అధికార లాంఛనాలతో భారతీ రాజా అంత్యక్రియలు

Publish Date:Jun 10, 2026

Advertisement

దిగ్గజ దర్శకుడు భారతీ రాజా అంత్యక్రియలను అధికార  లాంఛనాలతో జరపాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. భారతీ రాజా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం విజయ్.. తమిళ చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన అసమాన సేవలకు, ఆయన స్థాయికి గుర్తింపుగా ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.  అంతకుముందు భారతీరాజా భౌతిక కాయానికి సీఎం విజయ్ ఘన నివాళులర్పించారు. 

చెన్నైలోని భారతీ రాజా నివాసానికి వెళ్లిన సీఎం విజయ్  ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.    చలనచిత్ర రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన దార్శనికుడు భారతీరాజా అని తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్  తన సంతాప సందేశంలో పేర్కొంది.  అలాగే భారతీరాజా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. 

 కాగా.. ప్రముఖ దర్శకుడు భారతీ రాజా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  తన అద్భుతమైన సృజనాత్మకతతో వెండితెరపై సరికొత్త ఒరవడిని సృష్టించిన లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా  మరణం భారత చలనచిత్ర రంగానికి, కోట్లాది మంది అభిమానులకు తీరని లోటు అని పేర్కొన్నారు. భారతీరాజా కేవలం తమిళ సినీ పరిశ్రమకే పరిమితం కాకుండా.. తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్న పవన్ కల్యాణ్ ఆయన దర్శకత్వంలో వచ్చిన  ఆరాధన సీతాకోకచిలుక వంటి చిత్రాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటాయన్నారు. భారతీ రాజా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

By
en-us Political News

  
ఇందులో సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు ఆధునిక ప్రపంచానికి అవసరమైన ప్రాథమిక డిజిటల్ నైపుణ్యాలపై కాలేజీలోనే ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత డిగ్రీ చివరి సంవత్సరం అంటే మూడో ఏడాదిలో విద్యార్థులు నేరుగా క్షేత్రస్థాయి పరిశ్రమలతో అనుసంధానమైన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లోకి అడుగుపెడతారు.
అయితే బస్సును సీజ్ చేసిన తర్వాత ప్రయాణికుల గమ్యస్థానానికి వెళ్లేందుకు ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులతో సహా ప్రయాణికులందరూ రాత్రంతా సీజ్ చేసిన బస్సులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నగరంలోని వీఆర్సీ సెంటర్ సమీపంలో, అలాగే రూరల్ పరిధిలో ఆమె ఒక పక్కా ప్లాన్ ప్రకారం నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని తన దందా సాగించింది.
బడ్జెట్ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నారా సిట్రోయెన్ ఈసీ3ఎక్స్ మరియు టాటా టియాగో ఈవీ కార్ల ధర, మైలేజ్ రేంజ్, బ్యాటరీ సామర్థ్యం మరియు సేఫ్టీ ఫీచర్ల పూర్తి వివరాలు మీకోసం.
ముంబై నగర తాగునీటి జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకరంగా 9 శాతానికి పడిపోయాయి. అప్పర్ వైతర్ణ డ్యామ్ పూర్తిగా ఎండిపోగా, ఐఎండీ జూన్ 22 నుండి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాద నిధుల నిరోధక గ్లోబల్ సంస్థ FATF వైస్ ప్రెసిడెంట్‌గా భారత ఐఏఎస్ అధికారి వివేక్ అగర్వాల్ చారిత్రాత్మక నియామకం. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఒక చిన్న టైలరింగ్ షాపు నుంచి కోట్ల రూపాయల లగ్జరీ బ్రైడల్ బ్రాండ్‌గా ఎదిగిన రియాసత్ లైఫ్ స్టైల్ ఐపీఓ సక్సెస్ స్టోరీ, సబ్‌స్క్రిప్షన్ తేదీలు, లిస్టింగ్ వివరాలు మరియు కంపెనీ బిజినెస్ ప్లాన్స్ ఇప్పుడు పూర్తిగా తెలుసుకోండి.
ప్రముఖ ఇన్వెస్టర్ మధుసూదన్ కేలా గురుగ్రామ్‌లోని డిఎల్ఎఫ్ ది డహ్లియాస్ ప్రాజెక్ట్‌లో రూ. 121 కోట్లతో అల్ట్రా లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశారు. చదరపు అడుగుకు రూ. 1.93 లక్షల ధరతో ముంబై, ఢిల్లీ రికార్డులను బద్దలు కొట్టిన ఈ భారీ నివాస ఒప్పందం పూర్తి వివరాలు, ధరల పెరుగుదల మరియు ప్రాజెక్ట్ ప్రత్యేకతలను ఇక్కడ తెలుసుకోండి.
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) 23వ విడత కింద 9 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లోకి రూ. 2,000 జమ అయ్యాయి. మీ మొబైల్‌లోనే పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో మరియు బ్యాంక్ ఖాతా సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అమెరికా, యూరప్ వెళ్లే భారతీయ ప్రయాణికులకు జర్మనీ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్ ఎయిర్‌పోర్ట్‌ల మీదుగా ప్రయాణించే వారికి ఇకపై ట్రాన్సిట్ వీసా అవసరం లేదని ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు, సింగిల్ PNR టికెట్ మరియు లగేజీ రూల్స్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
గాజాలో తీవ్రమైన యుద్ధం వల్ల ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. 51% మందుల కొరత, ఆసుపత్రుల విధ్వంసంతో వేలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ నేపథ్యంలో భారతదేశం తక్షణమే స్పందించి ఆరోగ్య మైత్రి కింద వైద్య సహాయం అందించాలని పాలస్తీనా రాయబారి అబ్దుల్లా అబు షావేష్ చేసిన పూర్తి భావోద్వేగపూరిత విజ్ఞప్తి వివరాలు ఇక్కడ చదవండి.
 చంద్రబాబు సమాజంలోని అందరినీ సమానంగా చూసే ఒక గొప్ప లీడర్ అని, అందుకే ఇక్కడి ప్రజలు ఆయన్ని ఎంతో గౌరవిస్తూ, దేవుడిలా భావిస్తారన్నారు.  
అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ బంగారం ధరలపై సంచలన అంచనాలను వెల్లడించింది. భవిష్యత్తులో 10 గ్రాముల బంగారం ధర రూ. 2 లక్షలు దాటే అవకాశం ఉందా పూర్తి వివరాలు, ట్యాక్స్ లెక్కలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.