ఢిల్లీలో బీజేపీకి బిగ్ షాక్! ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గా షెల్లీ ఒబెరాయ్ విజయం

Publish Date:Feb 22, 2023

Advertisement

ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం. ఈ గెలుపు గెలుపు ఓటములనే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్య సౌందర్యం అనీ అభివర్ణిస్తారు. అయితే, రాజకీయ పార్టీలు, నాయకులు గెలుపును ఆస్వాదించినంతగా, ఓటమిని అంగీకరించలేరు. అధికారం కోసం అడ్డదారులు తొక్కేందుకు ఏ మాత్రం వెనకాడరు. అందునా, ఇక దేశంలో తమకు తిరుగే లేదన్న భావనలో ఉన్న బీజేపీ అయితే, ఓటమిని హుందాగా స్వీకరించడం అనేది ఎప్పుడో  మరిచి పోయింది. అందుకే,  ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన అనేక ప్రభుత్వాలను అప్రజాస్వామికంగా కూల్చి వేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజలల్లోనూ అదే అభిప్రాయం రోజు రోజుకూ బల పడుతోంది. ఇప్పటికే గోవా మొదలు, కర్ణాటక, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర సహా ఏడెనిమిది రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అండతో కూల్చి వేసిందనే ఆరోపణలున్నాయి. 

 కాగా, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లోనూ బీజేపీ అదే ప్రయత్నం చేసింది. అయితే, ప్రజల తీర్పును కాదని గద్దెనెక్కేందుకు కమల దళం చేసిన ప్రయత్నాలు సుప్రీం కోర్టు తీర్పుతో విఫల మయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ  అభ్యర్ధి  షెల్లీ ఒబెరాయ్   ఢిల్లీ మేయర్ గా ఎన్నికయ్యారు. బీజీపీ నాయకత్వానికి వ్రతమూ చెడింది. ఫలితమూ దక్కలేదు.  దేశ రాజధాని ఢిల్లీలో ఆ పార్టీ ప్రతిష్ట మరింతగా మసకబారింది.   

నిజానికి గత ఏడాది చివర్లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు ఆప్ కు అనుకూలంగా విస్పష్ట తీర్పునిచ్చారు. కార్పోరేషన్ లోని 274 సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఆప్  కు 135 సీట్లు రాగా.. బీజేపీ 113కు పరిమితమైంది. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సాయంతో పది మంది నామినేటెడ్ సభ్యుల్ని నియమించుకున్న బీజేపీ, తన బలాన్ని  పెంచుకుంది. అలాగే కార్పోరేషన్లో కోఆప్షన్ సభ్యులుగా ఉన్న ఢిల్లీ ఎంపీలు, ఎమ్మెల్యేల సాయంతో ఆప్ ను వెనక్కి నెట్టి మేయర్ స్దానం కైవసం చేసుకునేందుకు కాషాయ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. 

దీంతో మేయర్ ఎన్నిక మూడుసార్లు వాయిదా పడింది. నామినేట్ సభ్యులను ఓటింగ్‌‌కు లెఫ్టినెంట్ గవర్నర్ ‌అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ,  ఆప్ నిరసనలకు దిగడం, ఆప్-బీజేపీ మధ్య ఘర్షణ వాతావారణం తలెత్తడంతో ఈ పరిస్థితి తలెత్తింది. చివరిగా మేయర్ ఎన్నికలకు ఫిబ్రవరి 16వ తేదీని  లెఫ్టినెంట్ గవర్నర్ ప్రకటించారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశంతో ఆ తేదీ కూడా వాయిదా పడింది. నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కును కల్పించాలన్న లెఫ్టినెంట్ గవర్నర్  నిర్ణయాన్ని ఆప్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ నేపథ్యంలో నామినేట్ సభ్యులకు ఓటు హక్కు నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా  తీర్పుతో ఎంసీడీ (ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్) మేయర్ ఎన్నికకు మార్గం సుగమమైంది.

 చివరకు ఢిల్లీ  మేయర్‌ గా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి డాక్టర్ షెల్లీ ఒబెరాయ్ గెలుపొందారు. షెల్లీ ఒబెరాయ్ తన సమీప బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తం 266 ఓట్లు పోల్ కాగా, షెల్లీ ఒబెరాయ్‌కు 150, రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి.

By
en-us Political News

  
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.