ఐదేళ్ల చిన్నారి హత్య కేసులో షాకింగ్ నిజాలు.!

Publish Date:Oct 13, 2026

Advertisement

హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన కౌకూర్ ఆర్చిడ్ విల్లాలో ఐదేళ్ల చిన్నారి ఆరిలియా హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అభం శుభం తెలియని చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు విక్రమ్ కుమార్‌.. ఆ తర్వాత పోలీసుల కళ్లుగప్పి నగరం విడిచి పారిపోయేందుకు చేసిన ప్రయత్నాలు విస్మయం కలిగిస్తున్నాయి. ఒకవైపు బీహార్‌కు పారిపోయేందుకు ప్లాన్‌.. మరోవైపు పోలీసులకు అనుమానం రాకుండా కొత్త ఉద్యోగం కోసం వేట! ఇలా పరారీలో ఉన్న సమయంలోనే నాలుగు ప్రాంతాల్లో తిరిగిన నిందితుడు.. చివరకు పోలీసుల వలకు చిక్కాడు.

డబ్బుల కోసం ఫోన్‌.. ఆపై బీహార్‌కు పారిపోయే ప్లాన్‌.!

అక్టోబర్ 10వ తేదీ సాయంత్రం.. కౌకూర్‌లోని ఆర్చిడ్ విల్లాలో ఐదేళ్ల చిన్నారి ఆరిలియాను హత్య చేసిన అనంతరం విక్రమ్ కుమార్‌ అక్కడి నుంచి బయటకు వెళ్లాడు. కౌకూర్ కూరగాయల మార్కెట్‌ వద్దకు చేరుకున్నాడు. చిన్నారి మృతదేహం రెండు రోజుల వరకు బయటపడదనే అంచనాతో ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు.ఆ తర్వాత తన పరారీ ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమయ్యాడు. 

బస్సులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి రైలు ఎక్కి తన స్వస్థలమైన బీహార్‌కు పారిపోవాలనేది అతడి ప్లాన్‌.... కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న విక్రమ్‌కు అక్కడ పోలీసులు  చిన్నారి ఫొటోల గాలింపు చర్యలు చేపట్టడాన్ని గమనించి అప్రమత్త మయ్యాడు.అక్కడి నుంచి బీహార్‌కు వెళ్తే పోలీసులకు చిక్కే ప్రమాదం ఉందని భావించి.. వెంటనే తన ప్రణాళిక మార్చుకున్నాడు.రైల్వే స్టేషన్‌ నుంచి మరో బస్సు ఎక్కి పటాన్‌చెరు వైపు వెళ్లాడు. నగరం విడిచి పారిపోయే ప్రయత్నాన్ని పక్కనపెట్టి, పోలీసులకు అనుమానం రాకుండా కొత్త ఉద్యోగం కోసం వెతకడం మొదలుపెట్టాడు.


అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు.. ఉద్యోగం కోసం పరుగులు.!

గతంలో పటాన్‌చెరులో పనిచేసిన అనుభవం ఉండటంతో.. రాత్రి 11 గంటల సమయంలో అక్కడి సెక్యూరిటీ గార్డులను కలిసి ఉద్యోగం కావాలని అడిగాడు. అక్కడి నుంచి క్యాబ్‌లో కూకట్‌పల్లి ఎల్లమ్మబండకు బయలుదేరాడు. మార్గమధ్యలో మల్లంపేట్ వద్ద ఆగి, ఓ గేటెడ్ కమ్యూనిటీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులను కలిసి ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అనంతరం ఎల్లమ్మబండలోని తన స్నేహితుడు ఉపేందర్ వద్దకు చేరుకున్నాడు. తెల్లవారుజామున నాలుగు గంటల వరకు అక్కడి సెక్యూరిటీ గార్డులతో మాట్లాడుతూ ఉద్యోగం కోసం ఆరా తీశాడు.ఓ చిన్నారి హత్య కేసులో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ తిరుగుతున్న నిందితుడు.. మరోవైపు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొత్త ఉద్యోగం కోసం ప్రాంతాలు మారుతూ ప్రయత్నాలు కొనసాగించాడు.

 బోరబండలో స్నేహితుల గదిలో మకాం.!

ఎల్లమ్మబండ నుంచి బయలుదేరిన విక్రమ్‌.. ఐడీఎల్ ట్యాంక్ ప్రాంతంలోని వైన్స్ వద్ద మద్యం సేవించాడు. ఆ తర్వాత ఆటోలో బోరబండకు చేరుకున్నాడు. అక్కడ తన స్నేహితులు ఉంటున్న గదిలో తలదాచుకున్నాడు.సికింద్రాబాద్ నుంచి పటాన్‌చెరు.. అక్కడి నుంచి మల్లంపేట్, ఎల్లమ్మబండ.. చివరకు బోరబండ! ఇలా నగరంలోని పలు ప్రాంతాల్లో విక్రమ్ కదలికలు సాగాయి. అయితే, నిందితుడు ఎక్కడున్నా వదిలిపెట్టకూడదన్న లక్ష్యంతో పోలీసులు గాలింపును మరింత ముమ్మరం చేశారు.

అద్దె బైక్‌లపై మఫ్టీలో పోలీసులు.. 15 ప్రత్యేక బృందాలతో వేట.!

నిందితుడి ఆచూకీ గుర్తించేందుకు మల్కాజ్‌గిరి పోలీసులు 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పోలీసు వాహనాల్లో తిరిగితే విక్రమ్ అప్రమత్తమయ్యే అవకాశం ఉండటంతో.. అద్దె బైక్‌లపై మఫ్టీలో నగరవ్యాప్తంగా గాలింపు చేపట్టారు.సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్‌, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ అతడి కదలికలపై నిఘా పెట్టారు. ఎల్లమ్మబండలో విక్రమ్ స్నేహితుడు ఉపేందర్‌ను కూడా విచారించారు. విక్రమ్ తన వద్దకు వచ్చినప్పుడు ఏదో తప్పు చేసినట్లు అనుమానించిన ఉపేందర్‌.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలో నిందితుడి కదలికలకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించారు.

బోరబండలో పోలీసుల వల.. పరారీకి తెర.!

చివరకు సీసీటీవీ ఫుటేజ్‌, సెల్‌ఫోన్ సిగ్నల్స్‌, ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో బోరబండలో దాక్కున్న విక్రమ్ కుమార్‌ ఆచూకీని పోలీసులు గుర్తించారు. అక్కడ అతడిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.ఐదేళ్ల చిన్నారి హత్య కేసులో నిందితుడి పరారీ ప్రయత్నాలు, ఉద్యోగం కోసం తిరిగిన ప్రాంతాలు ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారాయి. పోలీసుల నుంచి తప్పించుకుని నగరం విడిచి వెళ్లాలని ప్రయత్నించిన ఈ నరరూప రాక్షసుడు విక్రమ్ కుమార్‌.. చివరకు పోలీసుల వలకు చిక్కాడు. చిన్నారి హత్యకు దారితీసిన పరిస్థితులు, కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

 

 

 

[ Bollaram child murder case, Aurelia Moses, Vikram Kumar, Villa Orchids Bolarum, Gated community crime, Malkajgiri Police, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telugu News, Telugu One ] 


 

By
en-us Political News

  
హైదరాబాద్ నగరంలో క్రిప్టోకరెన్సీ లావాదేవీల నేపథ్యంలో తీవ్ర కలకలం రేపిన భారీ దోపిడీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఐదున్నర ఎకరాల స్థలం తమదేనంటూ ఓ వ్యక్తి, అతని కుమారుడు వచ్చి.. సి. రామచంద్రయ్య నుంచి అడ్వాన్స్ గా పాతిక లక్షలు తీసుకున్నారు. ఆ తరువాత పత్రాలు చూపించకుండా తప్పించుకున్నారు. సి.రామచంద్రయ్య ఫిర్యాదు మేరకు  ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దేశానికి నిజంగా స్వరాజ్యం సిద్ధించిందా? అంటే అనుమానమే అనే సమాధానం వచ్చేలా ఉంది. కొన్ని చోట్ల ఇంకా కొనసాగుతున్న పెత్తందారీ వ్యవస్థ కారణంగా.  పేరుకే ప్రజాస్వామ్యం కానీ   చోట్ల అభివృద్ధి, సామాజిక ఐక్యత పేరుతో  కొన్ని ప్రాంతాలలో అనధికార కమిటీలు ప్రజలపై ఆంక్షలు విధిస్తున్నాయి. 
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో  ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి  అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల  వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న  నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో  వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో  నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో  నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.