సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.!

Publish Date:Oct 13, 2026

Advertisement

సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల ఆర్డర్లను 15 రోజుల్లో పూర్తి చేసి అందజేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. సింగరేణి కార్మికుల మారుపేర్ల సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరిస్తామని తెలిపారు. మెడికల్ ఇన్వాలిడేషన్ పరీక్షల కోసం ప్రతి ఏరియా ఆసుపత్రిలో నెలవారీ బోర్డు సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.

కరోనా సహా ఇతర స్థానిక కారణాలతో ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు వన్‌టైమ్ ఆప్షన్ కింద తిరిగి ఉద్యోగాలు కల్పించే అంశంపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. సింగరేణి భూముల్లో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, సింగరేణి అధికారులతో కూడిన కమిటీ నెల రోజుల్లో అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు 34% లాభాల బోనస్‌ కింద ఒక్కొక్కరికి ₹1,53,912, కాంట్రాక్ట్ కార్మికులకు ఒక్కొక్కరికి ₹5,500 బోనస్ అందించాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.

కార్మికులకు మెరుగైన నివాస సదుపాయాలు.!

సింగరేణి ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన డి-టైప్ క్వార్టర్ల స్థానంలో అన్ని వసతులతో కొత్త నివాస సముదాయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్మికుల జీవన ప్రమాణాలను పెంచేలా నెహ్రూ పేరుతో హౌసింగ్ కాలనీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సింగరేణి పరిధిలోని అన్ని కాలనీలను ఆధునీకరించి, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, విద్యుదీకరణ, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. కాలనీల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణపైనా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రులు.. ఉచిత క్యాన్సర్ పరీక్షలు.!

సింగరేణి ఏరియా ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. నిపుణులైన వైద్యులను నియమించడంతో పాటు కార్డియాక్, క్యాథ్ ల్యాబ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సింగరేణి ప్రాంతంలోని గ్రామాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

సింగరేణిలో సోలార్ విద్యుత్‌కు ప్రాధాన్యం.!

సింగరేణి పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాణిజ్య అవసరాలకు వినియోగంలో ఉన్న ప్రాంతాలకు ఆటంకం కలగకుండా, ఖాళీ భూములు, ఓవర్‌బర్డెన్ (ఓబీ) గుట్టలపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.

రామగుండంలో థర్మల్ విద్యుత్ కేంద్రానికి గ్రీన్ సిగ్నల్.!

ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలులో భాగంగా రామగుండంలో సింగరేణి ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగరేణి కార్మికుల ఆదాయపన్నును సంస్థ నుంచే ప్రభుత్వానికి చెల్లించేలా ఆదేశాలు జారీ చేసినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. సింగరేణి అధికారులకు సంబంధించిన పీఆర్‌పీ చెల్లింపులు చేపట్టాలని యాజమాన్యాన్ని ఆదేశించారు.

విద్య, వ్యవసాయం, కార్మికుల భద్రతకు చర్యలు.!

భూపాలపల్లిలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపుపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సత్తుపల్లి, భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. కార్మికులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి భద్రతా కిట్లను సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు.సింగరేణి కార్మికుల సంక్షేమం, వైద్య సేవల మెరుగుదల, గృహ వసతులు, విద్యుత్ ఉత్పత్తి, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

 

 

 

[ Bhatti Vikramarka, Singareni Workers, Singareni Collieries, Telangana Government, Dependent Jobs, Pending Job Orders, Singareni Employees Welfare, Singareni Housing, Nehru Housing Colonies, Singareni Hospitals, Free Cancer Screening, Singareni Solar Power Plants, Ramagundam Thermal Power Plant, Singareni Workers Benefits ]

By
en-us Political News

  
 హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎల్బీనగర్‌ హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన కౌకూర్ ఆర్చిడ్ విల్లాలో ఐదేళ్ల చిన్నారి ఆరిలియా హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి
హైదరాబాద్ నగరంలో క్రిప్టోకరెన్సీ లావాదేవీల నేపథ్యంలో తీవ్ర కలకలం రేపిన భారీ దోపిడీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఐదున్నర ఎకరాల స్థలం తమదేనంటూ ఓ వ్యక్తి, అతని కుమారుడు వచ్చి.. సి. రామచంద్రయ్య నుంచి అడ్వాన్స్ గా పాతిక లక్షలు తీసుకున్నారు. ఆ తరువాత పత్రాలు చూపించకుండా తప్పించుకున్నారు. సి.రామచంద్రయ్య ఫిర్యాదు మేరకు  ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దేశానికి నిజంగా స్వరాజ్యం సిద్ధించిందా? అంటే అనుమానమే అనే సమాధానం వచ్చేలా ఉంది. కొన్ని చోట్ల ఇంకా కొనసాగుతున్న పెత్తందారీ వ్యవస్థ కారణంగా.  పేరుకే ప్రజాస్వామ్యం కానీ   చోట్ల అభివృద్ధి, సామాజిక ఐక్యత పేరుతో  కొన్ని ప్రాంతాలలో అనధికార కమిటీలు ప్రజలపై ఆంక్షలు విధిస్తున్నాయి. 
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో  ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి  అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల  వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న  నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.