పశ్చిమ బెంగాల్ లో కమల వికాసం.. హ్యాట్రిక్ విజయాల తరువాత టీఎంసీకి ఎదురైన పరాజయం

Publish Date:May 4, 2026

Advertisement

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పరాజయం పాలైంది. వరుసగా మూడు సార్లు రాష్ట్రంలో విజయం సాధించి అధికారంలో కొనసాగిన తృణమూల్ కు ఈ సారి పరాజయం తప్పలేదు. ముఖ్యంగా ఈ ఎన్నికలలో బీజేపీ వర్సెస్ మమతా బెనర్జీ అనే కంటే.. మమతా బెనర్జీవర్సెస్ సువేందు అధికారి అన్నట్లుగా సాగాయని చెప్పవచ్చు.  భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సువేందు అధికారి గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతను ఓడించారు. ఈ సారి ఆయన నందిగ్రామ్ తో పాటు మమత సొంత నియోజకవర్గమైన భవానీ పూర్ నుంచి కూడా ఆమె ప్రత్యర్థిగా రంగంలోకి దిగి ఆమెకు సవాల్ విసిరారు.

అది పక్కన పెడితే.. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం  దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు.  రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ఈ స్థాయిలో పట్టు సాధించడం తృణమూల్ కాంగ్రెస్‌కు తేరుకోలేని ఎదురుదెబ్బగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మరోవైపు, అధికార టీఎంసీ కేవలం 109 స్థానాలలో మాత్రమే ఆధిక్యంలో ఉంది.  దీదీ కోటగా పేరుగాంచిన దక్షిణ కోల్‌కతా ప్రాంతంలో సైతం కమల వికాసం పరిశీలకులను సైతం విస్మయపరుస్తోంది.  

రాష్ట్రంలో ఈ స్థాయిలో మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ దెబ్బతినడానికి  సువేందు అధికారి పాత్ర అత్యంత కీలకం అని చెప్పవచ్చు. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా, నందిగ్రామ్ ఉద్యమంలో కీలక పాత్రధారిగా ఉన్న సువేందు..  ఇప్పుడు ఆమెకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా మారారు. 2021లో నందిగ్రామ్ వేదికగా మమతను ఓడించి చరిత్ర సృష్టించిన ఆయన..  ఈసారి మమత సొంత నియోజకవర్గం భవానీపూర్ లో ఆమెకు ప్రత్యర్థిగా బీజీపీ అభ్యర్థిగా బరిలోకి దిగా ఆమెకు చుక్కలు చూపించారు. ఒకప్పటి ఆమె అనుచరుడే.. ఇప్పుడు ఆమె అధికారం కల్పోవడానికి కారణంగా మారారని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద పశ్చిమెంగాల్ లో కమలం జయకేతనం ఎగురవేయడం దేశ రాజకీయాలలో అత్యంత కీలక పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.