ఉట్టికెగరలేనమ్మ స్వర్గానిక ఎగురుతానందట.. అలా ఉంది ఏపీలో బీజేపీ పరిస్ధితి. ఏపీలో బీజేపీకి ఎలాంటి పొలిటికల్ స్టేకూ లేదు. కానీ బీజేపీ నేతల మాటలు మాత్రం కోటలు దాటేస్తున్నాయి. గ్రామాల్లో పండుగలు, పబ్బాల సమయంలో వచ్చి వినోదాన్ని పంచే పిట్టల దొరలు కూడా ఈ స్థాయిలో గొప్పలు చెప్పి వినోదాన్ని పంచలేరు. కానీ బీజేపీ ఏపీ నేతలు మాత్రం.. గొప్పలు చెప్పుకోవడంలో, అతిశయోక్తులు చెప్పడంలో ఇప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డులూ చెరిపేస్తున్నారు.
రాష్ట్రంలో బీజేపీకి 175 నియోజకవర్గాల్లొ ఒక్కరంటె ఒక్క అబ్యర్దిగా చెప్పుకో దగ్గ నేత లేరు. అయినా ముఖ్యమంత్రి అభ్యర్ది ని డిసైడ్ చేస్తాం.....బిజెపి తో పొత్తులు కొసం అన్నీ పార్టీ లు ఎగబడుతున్నాయి అంటూ బడాయి మాటలు మాటాడు తున్నారు. ఢిల్లీకి పోయో నేతలు అందరూ బడా బాబులే.. కాని స్థానికంగా పార్టీని నడిపించే వారులేక ఉన్న పదిమందికూడా ఏదో ఒక పార్టీ నేతలతొ కలిసి తిరుగుతున్నారు.
బిజెపి పార్టీ గొప్పల గురించి చాంతాడంత గొప్పలు చెప్పే సోము వీర్రాజు. ..అండ్ కో నేతలు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కు అబ్యర్ది లేక ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్ ను బరిలో దించింది. దింగత మేకపాటి గౌతమ్ రెడ్డి. మరణం తరువాత ఉప ఎన్నికలు తధ్యమని తెలిసినా ఇన్ని నెలలు అక్కడ బిజెపి అబ్యర్ది ఎవరన్నది నిర్ణయం చేయలేకపోయింది. ఇక కడాఖరుకు పరువు పోతుందని ఆఖరి రోజు ఆ పార్టీ జిల్లా అద్యక్షుడి చేత నామినేషన్ వేయించి సోము వీర్రాజు ఓ రేంజ్ లో కేకలు వేసి వైసిపికి సవాల్ విసిరి వెళ్లిపోయారు.
వెళుతూ వెళుతూ టిడిపి ఎలాగూ పోటీలో లేదు కదా మీకు వైసిపి పార్టీ మీద కోపం ఉంటే మాకు ఓట్లేయండి అని ప్రాధేయపడి వెళ్లారు. ఇంతకు ఉప ఎన్నికల్లో స్థానికంగా ఉన్న నేతలను పోటీలో నిలబెట్టే దిక్కులేని దశలో బిజెపి పార్టీ ఉంది.
అలాంటి పార్టీ పక్క పార్టీలను శాసిస్తామని కొతలు కోసి వెళతుంటే ప్రజలు విరగబడి నవ్వుకుంటున్నారు. గతంలో బద్వేల్ , తిరుపతి ఉప ఎన్నకల్లో పోటీ చేసి డిపాజిట్ కొల్పోయిన బిజెపి ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఏం సాధించాలనుకుంటోంది? మరోసారి డిపాజిట్ గల్లంతు చేసుకోవడం తప్ప. నామి నేషన్ రోజున వచ్చిన నేతలు మళ్లి కనిపించక పోవడంతో ఆ పార్టీ నేతలను సామాజిక మాధ్యమంలో సెటైర్లతో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-cant-find-candidates-to-contest-somu-confidence-of-win-is-afarce-39-137115.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.