Publish Date:May 18, 2026
జనసేనకు బీజేపీ ఝలక్ ఇవ్వనుందా? గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఒంటరి పోరుకే మొగ్గు చూపుతోందా? అంటే కాషాయ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తున్నది. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో విశ్వనగరం హైదరాబాద్ లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతుండటంతో అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రస్తుత అధికార పక్షం కాంగ్రెస్ నగరంలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తుంటే.. గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలను సాధించాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.
జీహెచ్ఎంసీ గత ఎన్నికల్లో ఊహించని రీతిలో భారీగా స్థానాలను గెలుచుకున్న బీజేపీ, అదే ఊపును 2023 అసెంబ్లీ మరియు 2025 లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించింది. ఈ నేపథ్యంలో, 2026 గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లోని తమ మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి పోటీ చేసి నగరంలో మరింత పట్టు సాధిస్తుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది. ఇటీవల ప్రధాని మోదీతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జరిపిన భేటీ కూడా ఈ పొత్తుల అంచనాలకు మరింత బలాన్ని చేకూర్చింది.
అయితే.. క్షేత్రస్థాయిలో తాజా పరిణామాలు పరిశీలిస్తే పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని బీజేపీ నాయకత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే.. ఈ పరిణామం జనసేన పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
2020 గ్రేటర్ ఎన్నికల సమయంలో జనసేన పలు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ.. బీజేపీకి అనుకూలంగా చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి బలంగా ఉన్నందున, ఈసారి హైదరాబాద్‌లో బీజేపీ తమకు సహకరిస్తుందని జనసేన ఆశిస్తోంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ ఒంటరిపోరుకు సిద్ధపడితే మాత్రం.. తెలంగాణలో జనసేనను బలోపేతం చేయాలన్న ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశలకు గండిపడినట్లే అంటున్నారు పరిశీలకులు.
ఒకవేళ బీజేపీ మద్దతు లేకుండా జనసేన ఒంటరిగా బరిలోకి దిగితే.. బీజేపీ నష్టపోతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే గత ఎన్నికలలో లాగే.. జనసేన పోటీకి దూరంగా ఉండేలా బీజేపీ హైకమాండ్ పవన్ కల్యాణ్ ను ఒప్పించాలని రాష్ట్ర బీజేపీ నాయకులు కోరుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు ఉంటేనే.. కమలం వికసించే అవకాశం ఉంటుందన్నది వారి భావన. త్రిముఖ పోరులో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పుడు జనసేనకు కొన్ని సీట్లు కేటాయించడం ఎందుకన్న భావన వారిలో వ్యక్తం అవుతోంది. జీహెచ్ఎంసీపై పట్టు సాధిస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారం చేపట్టాలన్న ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు అవకాశలు మెరుగ్గా ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి బీజేపీ ఒంటరి పోరు నిర్ణయంపై జనసేన ఎలా స్పందిస్తుందో?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp--jolt-to-jana-sena-25-220217.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.