బీజేపీ తెరాస జుగల్ బందీ

Publish Date:Sep 2, 2022

Advertisement

తెలంగణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఇతర రాష్ట్రాలకు వెళ్లి, కేంద్ర ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నారు.మోడీ ప్రభుత్వం మహా డేంజర్ అని దేశాన్ని హెచ్చరిస్తున్నారు. అర్జెంటుగా, బీజీపీ సర్కార్ను సాగనంప వలసిన అవసరాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు. గుజరాత్ మోడల్ కు పోటీగా తెలంగాణ మోడల్ అభివృద్ధిని తెరమీదకు తెచ్చారు. బీజేపీ ముక్త భారత్ నినాదంతో కమల దళం పై కలిసి పోరాడేందుకు,రండని ప్రజలకు,పార్టీలకు పిలుపు ఇచ్చారు. సరే, కేసేఆర్ రమ్మంటే వచ్చేవాళ్ళు ఎవరు,?బీజేపీని గద్దె దించేది ఎవరు? అసలు మోడీకి ప్రత్యాన్మాయం ఎవరు? అనే పలు ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రావాల్సి ఉందనుకోండి.. అన్నిటినీ మించి, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేయడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులకు ఏ నెలకు ఆ నెల జీతాలు ఇవ్వలేని, తెలంగాణ మోడల్ బుజానికి ఎత్తుకునేది ఎవరు? వంటి ప్రశ్నలు ఇంకా చాలాచాలానే ఉన్నాయనుకోండి, అది వేరే విషయం.

అదలా ఉంటే, కేసీఆర్ అలా రాష్ట్రాలను చుట్టి వస్తుంటే, కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు ఏదో ఒక పేరున తెలంగాణలో పర్యటిస్తున్నారు.కేసేఆర్ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. నిజానికి, ఇటీవల కాలంలోరాష్ట్రంలో బీజేపే జాతీయ నాయకుల పర్యటన లేని రోజంటూ లేదంటే ఆశ్చర్య పోనవసరం లేదు. అంతలా బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రం పై దృష్టిని కేంద్రీకరించింది.  అందుకే కావచ్చును, ఇటీవల ముఖ్యమంత్రి కేసేఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తమ పాత్ర లేదని వివరణ ఇచ్చే సందర్భంలో, బీజేపీ నాయకులు మిడతల దండుల రాష్ట్రంపై దాడి చేస్తున్నారని, తమపై  నిరాధారమైనఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తపరిచారు. కవిత చేసింది ఆరోపణే అయినా, నిజంగా కూడా బీజేపీ 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కేంద్రంలో వరసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటినుంచే పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన పేరిట  ప్రచారయాత్రను పెద్ద ఎత్తున  చేపట్టింది. అయితే, అది ఏదో ఒక్క తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు. గత లోక్ సభ ఎన్నికల ఫలితాల ఆధారంగా  దేశం మొత్తంలో ఎంపిక చేసిన 144 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది.

రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలు కలిపి ఒక క్లస్టర్‌ ఏర్పాటు చేశారు. 40 మంది కేంద్ర నేతలకు ఈ క్లస్టర్‌ బాధ్యతలు అప్పగించారు. ఈ నియోజకవర్గాల్లో కేంద్రమంత్రులు, ఎంపీలు పర్యటిస్తున్నారు. మూడు రోజులపాటు నియోజకవర్గాల్లోనే బస చేస్తారు. అలా గుర్తించిన నియోజక వర్గాలలో తెలంగాణలోని 17 నియోజక వర్గాలు ఉన్నాయి. అందుకే, గత నెలలో ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంఛి, కేంద్ర మంత్రులు ఒకరి వెంట ఒకరు తమకు కేటాయించిన లోక్ సభ నియోజక వర్గాల్లో పర్యటిస్తున్నారు.  ఇందులో భాగంగానే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కామారెడ్డి జిల్లా జహీరాబాద్‌ లోక్ సభ నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు.అసందర్భంగా ఆమె, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలే చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌కు మించి అప్పులు చేస్తోందని ఆమె  ఆరోపించారు. ఈ రుణ భారం మొత్తాన్నీ తిరిగి ప్రజలపైనే మోపనుందన్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని.. ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్‌ అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో పుట్టబోయే ప్రతి బిడ్డపై రూ.1.25 లక్షల అప్పు ఉంటుందని.. దీన్నిబట్టి కేసీఆర్‌ ఏ స్థాయిలో అప్పులు చేశారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. తెలంగాణను కేసీఆర్‌ నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపైనే ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎంతమేర వెళ్తున్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకే బీజేపీ అధిష్ఠానం పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.

కేంద్ర పథకాల పేర్లను తెలంగాణ ప్రభుత్వం మార్చేసి, తన సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. పేర్లు మారిస్తే తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రశ్నిస్తామని నిర్మల స్పష్టం చేశారు. రాష్ట్ర రైతులకు అన్నీ ఇస్తున్నామని కేసీఆర్‌ సర్కారు పదేపదే చెబుతోందని.. కానీ, రాష్ట్రంలో 100మంది రైతుల్లో 91.7శాతం మంది అప్పులపాలయ్యారన్నారు. ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే నాలుగో స్థానంలో ఉందని తెలిపారు.పేరు మార్చి.. డబుల్‌ బెడ్‌రూం అన్నారు..కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం ఆవాస్‌ యోజన కింద తెలంగాణలో ఇళ్లు కట్టించాల్సి ఉండగా.. కేసీఆర్‌ ప్రభుత్వం కేంద్ర పథకం పేరును మార్చి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు అని ప్రచారం చేసుకుంటోందని నిర్మల మండిపడ్డారు.

అలాగే పీఎం మత్స్య సంపద యోజన, నేషనల్‌ కో ఆపరేటివ్‌ డెవల్‌పమెంట్‌, ఫసల్‌ బీమా యోజన, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాల పేర్లను మార్చేసి.. అమలు చేస్తున్నారని విమర్శించారు. ఉపాధి పథకంపై తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ పథకం కింద కేంద్రం గడిచిన 8 ఏళ్లలో తెలంగాణకు రూ.20వేల కోట్లు ఇచ్చిందన్నారు. తెలంగాణలో ఉపాధి హామీ పథకం అమలు, నిధుల వ్యయంలో అవకతవకలు జరగడంతోనే కేంద్ర ప్రభుత్వం సర్వే చేయిస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని మరిచి దేశమంతా తిరుగుతూ తానే ప్రధానమంత్రినని కేసీఆర్‌ చెప్పుకుంటున్నారని నిర్మల ఎద్దేవా చేశారు. బిహార్‌ వెళ్లిన కేసీఆర్‌ నవ్వులపాలయ్యారన్నారు. కాళేశ్వరం నీటి ప్రాజెక్టును డబ్బుల కోసం కట్టారా..? నీటి కోసం కట్టారా..? అని కేసీఆర్‌ను నిర్మల ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం మొదట రూ.39,500 కోట్లు ఖర్చు అవుతాయని నిర్ణయించారని, ఇప్పుడు దాని విలువను రూ.1.20 లక్షల కోట్లకు పెంచారని విమర్శించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు కేసీఆర్‌ ప్రభుత్వం ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. అయితే, కేంద్ర మంత్రి నిర్మల సీతరామన్ చేసిన ఆరోపణలు లేదా ఇచ్చిన వివరణలో ఎక్కడా కొత్తదనం లేదు. నిజానికి, గత కొంత కాలంగా బీజేపీ, తెరాసల మధ్య ఇదే జుగుల్ బందీ నడుస్తోందని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి జుగుల్ బందీ వలన ప్రయోజనం ఉండదని, చర్యలు లేకుడా చేసే విమర్శలు, ప్రతి విమర్సలకు విలువ ఉండదని అంటున్నారు. 

By
en-us Political News

  
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.