Publish Date:Apr 22, 2022
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నంచీ ఎబీవీని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురౌతూనే ఉన్నారు
ఏబీవీ. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆ సస్పెన్షన్ అలా కొనసాగుతూనే ఉంది. దీనిపై ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం రెండేళ్లకు మించి తనపై సస్పెన్షన్ వేటు వేయడానికి వీళ్లేదని.. తనను వెంటనే విధుల్లోకి తీసుకోవడంతో పాటు.. పూర్తి జీతం చెల్లించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఏబీవీ.
దానిపై సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఆయన సస్పెన్షన్ రద్దు చేస్తూ దేశ సర్వోన్నత న్యాయ స్థానం తీర్పు ఇచ్చింది వెంటనే ఏబీవీని విధుల్లోకి తీసుకోవాలంటూ ఆదేశించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/big-relief-to-abv-in-supreme-25-134786.html
టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీ వైపు చూస్తున్నదా? క్రమంగా ఏపీలో సినీ ఇండస్ట్రీ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయా? అంటే అవుననే సమాధానమే సినీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇటీవల పుష్ప2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై తెలంగాణ సర్కార్ సీరియస్ కావడం, ఆ తరువాత తీసుకున్న నిర్ణయాలతో సినీ ప్రముఖులు కాస్త ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం (జనవరి 5)ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు.
సినీ నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హజరయ్యారు. సంధ్య థియేటర్ ఘటనలో రేవతి చనిపోవడం , ఆమె కుమారుడు ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో కొట్టు మిట్టాడంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
సినీ నటుడు అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు చేరుకోనున్నారు. రెగ్యులర్ బెయిల్ మంజూరుకావడంతో వ్యక్తిగత పూచీ కత్తు సమర్పించడానికి ఆయన కోర్టుకు హాజరవుతున్నారు.
సామర్ల కోటకు చెందిన గోలి శ్యామల కేవలం గృహిణి మాత్రమే . కనీసం స్విమ్మర్ కూడా కాని ఆమె విశాఖ ఆర్ కె బీచ్ నుంచి కాకినాడ తీరం వరకు ఈది సంచలనం సృష్టించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీలో ఉక్కపోతే మిగిలింది. వణికించేస్తున్న చలిలో కూడా ఆయనను ఉక్కపోత వేధిస్తున్నట్లుంది. జనవరి చివరి వారం నుంచి జిల్లాలలో పర్యటిస్తానంటూ ఆయన చేసిన ప్రకటనకు సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచే సానుకూలత వ్యక్తం కాకపోవడంతో ఆయన పర్యటనలను వాయిదా వేసుకుని హడావుడిగా విదేశీయానానికి రెడీ అయిపోయారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరి కొద్ది రోజులలో షెడ్యూల్ వెలువడనుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఆప్, బీజేపీ అస్త్రశస్త్రాలతో సన్నద్ధమైపోయాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక చాలా వరకూ పూర్తి చేయడమే కాకుండా, విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి.
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరిగే మహాకుంభమేళాకు ఉగ్రముప్పు పొంచి ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి. పుష్కారనికి ఒక సారి జరిగే మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచీ 40 కోట్ల మందికి పైగా హాజరౌతారన్న అంచనాలు ఉన్నాయి.
విశ్వ హిందూ రక్ష పరిషత్ ఆద్వర్యంలో మన గుడి-మన బలం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆలయ ఆదరణ,సంరక్షణ ప్రతీ హిందు ఇంటి నుంచే మొదలవ్వాలని పిలుపు నిచ్చారు.
ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ ఫ్యాక్టరీలో శనివారం (జనవరి 4) సంభవించిన భారీ పేలుడులో ఎనిమిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఫ్యాక్టరీ యాదగిరిగుట్ట మండలం కందుకూరులో ఉంది.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి గ్రమంలోని సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఏటా వేడుకగా, ఘనంగా నిర్వహించే రథసప్తమిని ప్రభుత్వం రాష్ట్ర పంగుడగా ప్రకటించింది. తొలి సారిగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న రథ సప్తమి పండుగను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసిన భారీ ల్యాండ్ స్కామ్ లో బుల్లితెర నటి, జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి బుక్ అయ్యారు. విజయవాడ, ఇబ్రహీం పట్నం కేంద్రంలో ఓ ముఠా 700 కోట్ల రూపాయల భూ దందాకు పాల్పడింది. ఇందుకు సంబంధించి కేసు కూడా నమోదైంది. ఆ కేసులో రీతూ చౌదరి పేరు కూడా ఉంది.
సోషల్ మీడియా చేస్తున్న మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతోందన్న భావన సర్వత్రా ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా కారణంగా పిల్లలు దారి తప్పుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి. వాస్తవానికి అది నిజం కూడా చిన్న వయస్సు నుంచే సోషల్ మీడియా ఎడిక్ట్ లుగా మారిపోతున్న పిల్లలు చదువు, ఆటలకు దూరం అవుతున్నారు.