బీజేపీ విస్తరణకు విస్తారక్ లు!

Publish Date:Jan 10, 2023

Advertisement

దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో   హ్యాట్రిక్ విజయాన్నిఅందుకోవడం కోసం భారీ కసరత్తే జరుగుతోంది.  పార్టీకి మరింతగా బలోపేతం చేయడానికి కొత్త చేరికలకు ఆహ్వానం పలుకుతోంది బీజేపీ పార్టీ ఇందుకోసం పార్టీ విస్తరణ లక్ష్యంగా విస్తారక్ ల నియామకానికి నిర్ణయించింది.  సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాదిలో 9 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాలలో పార్టీ విజయం లక్ష్యంగా తొలుత మూడు నుంచి మూడు వేల ఐదోందల మంది విస్తారక్ లను నియమించాలన్న నిర్ణయం తీసుకుంది.

ఆ తరువాత అవసరమైతే మరింత మందిని నియమించి 2024 ఎన్నికలలో విజయం కోసం బాటలు వేసుకోవాలని భావిస్తోంది. ముందుగా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, త్రిపుర, కర్నాటక, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లపై దృష్టిసారించింది. ఈ తొమ్మిది రాష్ట్రాలలో ఆరు రాష్ట్రాలలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది బీజేపీయే. అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అధికారాన్ని నిలుపుకోవడం, ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాలలో అధికారాన్ని కైవసం చేసుకోవడం లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ విస్తరణ పనుల్లో జోరు పెంచేందుకు విస్తారక్ ల నియామకానికి శ్రీకారం చుడుతోంది.  

ఈ విస్తారక్ లు నేరుగా పార్టీ కేంద్ర నాయకత్వానికే జవాబుదారీగా ఉంటారు.  వీరు వారికి అప్పగించిన నియోజకవర్గాలలో క్షేత్ర స్థాయి వరకూ చొచ్చుకుని వెళ్లి పార్టీ విస్తరణ, బలోపేతానికి కృషి చేస్తారు.  వీరు నేరుగా కేంద్ర నాయకత్వానికే జవాబుదారీ అయినా, స్థానిక నేతలతో సమన్వయం చేసుకుంటూ పని చేస్తారు. అదే సమయంలో క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి, విజయావకాశాలు, అలాగే స్థానిక నేతల పనితీరుీతితర అంశాలపై ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర నాయకత్వానికి నివేదిస్తారు.

అంటే కిందిస్థాయిలో ఏం జరుగుతోంది. పరిస్థితులు ఏమిటీ, పార్టీ పరిస్థితి ఎలా ఉంది. స్థానిక నాయకత్వం బలాబలాలేమిటి? వంటి అన్ని అంశాలూ ఎప్పటికప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళతారన్న మాట. కాగా ఇప్పటికే ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణలో విస్తారక్ ల నియామకం జరిగింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ విస్తారక్ ల నియామకం జరిగి పోయింది. అలాగే దేశ వ్యాప్తంగా పార్టీ ఒకింత బలహీనంగా ఉందని గుర్తించిన 160 వరకూ ఉన్న నియోజకవర్గాలకు కూడా విస్తారక్ ల నియామకం ఇప్పటికే పూర్తయ్యింది.   

By
en-us Political News

  
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాప్తాడు పాఠశాలలో రక్తచరిత్ర.!
పేదరికం.. కష్టాలు.. రోజువారీ కూలీ పని! ఒకప్పుడు కనీస అవసరాల కోసం పోరాడిన మహిళ.. నేడు ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు కీలక భాగస్వామిగా ఎదిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.