అయితే అన్నామలై.. కాదంటే నిర్మలమ్మ!

Publish Date:Apr 14, 2025

Advertisement

భారతీయ జనతా పార్టీ  జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఒక ప్రహసనంగా మారింది. బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరు? అన్న ప్రశ్నకు  సమాధానం ఇటు పార్టీ నేతలకు,  అటు రాజకీయ పండితులకు కూడా చిక్కడం లేదు. చిక్కు ముడి వీడడం లేదు. ఎందుకనో ఏమో కానీ  పార్టీ జాతీయఅధ్యక్షు  ఎన్నిక చాలా జటిలంగా మారిందనే అభిప్రాయం అయితే అంతటా వినిపిస్తోంది.

అవును  పార్టీ అగ్ర ద్వయం, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా కూడా ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేక పోతున్నారు. అందుకే  ఇటీవల లోక్ సభలో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్  ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే బీజేపీ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోలేక పోతోందని వ్యంగంగా అన్నప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సరదా సమాధానంతో, అసలు విషయాన్ని దాట వేశారు. అయితే అక్కడికది సరిపోయినా.. ఈ ప్రశ్న బీజేపీని వెంటాడుతోందని అంటున్నారు. అయితే  ఇక అట్టే కాలం ఈ సస్పెన్స్  కొనసాగదని.. కొనసాగించడం కుదరదనీ కూడా  అంటున్నారు. 

బీజేపీ ప్రస్తుతఅధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఇటు పార్టీ అధ్యక్షుడు, అటు కేంద్ర మంత్రిగా జోడు పదవుల్లో కొనసాగడం విమర్శలకు తావిస్తోంది.  సో.. జేపీ నడ్డా స్థానంలో నూతన అధ్యక్షుడి  ఎన్నిక ఇక వాయిదా వేసే అవకాశం  లేదని అంటున్నారు. అలాగే రేపో మాపో బీజేపీ జాతీయ అధ్యక్షుని ప్రకటన వెలువడుతుందన్న విశ్వాసంతో  పార్టీ వర్గాలు  ఉన్నాయి.  ఏప్రిల్  18,19, 20 తేదీల్లో బెంగుళూరులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి.ఈలోగా నూతన  అధ్యక్షుడి ప్రకటన ఖాయంగా ఉంటుందని పార్టీ  వర్గాలు అంటున్నాయి. 

అదొకటి అలా ఉంటే, నూతన అధ్యక్షుడి ఎంపిక విషయంలో బీజేపీ అనేక కోణాల్లో ఆలోచిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా ఈ సారి అధ్యక్ష పదవిని దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వాలనే కోణంలో బీజేపీ అగ్ర ద్వయం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తో పాటుగా ఆర్ఎస్ఎస్  పెద్దలు కూడా సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే  తొలి సారిగా పార్టీ పగ్గాలు మహిళా నేతకు అప్పగించే ఆలోచన కూడా చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ రచన చేస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం తమిళనాడు నుంచే జాతీయ అధ్యక్షుడిని ఎంచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు చెపుతున్నారు.   

అదే నిజంమైతే, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రముఖంగా వినిపిస్తోంది. తమిళనాడులో పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా, చదవు, సంస్కారం, పార్టీ విధేయత, సిద్దాంత నిబద్దత ఉన్నఅన్నామలై’కి పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి అవసరమైన అర్హతలు అన్నీ ఉన్నాయని అంటున్నారు. అలాగే, అన్నాడీఎంకేతో పొత్తు నేపథ్యంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న అన్నామలైకి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని అమిత్ షా చెప్పారు.  సో..  దక్షణాదికి అధ్యక్ష పదవి పదవి ఖాయం అయితే అన్నామలైకి అధ్యక్ష పదవి ఖాయం అంటున్నారు. ఇంకా కొన్ని పేర్లు వినిపిస్తున్నా.. మోదీ, షా ఇద్దరూ  అన్నామలై వైపే మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. అందుకే, దక్షణాదికి దక్కితే, అన్నామలై అధ్యక్ష పదవిని చేపట్టడం ఖాయమని అంటున్నారు.   

అలాగే  పార్టీ జాతీయ అధ్యక్ష పదవి మహిళా నేతకు  ఇవ్వాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు  బీజేపీలో ముఖ్య మంత్రులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అయిన మహిళలు ఉన్నారు, అలాగే, లోక్ సభలో ప్రతిపక్ష నేత, లోక్  సభ స్పీకర్, రాష్ట్రాల గవర్నర్లు వంటి రాజ్యాంగ పదవులను అందుకున్న మహిళలు ఉన్నారు. కానీ, పార్టీ జాతీయ అధ్యక్ష పీఠం మాత్రం మహిళా నేతకు ఇంతవరకు దక్కలేదు. అందుకే ఈ సారి తొలిసారిగా, మహిళా నేతకు పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నారని అంటున్నారు. 

అదే జరిగితే, ఇప్పటికే,  ఫస్ట్ విమెన్ డిఫెన్స్ మినిస్టర్, ( ప్రప్రథమ మహిళా రక్షణ మంత్రి )  ఫస్ట్  ఫుల్ టైమ్   ఫైనాన్సు మినిస్టర్ తో  పాటుగా వరసగా ఎనిమిది సార్లు వార్షిక బడ్జెట్  ప్రవేశ పెట్టిన తొలి అర్హిక మంత్రిగా రికార్డులు సొంతం చేసుకున్న నిర్మలా సీరామన్  ఖాతాలో బీజేపీ తొలి మహిళా ప్రెసిడెంట్ మకుటం కూడా చేరుతుందని అంటున్నారు. 

అయితే ఆమె ప్రధానంగా రాజకీయ నాయకురాలు కాదు. ఎకడమిక్ పర్సన్ . ఎకనమిక్ లేడీ.  (ఒక విధంగా ఆమె లేడీ మనోహన్  సింగ్ అనుకోవచ్చును. ఇద్దరి మధ్య ఒకటే తేడా, ఇద్దరి దారులు వేరు, పార్టీలు వేరు) అదీ గాక ఆమె ప్రత్యక్ష ఎన్నికలలో ఇంతవరకు పోటీ చేసి గెలవలేదు. అంతే కాదు, 2024ఎన్నికలకు ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే స్థోమత, సామర్ధ్యం తనకు లేదని, పోటీ చేసేందుకు విముఖత చూపారు. అదొకటి అయితే  ఆర్ఎస్ఎస్ గ్రీన్ సిగ్నల్ విషయంలోనూ అనుమానాలు ఉన్నాయి..

అయితే  దక్షణాది  కోణంలో చూసినప్పుడు ఆమెకు డబుల్ అర్హతలున్నాయని అంటున్నారు. ఆమె తమిళనాడు ఆడ బిడ్డ, ఆంధ్రా/తెలంగాణ కోడలు, ఏపీ, కర్నాటక రాష్ట్రాల నుంచి రాజ్య సభకు ఎన్నికయ్యారు. సో.. ఒక్క కేరళ మినహా  మిగిలిన అన్ని దక్షణాది రాష్ట్రాలతో ఆమెకు వ్యక్తిగత, రాజకీయ సంబంధాలున్నాయి. హిందీ అంతగా రాక పోయినా, తమిళ్, తెలుగు భాషలతోపాటు ఇంగ్లీష్ లో నూ మాట్లాడ గలరు.  సో .. బీజేపీ నాయకత్వం నిజంగా దక్షిణాదికి పార్టీ పగ్గాలు అప్పగించాలని, మహిళా నేతకు అధ్యక్ష పదవి ఇవ్వాలనే జంట ఆలోచనలు చేస్తున్నదే  నిజం అయితే, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు రెండు అర్హతలూన్న  నిర్మలమ్మకు అధ్యక్ష పదవి ఖాయం అంటున్నారు.అయితే..  ఫైనల్ గా పేరు బయటకు వచ్చే వరకు సస్పెన్స్  తప్పదు.

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫ‌కేష‌న్ జారీ చేయ‌గానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.