Publish Date:Jan 13, 2025
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. హైద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 7 వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ సోమవారం సాయంత్రం ప్రారంభమైంది.
Publish Date:Jan 13, 2025
తిరుమల ఘట్ రోడ్డుపై ప్రమాదం సంభవించింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్లిన ఆరుగురు భక్తులు మృత్యువాత ఘటన మరువక ముందే సోమవారం(జనవరి 13) ఉదయం కొండపై శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇచ్చే కౌంటర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది.
Publish Date:Jan 13, 2025
వికారాబాదు జిల్లా పూడూరు మండలం శంకర్ పల్లి గ్రామంలో చెల్లా చెదురుగా పడి ఉన్న దాదాపు 55 చారిత్రాత్మక శిల్పాలు ఆలనా లేక రక్షణ కోసం ఎదురు చూస్తున్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా పరిశోధకుడు డా ఈమని శివనాగిరెడ్డి చెప్పారు.
Publish Date:Jan 13, 2025
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిల్చిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ఆయన పరిస్థితి ఇపుడు కొరివితో తలగోక్కున్నట్టు తయారయ్యింది. తన పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ కౌశిక్ రెడ్డి దూకుడు తగ్గించుకోకపోవడంతో కొత్త చిక్కులు తెచ్చుకుంటున్నారు.
Publish Date:Jan 12, 2025
ఢిల్లీ లో అధికారంలో ఉన్న ఆప్ కు సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల వేళ కాగ్ నివేదిక దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కాగ్ నివేదిక మరో సారి ఢిల్లీ మద్యం విధానంలో ఆప్ అవకతవకలపై చర్చను తెరపైకి తీసుకువచ్చింది.
Publish Date:Jan 12, 2025
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సిట్టింగ్ ఎంఎల్సీ జీవన్ రెడ్డికి పార్టీ హ్యాండిచ్చినట్లే కనిపిస్తోంది. నిజామాబాద్ గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన జీవన్ రెడ్డికి మరోసారి ఆ చాన్స్ ఇచ్చే విషయంలో అధిష్ఠానం సుముఖంగా లేదని అంటున్నారు.
Publish Date:Jan 12, 2025
దాదాపు ఏడాది కాలంగా రేవంత్ తన కేబినెట్ ను ఎప్పుడు విస్తరిస్తారా అన్న దానిపై తెలంగాణ వ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇదిగో అదిగో అంటూ పలు ముహూర్తాలు కూడా తెరమీదకు వచ్చాయి. కేబినెట్ విస్తరణే లక్ష్యంగా రేవంత్ పలుమార్లు హస్తిన వెళ్లి పార్టీ హైకమాండ్ తో భేటీ అయ్యారు కూడా.
Publish Date:Jan 12, 2025
కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయా? ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్న ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ల మధ్య పరిస్థితి ఉప్పూ నిప్పులా తయారైందా? పైకి సయోధ్యగా ఉన్నట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా వారి మధ్య విభేదాలు పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారాయా? అంటే పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది.
Publish Date:Jan 12, 2025
జగన్ ఐదేళ్ల అరాచకపాలనను జనం అసహ్యించుకున్నారు. ఆయన కేబినెట్ లోని కొందరు మంత్రుల తీరును, వారి అసహ్యకరమైన భాషను భరించలేకపోయారు. అందుకే ఎన్నికలలో ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఘోరాతి ఘోరంగా ఓడించి బుద్ధి చెప్పారు. తెలుగుదేశం కూటమికి చారిత్రాత్మక విజయం కట్టబెట్టారు.
Publish Date:Jan 11, 2025
తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వైకుంఠ ద్వాదశి నాటు అంటే శనివారం (జనవరి 11) శ్రీవారిని మొత్తం 53 వేల 13 మంది దర్శించుకున్నారు.
Publish Date:Jan 11, 2025
హైదరాబాద్ శివారు శామీర్ పేట మండలం, మందాయిపల్లి శివాలయం దగ్గర రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా పడి ఉన్న గణేష్ శిల్పం బాదామి చాళుక్యుల కాలం నాటిదని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు
Publish Date:Jan 11, 2025
వైసీపీ పరిస్ధితి రాష్ట్రంలో నానాటికీ తీసికట్టు నాగంభోట్లుఅన్నట్లుగా తయారౌతోంది. ఏ నియోజకవర్గ ఇన్ చార్జిని ఎప్పుడు పీకేస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది. ఛాదస్తపు మొగుడు చెబితే వినడు తిడితే ఏడుస్తాడు అన్నట్లుగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఉందని ఆ పార్టీ నేతలే తలలుపట్టుకుంటున్న పరిస్థితి.
Publish Date:Jan 11, 2025
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుస్తక ప్రియుడు అన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలు సందర్భాలలో వెల్లడించారు. ఇటీవల అంటే ఈ నెల 2వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో బుక్ ఫెయిర్ ప్రారంభమైంది. ఈ బుక్ ఫెయిర్ ను ప్రారంభించిన పవన్ కల్యాణ్ ఆ సందర్భంగా పుస్తకపఠనం తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు.