Publish Date:Mar 27, 2026
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచల పుణ్యక్షేత్రంలో సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సతీసమేతంగా భద్రాచలం విచ్చేసి రాములోరి కల్యాణాన్ని తిలకించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. మిథిలా స్టేడియంలో జరిగిన ఈ వేడుకను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ సీతారాముల కల్యాణం శాస్త్రోక్తంగా సాగింది.
కాగా తన భద్రాచలం పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న భద్రాచలం ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ పనుల కోసం రూ. 586 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. మూడు దశల్లో ఈ ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పంచింది. అందులో భాగంగా మొదటి దశ పనులకు రేవంత్ రెడ్డి శుక్రవారం (మార్చి 27)భూమిపూజ చేశారు. .
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bhadrachalam-rama-celestial-wedding-36-216263.html
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వ్యవస్థను ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడుం బిగించారు.
తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్‌గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్‌కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.