రసకందాయంలో భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు.. మూడో రోజు వికెట్లు టపటపా

Publish Date:Dec 24, 2022

Advertisement

ఢాకా వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న రెండో  టెస్టులో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. భార‌త బౌల‌ర్లు రాణించ‌డంతో బంగ్లా 231 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో 144 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం మాత్ర‌మే బంగ్లాదేశ్‌కు ద‌క్కింది.

145 పరుగుల  స్వల్పలక్ష్య ఛేదనలో భారత్ చెమటోడుస్తోంది. కేవలం 45 పరుగులకే నాలుగు  వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ ఇండియా నాలుగు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే టీమ్ ఇండియా ఇంకా వంద పరుగులు చేయాలి.

అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరు వికెట్ నష్టపోకుండా 7 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ భారత బౌలర్ల విజృంభణకు టపటపా వికెట్లు కోల్పోయింది. అయితే ఒక వైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ జాకీర్ హుస్సేన్ (51), టిటన్ దాస్ (73)ల పోరాట పటిమ కారణంగా 231 పరుగులు చేయగలిగింది. టీమ్ ఇండియా బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు. సిరాజ్, అశ్విన్ రెండేసి వికెట్లు పడగొట్టగా, ఉనాద్కత్ కు ఒక వికెట్ దక్కింది.  తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 227 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 314 ప‌రుగులు చేసిన సంగ‌తి తెలిసిందే.

By
en-us Political News

  
ప్రజల ప్రాణాలకు ముప్పు కలగకూడదని హెచ్చరించడమే ఆయన చేసిన నేరమైంది.
భారతీయ ఆర్థిక వ్యవస్థలో నల్లధనం అరికట్టేందుకు, అవినీతిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో పెద్ద నోట్ల రద్దు అంశం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఒక షాకింగ్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
దీపావళి పండుగ వేళ ఛత్తీస్‌గఢ్‌లో అత్యంత హృదయ విదారకరమైన ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది.
ఇటీకాల కాలంలో టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులతో పాటు ఉద్యోగుల పని వాతావరణంలోనూ విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
పండుగ వేళ నగరంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తెలుగు రాష్ట్రాల ప్రజలను వాతావరణ శాఖ మరోసారి అప్రమత్తం చేసింది.
హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల వేళ అపశ్రుతి చోటుచేసుకుంది.
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.