నాని వర్సెస్ చిన్ని.. కేశినేని బ్రదర్స్ పొలటిక్స్

Publish Date:Jun 7, 2023

Advertisement

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అయినా.. నవ్యంధ్రాలో అయినా.. విజయవాడ.. విజయవాడే. ఆ బెజవాడ మహానగరం విద్యలకే వాడ కాదు.. తెలుగు రాజకీయానికి కూడా గుండెకాయ వంటింది. ఇంకా చెప్పాలంటే.. బెజవాడ రాజకీయం అంటే యమా రంజుగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిందనే కంటే.. విజయవాడ లోక్‌సభ సభ్యుడిగా ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అలాగే నగరంలోని ఎమ్మెల్యే సీట్లు.. ఏ పార్టీ ఖాతాలో వెళ్లాయనే అంశంపైనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు వారు ఆసక్తిగా గమనిస్తారనడంలో ఏ మాత్రం కించిత్ సందేహం కూడా లేదన్న విషయం విధితమే. దీనిని బట్టే సుస్పష్టమవుతోందీ.. బెజవాడ రాజకీయానికి డిమాండ్ ఎక్కువని. 

అలాంటి విజయవాడలో రాజకీయం స్థానిక లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని వర్సెస్ ఆయన సోదరుడు కేశినేని చిన్ని అన్నట్లుగా తయారైందనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేశినేని నాని మరింత దూకుడుగా వ్యవహరిస్తుండడంతో.. అదీకూడా.. తన లోక్‌సభ నియోజకర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు మైలవరం, నందిగామల్లో పర్యటిస్తూ... జగన్ పార్టీ ఎమ్మెల్యేలపై ఆయన ప్రశంసల జల్లు కురిపించడం... అలాగే అదే పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయ్యోధ్య రామిరెడ్డి.. సైతం కేశినేని నాని తమ పార్టీలోకి వస్తే.. స్వాగతిస్తామని  ప్రకటించడం.. మరోవైపు వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగుతా, టీడీపీ టికెట్ ఎవరికి ఇచ్చుకున్నా తనకు అభ్యంతరం లేదంటూ బహిరంగ ప్రకటనలు చేయడం.. వంటి వాటి వల్ల.. అటు సైకిల్ పార్టీకి జరిగే నష్టం కంటే.. ఇటు సోదరుడు కేశినేని చిన్నికి కలిగే ఇబ్బందుల కంటే.. కేశినేని నానికే భారీగా.. అదీ వ్యక్తిగతంగా నష్టం వాటిలే అవకాశాలు ఉన్నాయనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది.  


రాష్ట్ర విభజన సమయంలో అంటే 2014లో, అలాగే జగన్ వేవ్‌లో అంటే 2019 ఎన్నికల్లో కేశినేని నాని టీడీపీ లోక్‌సభ అభ్యర్థిగా వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. ఇక ఈ రెండు ఎన్నికల్లో జగన్ పార్టీ.. తన లోక్‌సభ అభ్యర్థులను మార్చినా.. పసుపు పార్టీ మాత్రం కేశినేని నానికే వరుసగా సీటు ఇస్తూ వచ్చింది. అలాంటి పార్టీ నుంచి ఎన్నికై... నేడు అదే పార్టీ పట్ల ఇంతలా అంటి ముట్టనట్లుగా వ్యవహరించడం వల్ల.. కేశినేని నాని ఇమేజ్‌కే డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉందనే టాక్ సైతం వైరల్ అవుతోంది. 

రాజకీయ అన్న తర్వాత గ్రూపులు.. రాజకీయ పార్టీలు అన్న తర్వాత... గ్రూప్ పాలిటిక్స్ అత్యంత సహజమని.. అలాంటి వేళ... అదీ కూడా సొంత ఇంట్లోని వ్యక్తి.. అదీ సోదరుడు కేశినేని చిన్నిని కూర్చొబెట్టుకొని మాట్లాడితే.. జస్ట్ పది నిమిషాల్లో అన్ని సమస్యలు అల్ క్లియర్ అయిపోతాయనే చర్చ సైతం సాగుతోంది. కానీ ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహారాన్ని వదిలేస్తే.. కొన్ని అరాచక శక్తులు బరిలోకి దిగితే... ఆ తర్వాత జరిగే పరిణామాలకు మనమే బాధ్యత వహించాల్సి ఉంటుందనే అభిప్రాయం సైతం పోలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే పాదయాత్రలో ఒక్కే ఒక్క చాన్స్ అంటూ.. చాలా హామీలు ఇవ్వడంతో.. అలా అధికారంలోకి వచ్చిన వారి వల్ల.. రాష్ట్రానికి ఏ మేరకు మేలు జరిగిందంటే.. మాత్రం ఆలోచించాల్సిందే. ఇటువంటి నేపథ్యంలో వారిద్దరికి సర్థి చెప్పాల్సిన భాద్యత పార్టీలోని నేతలపైన సైతం ఉందనేది సుస్పష్టం.

ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా గాలీ వీస్తుంది.. అలాంటి వేళ.. ప్రతిపక్ష స్థానంలో ఉన్న పార్టీని అధికార పక్షంలోకి తీసుకొచ్చేందుకు కలిసి కట్టుగా ఎంత చేయాలో.. అంత చేయాలని.. అలా అయితేనే మనం, మన పార్టీ అధినేత అనుకొన్న లక్ష్యానికి చేరువవుతామనే అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది. అటువంటి పరిస్థితుల్లో ఏమండోయి నానీ గారు.. ఏమండోయి చిన్ని గారు..కలిసి మళ్లీ పూర్వాశ్రమంలో పని చేసుకొంటూ వెళ్లాలని పోలిటికల్ సర్కిల్‌లో ఓ అబిప్రాయం సైతం వ్యక్తమవుతోంది.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.