Publish Date:Oct 25, 2024
ఇటీవలి ఎన్నికల సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ అప్పట్లో నంద్యాల వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డికి మద్దతు పలికేందుకే నంద్యాల వెళ్లారు. ఆ సందర్భంగా భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. శిల్పా రవిచంద్ర కిషోర్ కు ఓటేసి గెలిపించాలన్న పిలుపును కూడా అప్పట్లో అల్లు అర్జున్ ఇచ్చారు.
దీంతో అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య సయోధ్య చెడిందన్న వార్తలు కూడా అప్పట్లో గట్టిగా వినిపించాయి. ఇప్పటికీ ఇరు కుటుంబాల మధ్యా అగాధం పూడలేదనే అంటారు. అదలా ఉంచితే అల్లు అర్జున్ నంద్యాల పర్యటన సందర్భంగా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారంటూ నంద్యాల పోలీసులు అల్లు అర్జున్ తో పాటు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
ఇప్పుడు ఆ కేసును క్వాష్ చేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను విచారించిన హైకోర్టు వచ్చే నెల 6వ తేదీ వరకూ అల్లు అర్జున్, శిల్పా రవిచద్రకిషోర్ రెడ్డిలపై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని పేర్కొంటూ విచారణను వనంబర్ 6కు వాయిదా వేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/big-relief-to-allu-arjun-in-high-court-25-187410.html
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.