Publish Date:Oct 26, 2024
చెలియల కట్ట తెంచుకుని జనావాసాల మీదకు ఉరుకుతున్న సముద్రం కాదు. భారీ వర్షాలకు చెరువుకట్ట తెగి దూసుకువస్తున్న వరద ప్రవాహమూ కాదు. మరేమిటి? కమ్మేస్తున్న నురుగు. పరిశ్రమల వ్యర్థాలను ఇష్టారీతిగా జలశాయాలలోకి వదలడంతో జనాలను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్న మురుగు నురుగు. ఎక్కడంటారా కర్నాటకలో. ఔను పినాకినీ నదిపై హూసూరు సమీపంలో నిర్మించిన జలాశయం నుంచి పెద్ద ఎత్తున నురుగు బయటకు వచ్చేస్తోంది. పరిసర ప్రాంతాలను కమ్మేస్తోంది.
రోడ్లపైకి వచ్చేస్తోంది. రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది. అసలింతకూ జలాశయం నుంచి భారీ స్థాయిలో నురుగురావడానికి కారణమేంటో తెలుసా? పరిశ్రమల వ్యర్ధాలు. బెంగళూరులోని పరిశ్రమల నుంచి వ్యర్థాలు పెద్ద ఎత్తున జలాశయంలోకి వదిలేస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్యానికి అత్యంత హానికరమైన వ్యర్థాలను జలాశయాలలోకి వదిలేస్తున్నా ప్రభుత్వం చూసీ చూడనట్లు వదిలేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ పరిస్థితిని నివారించాలని డిమాండ్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bengaluru-industries-residuals--into-reservoirs-25-187438.html
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.