బీజేపీ బీసీ మంత్రం.. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందం?

Publish Date:Oct 27, 2023

Advertisement

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ఫలితం ఉండదు. అయితే, అదేమిటో కానీ, కమల దళం రేకలన్నీ, కాలి వాడి రాలిపోయిన తర్వాత, ఇప్పడు బీసీ మంత్రం జపిస్తోంది. నిజానికి, బీజేపీ అగ్ర నాయకత్వం చేసిన పెద్ద తప్పు, ఎన్నికల ముంగిట పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్  ని తప్పించడం. అంతకు మించిన మరో తప్పు  కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడం. ఇతర కారణాలు ఉన్నా ప్రధానంగా ఈ రెండు తప్పులు బీజేపీని ఎన్నికల రేసులోంచి దాదాపుగా పక్కకు నెట్టేశాయి.  సంజయ్ మూడేళ్ళ శ్రమ బూడిదలో  పోసిన పన్నీరై పోయింది. చివరకు ఏపీలోలానే తెలంగాణలోనూ బీజేపీ ఆటలో అరటి పండుగా మిగిలిపోయింది. బండిని డ్రైవింగ్ సీట్ లోంచి తప్పించడంతో బీజేపీ బండి పట్టాలు తప్పింది. ప్రమాదంలో పడింది.

ఇక ఇప్పడు   శుక్రవారం(అక్టోబర్ 27) సూర్యాపేటలో బీజీపీ నిర్వహించిన ప్రజా గర్జన సభలో.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా  తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు. నిజమే రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు అమిత్ షా  ప్రయోగించిన బీసీ మంత్రం నిజంగా పనిచేస్తే అది బీజేపీకి గేమ్ చేంజర్ అవుతుంది. కానీ  ఇక్కడ మళ్ళీ బీజేపీ తప్పులో కాలేసింది. ఎప్పుడో చేయవసిన పని ఇప్పుడు చేసింది. అంతే కాదు  ఓ వంక బీసీ బండిని పార్టీ అధ్యక్ష పదవినుంచి తప్పించి  ఇప్పడు బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించినంత మాత్రాన  బీసీలు నమ్ముతార?  బీజేపీ వైపు చూస్తారా? అంటే సందేహమే అంటున్నారు విశ్లేషకులు.

అయితే అమిత్ షా ప్రకటన రాజకీయ వర్గాల్లో మాత్రం  ఇప్పుడు  చర్చనీయాశంగా మారింది. నిజానికి, బండి సంజయ్ ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించ కుండా బీసీ నేత ఈటల రాజేందర్ ను అప్పుడే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తే  ఫలితం మరోలా ఉండేదని  బీజేపీ సీనియర్ నాయకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రధాన ప్రత్యర్ధి పార్టీలు  బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ అగ్రకుల (వెలమ, రెడ్డి) పార్టీలుగా ప్రజలు భావిస్తున్నారు. బీఆర్ఎస్ మళ్ళీ గెలిస్తే  అయితే కేసీఆర్  కాదంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. అలగే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే  అయితే రేవంత్ రెడ్డి, కాదంటే ఉత్తమ కుమార్ రెడ్డి ఆయనా కాకపోతే కోమటి రెడ్డి ముఖ్యమంత్రి అవుతారే కానీ ఏ బీసీ నాయకుడో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. ఈ విషయంలో ప్రజలకు క్లారిటీ వుంది. ఈ  నేపధ్యంలో బీసీ కార్డును సమర్ధవంతంగా వినియోగించుకునే చక్కని అవకాశం బీజేపీకి మాత్రమే వుంది. అయితే  అంతర్గత కుమ్ములాటల కారణమోచ మరోటో కానీ  బీజేపీ అగ్ర నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమైంది. ఇక ఇప్పడు, బీసీ మంత్రం జపించినా అంతగా ఫలితం ఉండక పోవచ్చని బీజేపీలోనే ఒక  వర్గం  నాయకులు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. 

అయితే  మరోవర్గం  నాయకులు మాత్రం  ఎన్నికల ప్రచారం ఊపందు సమయంలో  అమిత్ షా విసిరిన బీసీ సవాల్  ప్రత్యర్ధుల  ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ   ఆశలపై నీళ్ళు చల్లిందని అంటున్నారు.  నిజానికి, అసలు కథ ఇప్పుడే మొదలైంది.  బీసీ కార్డుతో పాటుగా అమిత్ షా ఎక్కు పెట్టిన కుటుంబ పాలన, కుటుంబ పార్టీ  అస్త్రం  ప్రజలను ఆలోచింప చేస్తుందని కూడా కొందరు బీజేపీ నేతలు   భావిస్తున్నారు.

 కాగా  సూర్యాపేట సభలో అమిత్ షా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ కూడా కుటుంబ పార్టీలేనని విమర్శించారు. కేటీఆర్‌ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని.. అటు రాహుల్ గాంధీని పీఎం చేయటమే సోనియా గాంధీ జీవిత ధ్యేయమని  ఈ రెండు పార్టీలకూ బీసీల సంక్షేమం ఏమాత్రం పట్టదని చెప్పుకొచ్చారు. అందుకు  ప్రధాని నరేంద్ర మోదీనే ప్రత్యక్షసాక్ష్యమని చెప్పు కొచ్చారు. అంతే కాదు, బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తారా అంటూ కేసీఆర్‌కు సవాల్ కూడా విసిరారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా  వెళ్ళిన నేపధ్యంలో బీజేపీ బీసీ మంత్రం ఎంతవరకు పనిచేస్తుంది అనేది చూడవలసిందే కానీ ఇప్పుడే  తీర్పు చెప్పలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.