అమ్మవారి సన్నిధిలో మైనర్ బాలికతో వృద్ధుడి అసభ్య ప్రవర్తన..!

Publish Date:Aug 15, 2026

Advertisement

 

అది ఓ ఆలయం.. అమ్మ వారి సన్నిధి. భక్తులు వచ్చి వెళ్లే పవిత్రమైన ప్రదేశం. కానీ అదే ఆలయాన్ని బయట నుంచి తాళం వేసి లోపల మైనర్ బాలికతో ఓ వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఆలయానికి బయట తాళం వేసి ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు లోపల ఏం జరుగుతుందో గమనించగా.. మైనర్ బాలికతో ఓ వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించారు. అర్చకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సాయన్న అనే వృద్ధుడు మైనర్ బాలికను గుడి లోపలికి తీసుకువెళ్ళి అసభ్యంగా ప్రవర్తించ సాగాడు. 

ఘటనను గుర్తించిన స్థానికులు కొందరు దృశ్యాలను వీడియోలో రికార్డు చేశారు. వెంటనే గ్రామ పెద్దలు అందరూ కలిసి పోలీసులకు సమాచారం అందించారు. పవిత్రమైన ఆలయంలోని అమ్మవారి సన్నిధిలోనే బాలికతో వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న రామచంద్రా పురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  ఘటనకు సంబంధించిన వీడియో, ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలికకు సంబంధించిన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. పవిత్రమైన ఆలయంలోనే ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడంతో రామచంద్రాపురంలో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

behavior of an elderly man with a minor girl, Ramachandrapuram Police Station, CM Revanth reddy, CP Sajjanar, Sayanna, Crime news

By
en-us Political News

  
దేశంలో పెట్టుబడుల  ఆకర్షణలో   నవ్యాంధ్రప్రదేశ్  రికార్డు స్థాయి పురోగతి  సాధించింది. పెట్టుబడుల ఆకర్షణలో గత కొన్నేళ్లుగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు    రాష్ట్రాలు ఆధిపత్యం కొనసాగుతున్నది. అయితే వాటిని తోసి రాజని ఆంధ్రప్రదేశ్ రెండో స్థానానికి ఎగబాకింది. 
వైద్య నివేదికల ప్రకారం ఇమ్రాన్ తీవ్రమైన గుండె దడ,   రక్తపోటు,  మానసిక ఒత్తిడి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు అల్వీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయనను వెంటనే జైలు నుంచి బయటకు తరలించి,   ఆధునిక ఆసుపత్రిలో స్వతంత్ర వైద్యుల బృందం పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం  ఉందని ఆరిఫ్ అల్వీ చెబుతున్నారు.  
పలు మార్లు ఇండియాపై అంతర్జాతీయ వేదికలపై ఆరోపణలు చేసి, కాశ్మీర్ విషయంలో ఇండయాపై అంతర్జాతీయ వేదికలపై విమర్శలు చేసి భంగపడిన పాకిస్థాన్ కు తాజాగా ఆప్నిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వం దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా కౌంటర్ ఇచ్చింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అభివృద్ధికి అల్గారిథమ్‌ల కంటే కరెంట్, భూమి, మౌలిక వసతులే అసలైన సవాలుగా మారాయని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వెల్లడించారు. ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో 4.25 గిగావాట్ల సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న భారీ ఏఐ ఫ్యాక్టరీ వివరాలు, టెక్నాలజీ భవిష్యత్తు గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
కింగ్‌డమ్ హార్ట్స్ 4 Kingdom Hearts 4 ల్యాట్ 2027 రిలీజ్ డేట్ ఖరారైంది! డిస్నీ కోకో , స్టార్ వార్స్, బాంబీ, మోఆనా వంటి 6 కొత్త ప్రపంచాలు మరియు D23 ట్రైలర్ విశేషాలను తెలుగులో తెలుసుకోండి.
ఈజిప్ట్‌లోని లక్సార్‌లో ఉన్న పురాతన తీబన్ సమాధి ఆధారంగా ప్రాచీన ఈజిప్షియన్ల అంత్యక్రియల సంస్కృతి, మమ్మీకరణ ఆచారాలు మరియు కాలక్రమేణా వాటిలో వచ్చిన మార్పుల గురించి ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కేరళ బాక్సాఫీస్ వద్ద లోకేష్ కనగరాజ్ డీసీ చిత్రం రూ.16.5 కోట్ల గ్రాస్‌తో 2026లో హయ్యెస్ట్ గ్రాసింగ్ తమిళ సినిమాగా నిలిచింది. విజయ్ జన నాయగన్ రికార్డును బ్రేక్ చేస్తూ రూ.100 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళ్తున్న పూర్తి బాక్సాఫీస్ విశ్లేషణ ఇక్కడ చదవండి.
BWF ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి సంచలనం సృష్టించాడు. బెంగళూరులో జరిగిన తీవ్ర ఉత్కంఠభరిత పోరులో ప్రపంచ నెం.1, డిఫెండింగ్ ఛాంపియన్ షి యూకీని 21 14, 13 21, 21 19 తేడాతో ఓడించి చారిత్రక విజయం సాధించాడు. పూర్తి కథనం ఇక్కడ చదవండి.
GIC Re మొదటి త్రైమాసిక Q1FY27 ఆర్థిక ఫలితాలలో ప్రీమియం వృద్ధి మందగమనం, పెరుగుతున్న అండర్ రైటింగ్ నష్టాలు మరియు IRDAI కొత్త నిబంధనల ప్రభావంపై సమగ్ర విశ్లేషణ.
కేన్స్ టెక్నాలజీ షేర్లు గత 3 రోజుల నష్టాల తర్వాత దాదాపు 2% పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం రూ. 7,877 కోట్ల ఇసిఎమ్‌ఎస్ ప్లాన్ ఆమోదించడంతో పిసిబి ప్లాంట్ ప్రారంభానికి సిద్ధమైంది. ఫలితాలు, టార్గెట్ ప్రైస్, టెక్నికల్ అవుట్‌లుక్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
బెంగళూరు-ఎర్నాకులం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సీటింగ్ సామర్థ్యాన్ని రైల్వే శాఖ 8 నుండి 16 కోచ్‌లకు శాశ్వతంగా పెంచింది. ఒక్కో ట్రిప్‌కు 1,128 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. బెంగళూరు-ముంబై స్లీపర్ వందే భారత్ వివరాలు కూడా తెలుసుకోండి!
పాతికేళ్లకు పైగా డిజిటల్ మీడియా రంగంలో తెలుగువన్ సాధించిన విజయాలను మయన్మార్ మంత్రి టియాన్ లిన్ అభినందించారు. తెలుగువన్ అవలంబిస్తున్న వినూతన కంటెంట్ మోడల్స్, నాణ్యతా ప్రమాణాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య కంటెంట్ మార్పిడికి ఉన్న అవకాశాలను పరిశీలించారు.
లలితా జ్యువెలరీ మరియు హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఐపీఓల మధ్య గ్రే మార్కెట్ ప్రీమియం GMP , లిస్టింగ్ లాభాలు, ప్రైస్ బ్యాండ్ మరియు డే 2 సబ్‌స్క్రిప్షన్ వివరాల పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.