ఆత్మప్రభోదానుసారం ఓటింగ్ అంటూ సాధారణంగా రాజకీయాలలో వింటుంటాం. అది కూడా అన్ని రకాలుగా ఆలోచించి జరిగే ఓటింగ్ అది. కానీ అద్భుతమైన జీతం, విలాసవంతమైన జీవితం, సమాజంలో గుర్తింపు ఉన్న ఉద్యోగాన్ని ఆత్మప్రభోదానుసారం వదిలేసుకుంటున్నాను అనే వాళ్లు అత్యంత అరుదుగా ఉంటారు. బెంగళూరుకు చెందిన హర్షిత్ శర్మ అనే ఉద్యోగి మాత్రం ఎంత జీతం ఉంటే మాత్రం మనసు అంగీకరించనప్పుడు చేయడమెందుకు? అంటే ఉన్న ఉద్యోగాన్ని వదులుకున్నాడు.
అది కూడా అలాంటి ఇలాంటి సంస్థలో ఉద్యోగాన్ని కాదు. గూగుల్ వంటి దిగ్గజ సంస్థలో ఉన్నతోద్యోగాన్ని ఆత్మ ప్రబోధాను సారం అంటూ తృణ ప్రాయంగా వదిలేశాడు. సాధారణంగా గూగుల్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలో ఉద్యోగం దక్కించుకోవడం అనేది యువతకు ఒక కల. భారీ ప్యాకేజీలు, సమాజంలో గుర్తింపు.. ఉండే అలాంటి ఉద్యోగాన్ని వదులు కోవడానికి సాధారణంగా ఎవరైనా వెనుకాడుతారు. హర్షిత్ మాత్రం తన రూటే సెపరేట్ అంటూ గూగుల్ లో చేస్తున్న సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఉద్యోగానికి ముగింపు పలికాడు.
ఆ ఉద్యోగానికి రాజీనామా చేయడానికి ముందు ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది. ఆ పోస్టు సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ గూగుల్ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ..హర్షిత్ శర్మ పోస్టు చేసిన వీడియోలో ఏమన్నాడంటే.. ఇన్నాళ్లూ తానొక రోబోలా బతికానన్నాడు. టెన్త్ కంప్లీట్ చేసిన తరువాత సైన్స్ తీసుకోవడం, జేఈఈ రాసి ఇంజనీరింగ్‌లో చేరడం, ఆపై ఐటీ ఉద్యోగం సంపాదించడం.. ఇదంతా కేవలం ఇతరుల అంచనాలు అందుకోవడం కోసమే జరిగిందనీ, తన ఆసక్తి ఇసుమంతైనా ఉందా లేదా అన్నది తెలియనే లేదని పేర్కొన్నాడు హర్షిత్.
ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే.. తన లైఫ్ అంతా గీసిన గీత దాటని ఒక లైన్ ఫాలోయింగ్ రోబో లో గడిచిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు గూగుల్ ఉద్యోగం వదిలేయాలన్నది ఏదో ఆవేశంతో తీసుకున్న నిర్ణయం ఎంత మాత్రం కాదనీ, గత కొన్నేళ్లుగా తనాు సంపాదించిన సొమ్ములో అధికభాగం పొదుపు చేసి.. మూడు నాలుగేళ్ల ఎటువంటి ఆదాయం లేకపోయినా కుటుంబ అవసరాలకు ఎటువంటి ఢోకా లేదన్న ధీమా వచ్చిన తరువాతే రాజీనామా నిర్ణయం తీసుననానని పేర్కొన్నారు. ఇహ తాను తనకు ఇష్టమైన రంగంలో ముందుకు సాగేందుకు తన పొదుపు ధీమా ఇచ్చిందన్నారు.
ప్రస్తుతానికి రొటీన్ పనులు కాకుండా, ఇన్నాళ్లూ వాయిదా వేసుకున్న హాబీలు మరియు ఆశయాలను నెరవేర్చుకుంటానని ఆ వీడియోలో హర్షిత్ పేర్కొన్నారు. 2027 నాటికి తన నిర్ణయం సరైనదే అని గర్వంగా చెప్పుకునేలా ఎదుగుతానని ధీమా వ్యక్తం చేశారు. ఇక నెటిజనులైతే హర్షిత్ వ్యక్తిత్వాన్నీ, ధైర్యాన్ని వేనోళ్ల పొడుగుతున్నారు. కార్పొరేట్ ఒత్తిడిలో బతుకుతున్న ఎందరికో హర్షిత్ స్ఫూర్తిగా నిలు స్తాడని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bengaluru-techie-leaces-job-as-per-selfenlightenment-36-216565.html
మే 8న హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది. మే 16వ తేదీన భగీరథ్‌ను అరెస్ట్ చేశారు. అప్పటి నుండి అంటే దాదాపు 45 రోజులకు పైగా అతడు చర్లపల్లి జైలులోనే జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
తమ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నందుకు ప్రతీకారంగానే పాక్ సైనిక కేంద్రాలపై దాడులు చేస్తున్నామని బలూచ్ రెబల్ గ్రూపులు హెచ్చరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ సైన్యంపై మరిన్ని భారీ ఎత్తున దాడులు చేస్తామని స్పష్టం చేశాయి.
తంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ మరణించినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారింది. ఖాసిం సులేమానీ మతికి ప్రతీకారంగా ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ ఇరాన్ ఎత్తుగడలు వేస్తోందని నిఘావర్గాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ నివేదికలు, రక్షణ రంగ తాజా విశ్లేషణల మేరకు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దళాల జాబితాలో భారత్ మూడవ స్థానానికి దూసుకెళ్లింది. అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో నిలవగా, అత్యాధునిక యుద్ధ పరిజ్ఞానం కలిగిన రష్యా రెండో స్థానంలో ఉంది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఇప్పటివరకు మూడో స్థానంలో కొనసాగుతూ వచ్చిన చైనాను అధిగమించి ఇండియా ఈ ఘనత సాధించింది.
స్టాక్ మార్కెట్లో సరైన ప్లాన్ లేకుండా ఇన్వెస్ట్ చేసి ₹2 లక్షలు ఎలా పోగొట్టుకున్నానో ఈ వెబ్ స్టోరీలో చూడండి. కొత్త ఇన్వెస్టర్లు ఫోమో FOMO, స్టాప్ లాస్ లేకపోవడం వంటి ఏ తప్పులు చేయకూడదో మరియు రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల FII 60 బిలియన్ డాలర్ల అమ్మకాల సునామీకి ఎట్టకేలకు బ్రేక్ పడింది. ముడి చమురు ధరల తగ్గుదలతో మారిన మార్కెట్ సమీకరణాలు మరియు దేశీయ ఇన్వెస్టర్ల రికార్డు కొనుగోళ్లపై పూర్తి విశ్లేషణ.
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తొలిసారి అధికారికంగా కరూర్ జిల్లాలో పర్యటించనున్నారు. గతేడాది జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ పత్రాలను అందజేయడంతో పాటు, నూతన పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కేవలం 4 నెలల్లోనే 140 శాతం పెరిగి, 3 రోజుల్లో 18 శాతం లాభంతో సరికొత్త రికార్డు సృష్టించిన స్మాల్‌క్యాప్ ఏరోస్పేస్ స్టాక్ ఏక్వస్ (Aequs) గురించిన పూర్తి వివరాలు, భవిష్యత్ టార్గెట్ ధరలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నం భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పాత ఎయిర్‌పోర్ట్ నుంచి విమానాలన్నీ ఇక్కడికే మారాయి. ప్రయాణ సమయం, దూరం, టెర్మినల్ అప్‌డేట్స్ మరియు విమానయాన సంస్థలు జారీ చేసిన కీలక జాగ్రత్తల పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
స్విగ్గీ మరియు ఎటర్నల్ షేర్లు 7 శాతం వరకు భారీగా పెరిగాయి. విదేశీ పెట్టుబడుల వాటా 50 శాతం కంటే తగ్గడం మరియు క్విక్ కామర్స్ మార్జిన్ల బూస్ట్ అవకాశాలపై బ్రోకరేజ్ సంస్థల లేటెస్ట్ రేటింగ్స్, టార్గెట్ ధరల పూర్తి వివరాలు మీకోసం.
భారతదేశంలోని మహిళా సంక్షేమ పథకాలతో లబ్ధిదారుల బ్యాంకు బ్యాలెన్స్ 84% పెరిగింది. మహారాష్ట్ర లాడ్కీ బహిన్ , ఒడిశా సుభద్ర యోజన పథకాల వల్ల నెలవారీ ఖర్చులు, యూపీఐ డిజిటల్ లావాదేవీలు మరియు కుటుంబ ఆర్థిక స్థిరత్వం ఎలా పెరిగాయో EAC PM తాజా నివేదిక ఆధారంగా తెలుసుకోండి.
భారత్ vs ఇంగ్లాండ్ 4వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. సంజు శాంసన్ రీఎంట్రీ ఇస్తుండగా, తిలక్ వర్మ మరియు వైభవ్ సూర్యవంశీ అవుట్ కానున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో వాతావరణ అప్‌డేట్స్, ట్రాఫిక్ జామ్స్ మరియు వర్షపాతం వివరాలు ఇక్కడ తెలుసుకోండి.