దానం నాగేందర్ కు బిగ్ షాక్, కేసు నమోదు
Publish Date:Aug 13, 2024
Advertisement
ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదైంది. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానం గోడ దూకడు వ్యవహారంపై బిఆర్ఎస్ శ్రేణుల్లో నిరసన వ్యక్తమౌతుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కు సంబంధించి పార్కు గోడను దానం అనుచరులు కూల్చివేశారు. దానం సమక్షంలోనే ఈ కూల్చివేత జరిగిందని అధికారులు జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానంపై కేసు నమోదు చేయడం తెలంగాణలో చర్చనీయాంశమైంది. కూల్చివేత వల్ల 10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అధికారులు ఆరోపిస్తున్నారు. తనపై కేసు నమోదు చేయించిన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని దానం నాగేందర్ అంటున్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది ప్రజలు అని, అధికారులు వస్తుంటారు వెళుతుంటారు నేను లోకల్ అని దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. నందగిరి హిల్స్ లోని పార్కు గోడను దానం కూల్చివేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నందిగిరి హిల్స్ వద్ద ఉన్న పార్కు గోడను ఎమ్మెల్యే, అతని అనుచరులు ధ్వంసం చేశారని ఆరోపిస్తూ జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఇన్‌ఛార్జ్ వి పాపయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాగేందర్ అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఎదిగారు. మూడు పర్యాయాలు ఆసిఫ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. . 2004లో మాత్రం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో జంప్ అయ్యారు ఆతర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రయ్యారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో దానం బిఆర్ఎస్ లో చేరి మంత్రిగా కొనసాగారు. గత ఎన్నికల్లో బిఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ వేవ్ లో తిరిగి మాతృసంస్థ అయిన కాంగ్రెస్ లో చేరడం వివాదాస్పదమైంది. పైగా అధికార పార్టీలో ఉన్నప్పటికీ పోలీస్ కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది.
http://www.teluguone.com/news/content/big-shock-to-daana-nagender-25-182872.html





