పురంధేశ్వరికి బీజేపీ పగ్గాలు.. టీడీపీని కొట్టేందుకా? రాష్ట్రాన్ని గెలిచేందుకా?

Publish Date:Jul 4, 2023

Advertisement

బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీ పదవుల ప్రక్షాళన చేపట్టింది. ఈ క్రమంలోనే బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఆ పార్టీ అధిష్ఠానం మాజీ సీఎం నందమూరి రామారావు కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించింది. ఇప్పటి వరకు పురంధేశ్వరి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగానే కాకుండా ఒడిశాకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా కూడా వ్యవహరింారు. ఇప్పుడు ఏపీ అధ్యక్షురాలిగా బీజేపీ అధిష్ఠానం నియమించింది. బీజేపీ అధ్యక్ష మార్పు ఊహాగానాలు రావడంతో సత్యకుమార్, సుజనా చౌదరి పేర్లు కూడా అధ్యక్ష రేసులో వినిపించాయి. కానీ అధిష్ఠానం చివరికి పురంధేశ్వరి పేరు ఖరారు చేస్తూ ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా ప్రకటించింది. 

సహజంగానే పురంధేశ్వరి సీనియర్ రాజకీయ నాయకురాలు కావడం, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు రాష్ట్రంలో కీలకమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, అన్నింటినీ మించి ఎన్టీఆర్ కుమార్తె కావడం ఆమెకు ఈ పదవిని తెచ్చిపెట్టినట్లుగా భావించాలి. ఆమె ఏ పార్టీలో ఉన్నారన్నది.. రాజకీయాలను పక్కన పెడితే పురంధేశ్వరి పనితీరును ఆక్షేపించాల్సిన పనిలేదు. పురంధేశ్వరి అనగానే గుర్తుకొచ్చేది ఎన్టీఆర్ కుమార్తె అనే అయినా ఆమె పనితీరుతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయంగా ఆమె ఎంట్రీకి వారసత్వం పనికి వచ్చినా.. మంత్రిగా ఆమె సమర్ధత, ఆమె హుందాతనం, వ్యవహార శైలి ఆమెకి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఇంకా చెప్పాలంటే సో కాల్డ్ మహిళా నేతలు ఆమెను చూసి నేర్చుకోవాల్సింది కొండంత.

అయితే, ఇప్పటికిప్పుడు బీజేపీ పగ్గాలు పురంధేశ్వరికి అప్పగించడం వెనక బీజేపీ వ్యూహం ఏంటన్నది సహజంగానే చర్చకు తావిస్తున్నది. అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియామకం టీడీపీని దెబ్బతీసేందుకా.. లేక రాష్ట్రాన్ని గెలిచేందుకా అనే చర్చలు సాగుతున్నాయి. నిజానికి ఏపీలో బీజేపీకి అధ్యక్షులుగా ఎవరిని నియమించినా పెద్దగా చర్చ అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీకి అసలు స్టేక్ లేదు. ఈ పార్టీకి ఏపీలో ఒక  శాతం ఓట్లు దక్కడమే గగనం. అయితే ఇలాంటి చోట ఇంతలా చర్చ జరుగుతున్నదంటే దానికి కారణం బీజేపీ వ్యవహారశైలే. ఏమీ లేని చోట కూడా అవకాశాన్ని వెతుక్కోవడం బీజేపీ నైజం. దేశంలో చాలా రాష్ట్రాలలో ఇదే తరహా ప్రణాళికతో పని చేసిన బీజేపీ కొన్ని చోట్ల సక్సెస్ అయింది. ఈ కారణంగానే ఏపీలో బీజేపీ వ్యూహాన్ని అనుమానించాల్సి వస్తుంది.

ఏపీలో రాజకీయ పరిస్థితులను చూస్తే టీడీపీ, వైసీపీ మధ్యనే ప్రజల పోలరైజేషన్ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి చోట నిలబడాలంటే ఏదొక పార్టీ స్థానాన్ని ఆక్రమించాలి. టీడీపీ, వైసీపీని పోలిస్తే బీజేపీ తన వైపుకు తిప్పుకోనేందుకు ఎక్కువ అవకాశం ఉన్న పార్టీ టీడీపీ. ఈ తరహా ఆలోచనతోనే బీజేపీ ఇన్నాళ్లు కాపు సామజిక వర్గానికి చెందిన వారికి పార్టీని అప్పగిస్తూ వచ్చింది. అయితే, ఇప్పుడు ఆ సామాజిక వర్గాన్ని కూడా జనసేన క్యాప్చర్ చేసుకొనే పనిలో ఉంది. దీంతో బీజేపీ ఇప్పటికే తనతో ఉన్న నేతలలో ఎక్కువ శాతం బలమైన నేతలుగా ఉన్న కమ్మ సామజిక వర్గ నేతలకు పార్టీని అప్పగించినట్లుగా కనిపిస్తుంది. అయితే, స్థానికంగా వేళ్లూనుకుపోయిన టీడీపీ దెబ్బకొట్టడం అంటే   ఆషామాషీ విషయం కాదు.

ఇక బీజేపీ మరో ఆలోచనగా చర్చిస్తే ఇది టీడీపీ-జనసేనతో కలిసి రాష్ట్రాన్ని జయించేందుకు వేసిన ప్రణాళికగా కూడా భావించవచ్చు. ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా రాజకీయాలు సాగుతుండగా.. జనసేన, బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ మూడవ ప్రత్యామ్నాయం కావాలని ఆశపడుతున్నాయి. అయితే, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజు కారణంగా ఇరు పార్టీల మధ్య పొత్తున్నా లేనట్లుగానే కనిపించింది. ఇలాంటి సమయంలో బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా కమ్మ-కాపు సామజిక వర్గాల కలయికను ప్రజలలోకి పంపినట్లే అవుతుంది. ప్రచారం జరుగుతున్నట్లుగా టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఖరారైతే పురంధేశ్వరి, చంద్రబాబు కాంబినేషన్ తో ప్రజల మధ్యకి వెళ్లి అధికారాన్ని కొల్లగొట్టడం మరింత సులువు అవుతుందనే ఆలోచన కూడా చర్చకి వస్తున్నది. మరి బీజేపీ వ్యూహం ఏంటో..  

By
en-us Political News

  
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.