భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఆలస్యానికి జగనే కారణం : పెమ్మసాని

Publish Date:Aug 2, 2026

Advertisement

 

వైసీపీ  నాయకుల వైఖరి, గత ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఉత్తరాంధ్ర ప్రజల కలల ప్రాజెక్ట్ అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం తీవ్రంగా ఆలస్యమైందని కేంద్ర విమానయాన, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

2015లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనతో భోగాపురం వద్ద 2,700 ఎకరాల విస్తీర్ణంలో భారీ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు జీఎంఆర్ సంస్థతో ఒప్పందం కుదిరిందని పెమ్మసాని గుర్తుచేశారు. 2019 నాటికే తెలుగుదేశం ప్రభుత్వం రూ.2,200 ఎకరాల భూసేకరణను విజయవంతంగా పూర్తి చేసిందని వివరించారు.

మిగిలిన 500 ఎకరాల సేకరణను అడ్డుకునేందుకు వైకాపా నేతలు కోర్టుల్లో వరుస కేసులు వేశారని ఆయన ఆరోపించారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా ప్రభుత్వం స్వయంగా కొన్ని కేసులను ఉపసంహరించుకున్నప్పటికీ, ఐదేళ్ల కాలంలో కేవలం 300 ఎకరాలు మాత్రమే సేకరించగలిగిందని పెమ్మసాని విమర్శించారు.

భోగాపురం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ వైకాపా ప్రభుత్వం రీ-టెండర్లకు వెళ్లిందని, ఈ అనవసర నిర్ణయాల వల్లే ఎయిర్‌పోర్ట్ నిర్మాణం సంవత్సరాల తరబడి వెనుకబడిందని దుయ్యబట్టారు. క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో నిర్మించి ప్రాజెక్టును సాకారం చేసింది తమ ప్రభుత్వమైతే, వైకాపా నాయకులు క్రెడిట్ కొట్టేయాలని చూడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

మరోవైపు, దేశంలోని పొగాకు రైతులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లడించారు. ప్రతి ఒక్క పొగాకు రైతుకు రూ.50 వేల వరకు ఎలాంటి వడ్డీ లేని రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఈ వడ్డీలేని రుణ సదుపాయం ద్వారా సుమారు 40 వేల మంది పొగాకు రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం చర్యలు తీసుకుంటుంటే, పొగాకు అంశాన్ని సైతం వైకాపా నాయకులు రాజకీయం చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వేగవంతంగా పూర్తవుతున్న భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయని, రానున్న రోజుల్లో ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మరింత వేగవంతం అవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Bhogapuram Airport, Pemmasani Chandrasekhar, CM Chandrababu, Jagan Mohan Reddy, tobacco farmers interest-free loan

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లో అనధికారిక చిట్టీల పేరుతో మోసాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి.
స్నేహబంధానికి ప్రతీకగా నిలిచే ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు ఒకే కుటుంబంలో ఆరని శోకాన్ని మిగిల్చాయి.
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్..!
ఆంధ్రప్రదేశ్- ఆస్ట్రేలియా భాగస్వామ్యంలో నూతన అధ్యాయం ప్రారంభమైంది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.
దక్షిణ అమెరికా దేశమైన పెరూలో ఆదివారం ఉదయం అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది.
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనార్..
ప్రాణం కంటే మిన్నగా చూసుకునే బంధం.. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా భుజం తట్టి నేనున్నాను అని ధైర్యాన్నిచ్చే ఏకైక బంధం స్నేహం.
జులై నెలలో ఏకంగా రూ.140.28 కోట్లు ఆల్‌టైమ్ రికార్డు.. !
ఓ వైపు వివాహేతర సంబంధం.. మరోవైపు కుమార్తె విషయంలో రగిలిన తల్లి ఆగ్రహం.. చివరకు ఈ వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు ఆషాఢ మాస బోనాలు ప్రతీకగా నిలుస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
జెన్‌ జీ దెబ్బకు మోదీ అర్ధరాత్రి ఇన్‌స్టా వీడియో పెట్టాల్సి వచ్చింది..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.