ప్రధాని చేతుల మీదుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రారంభం.. ఎప్పుడంటే?

Publish Date:Jul 8, 2026

Advertisement

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. విమానాశ్రయ నిర్మాణ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం (జులై 7) స్వయంగా పరిశీలించారు. టెర్మినల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్, రన్‌వే, గ్రీనరీ అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనులు పూర్తి అయ్యాయనీ,  విమానాశ్రయం ఆపరేషన్లకు సిద్ధంగా ఉందని నిర్మాణ సంస్థ అధికారులు మంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ  భోగాపురం విమానాశ్రయం ఇంత అద్భుతంగా రూపుదిద్దుకుంటుందని ఊహించలేదన్నారు. కూటమి ప్రభుత్వం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం, ప్రజల సహకారంతో కేవలం రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేశామన్న ఆయన,  విమానాశ్రయానికి అవసరమైన లైసెన్స్ కూడా మంగళవారం (జులై 7) లభించిందనీ, ఇక ప్రారంభోత్సవమే తరువాయనీ చెప్పారు.

ఈ ప్రారంభోత్సవం ఎప్పుడు అన్న ప్రశ్నకు..  ప్రధానమంత్రి  ఎప్పుడు ప్రారంభోత్సవానికి రావడానికి తేదీ ఖరారు చేస్తారో, ఆరోజునే ప్రారంభిస్తామన్నారు. అలాగే.. ప్రారంభోత్సవం జరిగిన వారం రోజులలోనే ఇక్కడ నుంచి విమానరాకపోకలను ప్రారంభిస్తామని మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.  భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక ఆకర్షణగా చేప ఆకారంలో టెర్మినల్ భవనాన్ని నిర్మించినట్లు చెప్పిన ఆయన..  విమానాశ్రయం నిర్మాణం కోసం  భూములు ఇచ్చిన రైతులు, స్థానిక ప్రజలు అందిం చిన సహకారాన్ని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.  

By
en-us Political News

  
డిలీట్ చేసిన డేటా కోసం పోలీసులు ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఆ ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికలో షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. రావణ్ అమాయక యువతులను టార్గెట్ గా చేసుకుని వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం.. ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసినట్లు ఫోరెన్సీక్ ల్యాబ్ నివేదికలో వెల్లడైనట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చర్చనీయాంశంగా మారింది. ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ప్రముఖ నాయకులపై నిస్సిగ్గుగా విమర్శలు చేసినందుకు పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ప్రస్తుత చట్టాల ప్రకారం ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్ల కింద కేసులు నమోదు కావడంతో కోర్టులో అతనికి తక్షణమే బెయిల్ లభించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 9 ప్రముఖ AI టూల్స్ యొక్క బలహీనతను వాడుకుని హాకర్లు భారీ బాట్‌నెట్ నెట్‌వర్క్‌లను సృష్టిస్తున్నారు. హాలూస్క్వాటింగ్ (HalluSquatting) అనే ఈ సరికొత్త సైబర్ ముప్పు గురించిన పూర్తి వివరాలు మీకోసం.
2026 సంవత్సరంలో ఉక్కపోత మరియు వేసవి ఎండలను తరిమికొట్టే సరికొత్త షార్క్, డైసన్ మరియు డ్రియో కంపెనీల టాప్ 5 కూలింగ్ ఫ్యాన్స్ వివరాలు, ధరలు మరియు వాటిలోని AI మోషన్ ట్రాకింగ్, వాటర్ మిస్ట్ టెక్నాలజీ ప్రత్యేకతలు మీకోసం.
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఫలితాల తర్వాత గ్లోబల్ చిప్ మార్కెట్లో భారీ పతనం. అమెరికా వాల్ స్ట్రీట్‌లో ఇంటెల్, ఏఎండీ, శాన్‌డిస్క్ షేర్లు కుప్పకూలాయి. నాస్‌డాక్ 500 పాయింట్లు పడిపోవడానికి గల పూర్తి కారణాలు, చమురు ధరల పెరుగుదల వివరాలు ఇక్కడ చూడండి.
అమరావతి ల్యాండ్ పూలింగ్ రైతులకు ఏపీసీఆర్‌డీఏ భారీ ఊరటనిచ్చింది. ఎకరాకు రూ. 40,000 కౌలు పెంపు, మరో 15 ఏళ్ల పొడిగింపుతో పాటు రూ. 1.5 లక్షల రుణమాఫీ ప్రకటనతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తాగే వాటర్ బాటిల్ ధర రూ.49 లక్షలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ నిజాలు, ఆ బాటిల్ ప్రత్యేకతలు ఇక్కడ చూడండి.
ఫీఫా వరల్డ్ కప్ 2026 క్వార్టర్ ఫైనల్స్ ముందు ఊహించని పరిణామం క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్, మరియు హోస్ట్ యూఎస్ఏ జట్లు టోర్నీ నుండి అవుట్ కావడంతో క్వార్టర్ ఫైనల్ టికెట్ల ధరలు భారీగా పడిపోయాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భారత్ ఘోర ఓటమి తర్వాత సంజూ శాంసన్‌ను జట్టు నుంచి తప్పించడంపై వివాదం చెలరేగింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన వివరణ, స్టేడియం బయట ఫ్యాన్స్ హంగామా పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) మరియు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఉపయోగించి దీర్ఘకాలంలో కోట్ల రూపాయల సంపదను ఎలా సృష్టించాలో ఉదాహరణలతో సులభంగా తెలుసుకోండి.
బ్రిటన్ గ్రామీణ ప్రాంతాల్లో 14 చిన్న తరహా అణు రియాక్టర్ల (SMR) ఏర్పాటు కోసం పోలిష్ బిలియనీర్ 35 బిలియన్ పౌండ్ల భారీ పెట్టుబడిని ప్రకటించారు. AI డేటా సెంటర్ల విద్యుత్ అవసరాల కోసం గూగుల్ భాగస్వామ్యంతో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు చూడండి.
హోమ్ సెక్యూరిటీ కెమెరాలు అనవసరమైన ఖర్చు అనుకుంటున్నారా? అర్ధరాత్రి వేళ ఇద్దరు దొంగలు గోడ దూకిన ఈ భయంకరమైన నిజ జీవిత సంఘటన మరియు కెమెరాల ప్రాముఖ్యత గురించి ఇప్పుడే చదవండి.
బిట్‌డిఫెండర్ ఐడెంటిటీ థెఫ్ట్ ప్రొటెక్షన్‌తో ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయండి. బడ్జెట్ ధరలో $1 మిలియన్ ఇన్సూరెన్స్, డార్క్ వెబ్ మానిటరింగ్ మరియు క్రెడిట్ అలర్ట్స్ పొందే పూర్తి వివరాలు మీకోసం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.