తెలంగాణలో అతిపెద్ద సైబర్ మోసం.. రూ. 8.6 కోట్లు నష్టపోయిన డాక్టర్ !

Publish Date:Aug 19, 2024

Advertisement

తెలంగాణలో అతిపెద్ద సైబర్ మోసం జరిగింది.  ఈ మోసంలో  హైదరాబాద్ కు చెందిన ఓ  డాక్టర్ ఏకంగా రూ. 8.6 కోట్లు మోసపోయాడు. తనను చీట్ చేసిన వైనాన్ని డాక్టర్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు తెలంగాణలో నమోదైన బిగ్గెస్ట్  సైబర్ క్రైం ఇదేనని పోలీసులు అంగీకరిస్తున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కి బాధితుడు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.మే 21న వైద్యుడి ఫేస్‌బుక్‌లో ఓ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ పేరిట ప్రకటన కనిపించింది. దీంతో అందులోని వివరాలను నింపాడు. ఆ వెంటనే కంపెనీ ప్రతినిధులమంటూ కొందరు వైద్యుడిని సంప్రదించి ఆయన ఫోన్ నంబరును నాలుగు వాట్సాప్ గ్రూపుల్లో చేర్చారు. ప్రముఖ కంపెనీల తరపున స్టాక్ బ్రోకర్లుగా తాము వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయా సంస్థలు వివరాలు చెప్పాలని డాక్టర్  అడిగితే అవి రహస్యమని, చెప్పడం కుదరదని స్పష్టం చేశారు. ఆ తర్వాత నాలుగు సంస్థల పేరిట యాప్ లింకులను పంపి వాటిలో డబ్బులు  పెట్టుబడి పెట్టమన్నారు. ఆ తర్వాత వచ్చిన లాభాలను ఎప్పటికప్పుడు ఉపసంహరించుకోవచ్చని కూడా చెప్పారు. దీంతో పలుమార్లు పెట్టుబడులు పెట్టిన వైద్యుడు లాభాలను కూడా ఉపసంహరించుకున్నాడు. దీంతో వారిపై మరింత నమ్మకం కుదరడంతో విడతల వారీగా ఏకంగా రూ. 8.6 కోట్లు పెట్టుబడిగా పెట్టాడు. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత లాభాల ఉపసంహరణకు వైద్యుడు ప్రయత్నించగా కుదరలేదు. లాభాల్లో 20 నుంచి 30 శాతం చెల్లిస్తేనే వాటిని ఉపసంహరించుకునే అవకాశం ఉందని చెప్పడంతో వైద్యుడు షాకయ్యాడు. ఆపై కస్టమర్ కేర్‌ను సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో తాను మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈజీగా డబ్బు సంపాదించవచ్చనో, కమిషన్‌కు ఆశపడో తమ బ్యాంకు ఖాతాలను సైబర్ క్రిమినల్స్‌కు అప్పగించే వారిని ‘మనీ మ్యూల్స్’గా వ్యవహరిస్తారు. డాక్టర్  మొత్తంగా 63 విడతల్లో బదిలీ చేసిన నగదులో కొంతమొత్తం కరీంనగర్‌ జిల్లా వీణవంక బ్యాంకుకు చేరగా.. మిగతా మొత్తం విశాఖపట్టణం, కడప, ముంబై, ఢిల్లీ, థానే, చెన్నై, లక్నో, ఝాన్సీ, ఇండోర్, లుథియానాతోపాటు హరియానాలోని కొన్ని ప్రాంతాల్లోని మ్యూల్ ఖాతాలకు వెళ్లినట్టు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.