హైద్రాబాద్ పోలీసులు మంగళవారం నుంచి (నవంబర్ 5) స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వాహనదారులు ట్రాఫిక్ నియమనిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే , రాంగ్ సైడ్ డ్రైవింగ్ కు కు వ్యతిరేకంగా ప్రయాణిస్తే కఠినచర్యలు తీసుకుంటున్నట్టు హెచ్చరించారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాలు జరిగి 215 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో చాలామంది హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వారే . హెల్మెట్ తప్పనిసరి చేస్తూ ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగించనున్నట్టు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ (ట్రాఫిక్) పి. విశ్వప్రసాద్ తెలిపారు. తలకు గాయమైతే మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/big-alert-for-hyderabad-motorists-39-187919.html
తీహార్ జైలు నుంచి కండిషన్ బెయిల్ మీద విడుదలైన బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత మరో మారు తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, తైవాన్ దేశాలకు చెందిన బౌద్ధ పరిశోధకులు గురువారం నాడు నాగార్జున కొండను సందర్శించారని పురావస్తు పరిశోధకుడు బుద్ధవనం కన్సల్టెంట్, ప్లీచ్ ఇండియా సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
భార్యా భర్తల మధ్య గొడవలు సహజం. కలహాలు లేని కాపురాలు ఉండనే ఉండవు. భర్త నేరం చేస్తే భార్య కేసులు నమోదు చేయడం సహజం. కానీ బాపట్ల జిల్లాలో ఓ భార్య భర్తపై కేసు పెట్టలేదు . కోర్టుల మీద నమ్మకం సన్నగిల్లిందేమో భర్తకు ఏకంగా మరణ శిక్ష విధించింది.
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలన అవినీతికి హద్దే లేదన్నట్లుగా సాగింది. ఆ పార్టీ నేతలు అందినకాడికి ప్రభుత్వ భూములతోపాటు అటవీ భూములు, ప్రైవేట్ భూములను కబ్జాలు చేసేశారు. మరికొన్ని భూములను తక్కువ ధరకే జగన్ ప్రభుత్వం తన అనుకూల ట్రస్టులకు, కంపెనీలకు కట్టబెట్టేసింది. ఫలితంగా ప్రజలకు మేలు చేస్తారని అధికారాన్ని అప్పగిస్తే.. జగన్ మాత్రం తన హయాంలో ప్రభుత్వ, ప్రైవేట్ భూములను దోచుకోవటమే పనిగాపెట్టుకొని పాలనను గాలి కొదిలేశారు.
కొత్త సంవత్సరం సందర్భంగా పిఠాపురంలోని జనసేనాని నివాసం వద్ద ఫ్లెక్సీలు సందడి చేశాయి. జనసేన మద్దతుదారులు, కార్యకర్తలకు 2024 గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఆ పార్టీ ఎన్నికలలో అద్భుత విజయాన్ని సాధించడమే కాకుండా, పార్టీ అధినేత జనసేనాని పిఠాపురం నుంచి మంచి మెజారిటీతో విజయం సాధించారు.
తెలంగాణతో బాటు ఎపిలో సంచలనమైన కామారెడ్డి ట్రయాంగిల్ సుసైడ్ ట్వి స్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుసుకుంటున్నాయి
జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ రుణచక్రబంధంలో ఇరుక్కుపోయింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా నిబంధనలకు విరుద్ధంగా పరిమితులకు మించి అప్పులు ఎలా పొందగలుగుతోందన్న అనుమానాలు అప్పట్లో సర్వత్రా వ్యక్తంమయ్యాయి. పొరుగునే ఉన్న సంపన్న రాష్ట్రం తెలంగాణకు అడుగడుగునా ఆంక్షలు, అడ్డంకులతో రూపాయి అప్పు పట్టని పరిస్థితి ఉంటే అందుకు భిన్నంగా ఏపీకి మాత్రం ఎలాంటి పరిమితులూ, ఆంక్షలూ, అడ్డంకులూ లేకుండా అప్పులు ఎలా దక్కాయన్న ప్రశ్నకు అప్పట్లో సమాధానం చెప్పే నాథుడే లేకుండా పోయాడు.
నారా లోకేష్. ఏపీ రాజకీయాలలో ఆయన ఇప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్. ప్రజలలో తిరుగులేని నాయకుడు. అయినా ఆయన పార్టీ విషయానికి వచ్చే సరికి ఒక కార్యకర్త మాత్రమే. ఒక కార్యకర్తలాగే పార్టీ కోసం శ్రమిస్తారు. అదే విధంగా తోటి కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతారు. లోకేష్ లోని ఈ లక్షణాలను ఆయన రాజకీయాలలో అడుగుపెట్టక ముందే.. వైసీపీ పసిగట్టేసింది. అందుకే లోకేష్ కు రాజకీయాలంటేనే విరక్తి కలిగేలా చేయాలన్న ఉద్దేశంతో ఆయనపై విమర్శల దాడి చేసింది. బాడీ షేమింగ్ కు పాల్పడింది.
రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని మెడకు ఉచ్చు బిగుస్తోంది. భారీ మొత్తంలో బియ్యం మాయం వెనుక పేర్ని నాని హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు. తెరవెనుక ఉండి ఆయనే రేషన్ బియ్యాన్ని మధ్యవర్తుల ద్వారా కాకినాడ పోర్టుకు తరలించినట్లు ఆధారాలతోసహా పోలీసులు గుర్తించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరు కానున్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకూ ఐదు రోజుల పాటు దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే.
దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు. ఇందు కోసం ఆయన ఈ నెల 19న దావోస్ కు బయలుదేరి వెడతారు.
పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటన అనంతరం జరిగిన పరిణామాలతో ఒక్క సారిగా హైదరాబాద్ నుంచి సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలివచ్చేస్తుందన్న చర్చ ప్రారంభమైంది. తెలంగాణ సర్కార్ టాలీవుడ్ పట్ల చిన్న చూపుతో వ్యవహరిస్తున్నదన్న అనుమానాలు అన్ని వర్గాల నుంచీ వ్యక్తం అయ్యాయి.
సినీ పరిశ్రమ వర్సెస్ రేవంత్ సర్కార్ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయిపోయిందా? అన్న ప్రశ్నకు ఔనన్న సమాధానమే వస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వేసిన అడుగులతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచే బీఆర్ఎస్ తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివాదాన్ని ఎగదోసి రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్న విమర్శలు సినీ పరిశ్రమ నుంచే వస్తున్నాయి.