బీజేపీ తేల్చేసింది!.. తెలుసుకోవలసింది తెలుగుదేశం, జనసేనే!

Publish Date:May 23, 2023

Advertisement

ఏపీలో బీజేపీ స్టాండ్ ఏమిటన్నది స్పష్టంగా తేలిపోయింది. ఏవో ఏవేవో రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ సర్కార్ పై చార్జిషీట్లు అంటూ హడావుడి చేస్తున్నా.. బీజేపీ వాస్తవంగా రాష్ట్రంలో జగన్ సర్కార్ కు మద్దతుగానే ఉండాలన్న కృత నిశ్చయంతో ఉందని తేలిపోయింది.

ఇంకా అమయాకంగా జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీ మా మిత్ర పక్షం.. రాష్ట్రంలో మరో సారి వైసీపీ సర్కార్ అధికారంలోకి రాకుండా ఉండేందుకు బీజేపీని కూడా కలుపుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్నానంటూ కాలం గడిపేయడం వాస్తవాన్ని చూడకుండా కళ్లు మూసుకోవడమే అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అందుకోసం బీజేపీ పెద్దలతో మాట్లాడతాను అని పవన్ ఇప్పటికీ అనడం అమాయకత్వమేనంటున్నారు. బీజేపీకి ఏపీలో  కనీసం ఒక శాతం కూడా ఓటు బ్యాంకు లేదన్నది తెలిసిన విషయమేనని గుర్తు చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటం.. ఎన్నికల సమయంలో వ్యవస్థలను మేనేజ్ చేస్తుందన్న భయం, అనుమానంతోనే జనసేన, తెలుగుదేశం పార్టీలు కమలం పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారని రాజకీయ వర్గాలలో గట్టిగా చర్చ జరుగుతోంది.

కర్నాటక ఫలితాల తరువాతనైనా ఎన్నికల సమయంలో వ్యవస్థలను మేనేజ్ చేయడం అంత సులభం కాదని ఆ పార్టీలు తెలుసుకోవాలని, సొంత బలం, పోల్ మేనేజ్ మెంట్ పై గట్టిగా దృష్టి పెట్టాలని పరిశీలకులు సూచిస్తున్నారు.తాజాగా.. మోడీ సర్కార్ రెవెన్యూ లోటు నిధులు అంటూ ఏపీ కి 10,460. 87 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇదేమీ ఇప్పటి లోటు కాదు. రాష్ట్ర విభజన సమయంలో ఏర్పడిన లోటు. ఆ లోటును భర్తీ చేయాలని నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత అప్పట్లో ఎన్ని ప్రయత్నాలు చేశారో.. ఎన్ని సార్లు హస్తిన పర్యటించారో.. ఎన్ని సార్లు స్వయంగా మోడీని కలిసి విజ్ణప్తి చేశారో లేక్కే లేదు. తరువాత తరువాత మోడీ చంద్రబాబుకు అప్పాయింట్ మెంట్ ఇవ్వకుండా మొహం చాటేశారు. అది వేరే సంగతి.

నిధుల కోసమే, విభజన హామీల అమలు కోసమే అప్పట్లో తెలుగుదేశం ఎన్డీయేతో గొడవ పడింది. బయటకు వచ్చేసింది. అంతేనా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వంటి మంత్రులు రక్షణ నిధులను ఇచ్చేయమంటారా అంటూ ఎద్దేవా కూడా చేశారు. అలాంటిది కేంద్రానికి ఇప్పుడు హఠాత్తుగా ఏపీ  మీద కాదు కాదు జగన్ సర్కార్ మీద ఎక్కడ లేని ప్రేమా పుట్టుకొచ్చేసింది. అడగకుండా పెట్టకుండా.. జగన్ ఆర్థిక కష్టాలు తీర్చేయడానికి ఆఘమేఘాల మీద నిధులు విడుదల చేసేసింది. దీంతో ఎన్నికల సంవత్సరంలో జగన్ సర్కార్ కు ఆర్థిక చీకాకులు లేకుండా సహకారం అందించింది. ఇది చాలదన్నట్లూ ఎప్పుడడిగితే అప్పుడు అప్పులు తీసుకోవడానికి పచ్చ జెండా చేతిలో పట్టుకుని రెడీగా నిలుచుంటోంది.

దీంతో ఏపీ విషయంలో బీజేపీ వైఖరి ఏమిటో.. ఆ పార్టీ ఎటువైపు ఉంటుందో, ఎవరికి మద్దతుగా నిలుస్తోందో? నిలుస్తుందో అందరికీ పూర్తిగా అర్ధమైపోయింది. అసలు ఇప్పుడేమిటి? గత నాలుగేళ్లుగా బీజేపీ ఎలాంటి దాపరికం లేకుండా తన వైఖరి ఏమిటో చెబుతూనే వస్తోంది. జనసేనానికే ఇంకా పూర్తిగా అర్ధమైనట్లు కనిపించడం లేదు. అలాగే తెలుగుదేశం కూడా జనసేన అధినేత బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఏపీలో వైసీపీకి వ్యతిరేక వైఖరి తీసుకునేల ఒప్పించగలరన్న ఆశ అంటూ ఏమైనా ఉంటే దానిని వదిలేసుకుని ముందుకు నడవాల్సిన అవసరం ఉంది.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామమైన నారా వారి పల్లెలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నారా రామ్మూర్తినాయుడి మృతి పట్ల తెలుగుదేశం నేతలు సంతాపం తెలిపారు.
దేశరాజధాని నగరం హస్తినలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. రోజురోజుకూ ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తోంది. దీంతో ప్రజా క్షేమం కోసం ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.
మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రెజిల్‌లో అడుగుపెట్టారు. రాజధాని నగరం రియో డిజెనీరో చేరుకున్న ఆయనకు అక్కడి భారత రాయబారి సురేష్ రెడ్డి నేతృత్వంలోని భారత ప్రతినిధుల బృందం ఘన స్వాగతం పలికింది.
రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాయుద్ధ నౌక దివంగత గద్దర్ కుమార్తెకు కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌ పర్సన్‌‌గా డాక్టర్‌ గుమ్మడి వి. వెన్నెలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (నవంబర్ 18) శ్రీవారి దర్శనం కోసం భక్తులు మూడు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
 తమిళనాడులో స్థిర పడిన తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటి, బిజెపి నేత కస్తూరిని   అరెస్ట్ చేసి చెన్నయ్ లోని ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచారు.  కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. డిఎంకే వల్లే తనపై రూమర్స్ వచ్చినట్లు కస్తూరి గతంలో వివరణ ఇచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు ఆదివారం నారావారిపల్లిలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. తల్లిదండ్రుల సమాధుల పక్కనే రామ్మూర్తి అంత్యక్రియలు జరిగాయి. పార్టీవ దేహానికి పలువురు ప్రజా ప్రతినిధులు, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నివాళులర్పించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించటం వల్లే తెలంగాణలో వరిసాగు పెరిగిందని  గత బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్దపు  ప్రచారం చేసింది. లక్షన్నర కోట్ల నిధులతో ఈ ప్రాజెక్టు నిర్మించినప్పటికీ నాణ్యతా ప్రమాణాలు లోపించడంతో  ఈ ప్రాజెక్టు డ్యామేజి అయ్యింది. పదేళ్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చిన అంశాలలో కాళేశ్వరం చేరింది. 
తెలంగాణ ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గమైన కొడంగల్ లోని లగచర్ల భూములను లాక్కోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుందని బిఆర్ఎస్ శ్రేణులు  ఆరోపిస్తున్నాయి.
 కాగా నారా రామ్మూర్తి నాయుడు పార్దీవదేహం హైద్రాబాద్ నుంచి బయలు దేరి నారావారిపల్లెకు చేరుకుంది. మంత్రి లోకేశ్ తన చిన్నాన్న భౌతికకాయాన్నిదగ్గరుండి తీసుకొచ్చారు.  మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు ప్రారంభమౌతాయి. 
 తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేకు  బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పూర్తిగా సహకరించారు. మొత్తం 8 పేజీల్లో 75  ప్రశ్నలతో కూడిన ఫామ్ ను ఆమె ఎంతో ఓపికగా నింపారు. కులగణను బిఆర్ఎస్ మొదట్నుంచి వ్యతిరేకిస్తుంది.
మావోయిస్టులు  మరణించారు. భద్రతా బలగాలలో ఇద్దరు గాయపడ్డారు   కంకేర్ నారాయణపూర్ జిల్లా సరిహద్దులోని మాద్ ప్రాంతంలో నక్సల్స్ భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
 మహరాష్ట్ర ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహరాష్ట్రలో ఈ నెల 20న పోలింగ్ ఉంది. ఈ నెల 23న  ఓట్ల లెక్కింపు ఉంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో  కలిపి అదే రోజు కౌంటింగ్ జరగనుంది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.