భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారుతుందా.. టోన్ న్యూస్ సమగ్ర విశ్లేషణ..!

Publish Date:Aug 12, 2026

Advertisement

 

ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చే శక్తి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉందా అనే చర్చ తీవ్రంగా సాగుతోంది. దాదాపు దశాబ్ద కాలం క్రితం సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో రూపుదిద్దుకున్న ఈ భారీ ప్రాజెక్టు, అనేక రాజకీయ, పరిపాలనాపరమైన హెచ్చుతగ్గులను దాటుకుని ఇప్పుడు సాకారమవుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రజల కలల ప్రతిరూపంగా నిలుస్తున్న ఈ ఎయిర్‌పోర్ట్ కేవలం ఒక మౌలిక వసతి మాత్రమే కాదు, తరతరాల వలస వ్యథలకు చెక్ పెట్టే ఒక ఆశల దీపం. విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయం ఇండియన్ నేవీ నియంత్రణలో ఉండటం వల్ల విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లపై పలు భద్రతా పరిమితులు ఉండేవి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్టులు, సిక్స్ లేన్ రహదారులు, భారీ పరిశ్రమల రాకతో ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో తదుపరి గ్రోత్ హబ్‌గా మారుతుందా అనే అంశంపై మాజీ ఐఏఎస్ అధికారి పి.వి. రమేష్‌  తెలుగు వన్ ఎండీ కంఠమనేని రవిశంకర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

ఈ పరిమితులను అధిగమించడానికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ అత్యంత కీలకమైన ప్రత్యామ్నాయంగా మారింది. అయితే, కేవలం విమానాశ్రయాన్ని నిర్మించినంత మాత్రాన ఒక ప్రాంత ఆర్థిక స్థితిగతులు రాత్రికి రాత్రే మారిపోవు. ఎయిర్‌పోర్ట్ అనేది అభివృద్ధికి అవసరమైన ఒక ముఖ్యమైన సాధనం మాత్రమే. వలసల బాట వీడి స్వగ్రామాల్లోనే ఉపాధి ఒకప్పుడు ఉపాధి వెతుక్కుంటూ పాలమూరు లాగే ఉత్తరాంధ్ర ప్రజలు కూడా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. కుటుంబాలను విడిచిపెట్టి, పొట్టకూటి కోసం వేరే రాష్ట్రాల్లో పడే బాధలు వర్ణనాతీతం. భోగాపురం ఎయిర్‌పోర్ట్ రాకతో ఈ వలసల కష్టాలకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఎయిర్‌పోర్ట్ కేంద్రంగా టూరిజం, హోటల్ రంగాలు, సర్వీస్ ఇండస్ట్రీ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.

అంతేకాకుండా, ఉత్తరాంధ్రలో విస్తారంగా ఉన్న జీడిపప్పు (క్యాషూ) పంటను, సముద్ర ఉత్పత్తులను ప్రోత్సహించే ఫుడ్ ప్రాసెసింగ్, మెరైన్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఎయిర్‌పోర్ట్ దగ్గరగా ఉండటం వల్ల ఎగుమతులు సులువవుతాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అభివృద్ధి చెందితే, స్థానిక యువతకే స్వగ్రామాల్లోనే ఉద్యోగాలు లభిస్తాయి. ఐటీ డేటా సెంటర్లు, ఆర్సెలర్ మిట్టల్ వంటి మెగా స్టీల్ ప్లాంట్లు విశాఖ పరిసరాల్లో ఏర్పాటు కావడం వల్ల గ్రోత్ మోమెంటమ్ ఊపందుకుంటోంది. మౌలిక వసతుల విస్తరణే అసలైన ప్రగతివిశాఖపట్నం పోర్ట్, గంగవరం పోర్ట్, శ్రీకాకుళం ప్రతిపాదిత పోర్ట్‌లతో పాటు గోల్డెన్ క్వాడ్రిలేటరల్ సిక్స్ లేన్ రహదారులు ఇప్పటికే ఈ ప్రాంతంలో రవాణా వ్యవస్థను బలోపేతం చేశాయి. 

శ్రీకాకుళం నుంచి భోగాపురం వరకు ఉన్న బెల్ట్ రేర్ ఎర్త్స్  అలాగే గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. ఇది భవిష్యత్ ఆర్థిక రంగానికి అత్యంత కీలకమైన అంశం. అయితే, కేవలం ఎయిర్‌పోర్ట్, ఎక్స్‌ప్రెస్ వేలు మాత్రమే కాకుండా మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ప్రజల రవాణా వ్యవస్థ  బస్సు సర్వీసులు, రైలు కనెక్టివిటీ విస్తరించినప్పుడే అభివృద్ధి పూర్తిస్థాయిలో ఫలించి సాధారణ ప్రజలకు మేలు జరుగుతుంది. రాబోయే రెండు దశాబ్దాల్లో ఉత్తరాంధ్ర ఆర్థికంగా, సామాజికంగా సరికొత్త రూపాంతరం చెందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 


 

Bhogapuram International Airport, Uttarandhra Development, Vizag Growth Hub, PV Ramesh IAS Interview, Andhra Pradesh, Vizag Airport vs Bhogapuram Airport, Srikakulam,CM Chandrababu

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.