బీసీసీఐ ప్రక్షాళన.. సెలక్టర్లకు ఉద్వాసన.. ఆటగాళ్ల వంతెప్పుడు?

Publish Date:Nov 19, 2022

Advertisement

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ సెమీఫైనల్ లో టీమ్ఇండియా ఘోర పరాజయం నేపథ్యంలో బీసీసీఐ ప్రక్షాళన మొదలెట్టింది. ముందుగా సెలక్టర్లపై వేటేసింది. టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో టీమ్ ఇండియా ఘోరంగా పరాజయం పాలైన సంగతి విదితమే. ఆ మ్యాచ్ లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో చేసిన పరుగులను ఇంగ్లాండ్ అలవోకగా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించేసింది.

భారత్ నిర్దేశించిన 168 పరుగుల విజయ లక్ష్యాన్ని ఒక్కవికెట్ కూడా నష్టపోకుండానే  ఇంగ్లాండ్ ఉఫ్ మని ఊదేసింది.  ఈ ఓటమితో టీమ్ ఇండియా బలహీనతలపై మళ్లీ చర్చ మొదలైంది. ఆటగాళ్ల సెలక్షన్ అధ్వానంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ను జట్టులోకి తీసుకుని ఎవరినీ సరిగ్గా ఉపయోగించుకోని పరిస్థితిని క్రీడాభిమానులే కాదు.. మాజీలు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు.

వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లకు వరుసగా అవకాశాలు ఇచ్చుకుంటూ పోవడంపై కూడా విరమ్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ మొదటిగా సెల‌క్ట‌ర్ల‌పై వేటు వేసింది. టి20 వరల్డ్ కప్ కు   జ‌ట్టును ఎంపిక చేసిన చేత‌న్ శ‌ర్మ నేతృత్వంలోని సెల‌క్ష‌న్ క‌మిటీనీ ఇంటికి పంపించింది. అంతేకాకుండా కొత్త సెల‌క్ష‌న్ కమిటీ ఎంపిక కోసం ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించింది. సీనియ‌ర్ పురుషుల క్రికెట్ జ‌ట్టును ఎంపిక చేసేందుకు ఐదుగురు సెల‌క్ట‌ర్లు కావాలంటూ భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ఓ ప్ర‌క‌ట‌న‌ను చేసింది. కనీసం ఏడు టెస్ట్ మ్యాచ్‌లు, 30 ఫస్ట్‌ క్లాస్ మ్యాచ్‌లు, లేదంటే 10 వన్డేలు, 20 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన వారు సెలక్టర్ పదవికి అర్హులనీ, అలాగే సెలక్షన్ బోర్డుకు ఎంపిక అవ్వాలంటే.. ఐదు సంవ‌త్స‌రాల క్రిత‌మే క్రికెట్ ఆట‌కు వీడ్కోలు ప‌లికి ఉండాల‌ని, అంతేకాకుండా ఐదేళ్ల పాటు ఏ క్రికెట్ క‌మిటీలోనూ స‌భ్యుడిగా లేని వాళ్లకు ప్రాధాన్యం ఇస్తామనీ ఆ ప్రకటనలో పేర్కొంది.  

ఆస‌క్తి ఉన్న వారు ఈనెల 28వ తేదీలోగా దరఖాస్తులు పంపాలని ఆ ప్రకటనలో పేర్కొంది.  ఈ ప్రక్షాళనలో భాగంగా తరువాతి వంతు వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లదేనని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. గతమెంత ఘనకీర్తి ఉన్నా.. ప్రస్తుత పెర్ఫార్మెన్స్ ఆధారంగానే జట్టులో స్థానం ఉంటుందన్నది బీసీసీఐ స్పష్టంగా చెబుతోందంటున్నారు.

ఈ నేపథ్యంలోనే రాహుల్, దినేష్ కార్తిక్, పృధ్వీషా, భువనేశ్వర్ కుమార్ తదితర ఆటగాళ్ల భవిష్యత్ పై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. మొత్తం మీద టి20 వరల్డ్ కప్ సెమీస్ లో ఓటమితో టీమ్ ఇండియా లోటుపాట్లను సరిదిద్దే దిశగా బీసీసీఐ చర్యలు చేపట్టడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

By
en-us Political News

  
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
​కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.