రాజ్ కేసిరెడ్డికి బిగ్ షాక్
Publish Date:May 1, 2025
Advertisement
వారం రోజులు సీఐడీ కస్టడీకి అనుమతించిన కోర్టు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజ్ కేసిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. రాజ్ కేసిరెడ్డినివారం రోజులు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం (మే 2) నుంచి ఏడు రోజుల పాటు సీఐడీ విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆ వారం రోజులూ రాజ్ కేసిరెడ్డిని ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు విచారించడానికి కోర్టు సీఐడీకి అనుమతించింది. ఈ విచారణ ద్వారా రాజ్ కేసిరెడ్డి వెనుక ఉన్న సూత్రధారుల వివరాలను రాబట్టాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. రాజ్ కేసిరెడ్డిని ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మద్యం కుంభకోణానికి సంబంధించి రాజ్ కేసిరెడ్డికి అనేక మార్లు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.అయితే అన్ని సార్లూ ఆయన విచారణకు డుమ్మా కొట్టి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే రాజ్ కేసిరెడ్డి హైదరాబద్ కు వస్తున్నట్లు అందిన కచ్చితమైన సమాచారం మేరకు పోలీసులు ఆయనను శంషాబాద్ విమానాశ్రంలో అదుపులోనికి తీసుకుని విజయవాడకు తరలించారు. అనంతరం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో కేసిరెడ్డి వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు కేసిరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. మరోవైపు ఈకేసులో ముందస్తు బెయిల్ కోసం రాజ్ కేసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడా ఆయనకు నిరాశే ఎదురైంది. కేసిరెడ్డి పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
http://www.teluguone.com/news/content/big-shock-to-raj-kesireddy-39-197292.html





