దేశాలు ఎంత మాత్రం తేలికగా తీసుకోవడానికి వీలులేదు. శీతాకాలంలో అత్యంత వేగంగా విస్తరిస్తూ మానవాళి మనుగడకు ఈ కొత్త వైరస్ సవాల్ విసురుతోంది.
తెలంగాణ మాజీ మంత్రి కెటీఆర్ సోమవారం ఎసిబి ఆఫీసుకు హాజరయ్యారు. కెటీఆర్  రాక సందర్బంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడే అరెస్ట్ లు చేస్తున్నారు.
గిట్టుబాటు ధర లేక రైతులు,నిత్యావసరాల ధరలు పెరిగి వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారు. ఇందుకు కారణం దేశంలో సరైన మార్కెట్ వ్యవస్థ లేకపోవడమే. ఈ కారణంగానే ఇటు ప్రజలు, అటు ప్రభుత్వాలూ కూడా నష్టపోతున్నాయి.
అగ్రరాజ్యం అమెరికాను మంచు తుపాను గడగడలాడిస్తోంది. దశాబ్దాలుగా ఎన్నడూ లేనంత తీవ్రతతో విరుచుకుపడుతున్న మంచు తుపాను ధాటికి అమెరికా వణికి పోతున్నది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రోడ్లు, భవనాలపై మంచు పేరుకుపోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.