బతుకమ్మ చీరలు సరే.. మరి వారితో బతుకమ్మ ఆడిస్తారా?

Publish Date:Oct 11, 2020

Advertisement

మరి ముస్లిం తోఫా హిందువులకూ ఇస్తారా?

 

తెలంగాణ తెరపైకి కొత్త చర్చ

 

ప్రభుత్వాలనేవి సెక్యులర్‌గానే ఉంటాయి. ఉండాలి కూడా. పాలకులకు అన్ని కులాలు- అన్ని మతాలూ సమానమే. ఎవరి పట్ల పక్షపాతం ఉండకూడదు. అందరికీ సమాన హక్కులు కల్పించాలి. రాజ్యాంగం కూడా చెబుతోంది ఇదే. సరే.. కొందరు పాలకులు కొన్ని మతాల మెహర్బానీల కోసం, వారికోసమే ప్రత్యేక పథకాలు తీసుకువస్తున్న సంప్రదాయం దశాబ్దాల నుంచే మొదలయింది. గత ఐదేళ్ల కాలం నుంచీ అది కులాల వరకూ విస్తరించి, కులానికో కార్పొరేషన్ ఏర్పాటుచేసే సంప్రదాయానికి తెరలేపారు. అందుకు ఎవరూ అతీతులు కాదు. కానీ ఒక మతం చేసుకునే పండుగలప్పుడు, అన్ని మతాలకూ బహుమతులిస్తున్న పాలకులు.. మరి మిగిలిన మతాల పండగులప్పుడు ఇచ్చే బహుమతులు కూడా, అన్ని మతాలకూ ఇవ్వాలి కదా? మరి పాలకులు ఆ సమ న్యాయం పాటిస్తున్నారా? తెలంగాణలో మహిళలకు చేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ.. ఇప్పుడు ఈ ప్రశ్ననే తెరపైకి తెచ్చింది.

 

తెలంగాణలో బతుకమ్మ పండుగకు విశిష్టతతోపాటు, చారిత్రక నేపథ్యం కూడా ఉంది. కొన్ని వందల ఏళ్ల నుంచి తెలంగాణ పల్లెలో, బతుకమ్మ ఆడే సంప్రదాయం ఉంది. అయితే అది పట్టణ ప్రాంతాలలో కొందరు మాత్రమే ఆచరించేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, మర్చిపోయిన ఈ సంప్రదాయాన్ని కేసీఆర్ కుమార్తె కవిత మళ్లీ గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో తమకు రాష్ట్రం కావాలంటూ వివిధ సంస్థలు ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహించారు. అయితే కవిత మాత్రం బతుకమ్మను ఇంటింటికీ చేర్చారు. ఒకరకంగా బతుకమ్మకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌లా మారారు. నిజానికి ఆమె కృషి వల్లనే, బతుకమ్మ పండుగకు ఇంత ప్రాధాన్యం వచ్చిందనేది నిజం. అసలు బతుకమ్మ గురించి తెలియని ఆంధ్రా మహిళలు సైతం.. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంతోపాటు, బయట బతుకమ్మ ఆడారంటే, కవిత ఎంతమంది మహిళలపై ప్రభావితం చూపారో స్పష్టమవుతోంది. ఉద్యమ సమయంలో మహిళలు, బతుకమ్మ ఆడుతూ స్వరాష్ట్ర కాంక్షను వ్యక్తీకరించారు. బతుకమ్మ ఫక్తు హిందువుల పండుగ. నిజాం నవాబుల జమానాలో, రజాకార్లు మహిళలను బట్టలు ఊడదీసి, వారితో నగ్నంగా బతుకమ్మ ఆడించి పైశాచిక ఆనందం పొందినట్లు చరిత్ర చెబుతోంది.

 

సొంత రాష్ట్రం సిద్ధించిన తర్వాత, బతుకమ్మ పండుగకు కేసీఆర్ సర్కారు ఏటేటా కొంత నిధిని ఏర్పాటుచేసింది. తర్వాత మహిళలకు చీరలు ఉచితంగా పంపిణీ చేసే సంప్రదాయం ప్రవేశపెట్టింది. అయితే, ఆ చీరలు నాసిరకంగా ఉన్నాయని మహిళలు వాటిని రోడ్డుపైనే పడేసి పోయిన ఘటనలు మీడియాలో చూసినవే. చీరల కొనుగోలులో కుంభకోణం జరిగిందని, మహారాష్ట్ర నుంచి వాటిని తక్కువ రేటుకు తెచ్చి, ఇక్కడి కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని అప్పట్లో కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న చీరలలో కూడా నాణ్యత లేదని, గత ఏడాది మిగిలిపోయిన చీరలను పంపిణీ చేస్తున్నారన్న మహిళల విమర్శలు మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇదంతా రాజకీయ కోణం. రంజాన్ తోఫాకు సైతం ప్రభుత్వం నిధులిస్తున్న విషయం తెలిసిందే.

 

కానీ, బతుకమ్మ చీరలను, ముస్లిం మహిళలకూ పంపిణీ చేయడంపై.. తెలంగాణలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఫక్తు హిందువుల పండుగయిన బతుకమ్మ పండుగ చీరలు, ముస్లింలకు ఎలా ఇస్తారన్నది ఒక ప్రశ్న. రజాకార్లు హిందూ మహిళలతో నగ్నంగా బతుకమ్మ ఆడించి.. బతుకమ్మను అవమానిస్తే, అదే బతుకమ్మ చీరలను ముస్లింలకు ఎలా పంపిణీ చేస్తారన్న ప్రశ్నలు, హిందూ సంస్థల నుంచి వినిపిస్తున్నాయి. దీనిపై వినిపిస్తున్న ప్రశ్నలు, జరుగుతున్న చర్చ ఆసక్తికరంగా మారింది. బతుకమ్మ పండుగ రోజు ప్రభుత్వం ఇచ్చిన చీరలు కట్టుకున్న హిందూ మహిళలు, వాటికి కట్టుకుని బతుకమ్మ ఆడతారు. మరి ఆ చీరలు కట్టుకునే ముస్లిం మహిళలు, హిందూ మహిళల మాదిరిగా బతుకమ్మ ఆడతారా? అన్నది ఇప్పుడు హిందూ సంస్థల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. మరి ఏ ఉద్దేశ్యంతో ముస్లిం మహిళలకు, బతుకమ్మ చీరలను బహుమానంగా ఇచ్చారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

 

అదేవిధంగా ప్రభుత్వం, ప్రతి ఏటా రంజాన్ తోఫా ఇస్తోంది. దీనికి కూడా బతుకమ్మ చీరల మాదిరిగానే కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోంది. కానీ విచిత్రంగా.. రంజాన్ తోఫా కేవలం ముస్లింలకు మాత్రమే పరిమితం. ఆ బహుమతులు హిందువులకు ఇవ్వరని హిందూ సంస్థలు గుర్తు చేస్తున్నాయి. మరి హిందువులు నిర్వహించుకునే ప్రతి బతుకమ్మ పండుగకు ముస్లిం మహిళలకు సైతం చీరలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం, మరి రంజాన్ తోఫా సమయంలో హిందువులకు ఎందుకు బహుమతులు ఇవ్వరని ప్రశ్నిస్తున్నాయి.

 

‘ప్రభుత్వ సెక్యులర్ విధానం హాస్యాస్పదం, అసంబద్ధంగా ఉంది. బతుకమ్మ చీరలు తీసుకుంటున్న ముస్లిం మహిళలు, వాటిని కట్టుకుని హిందూ మహిళల మాదిరిగా బతుకమ్మ ఆడగలరా? అలా ఆడాలని ఈ ప్రభుత్వం చెప్పగలదా? మరి రంజాన్ తోఫా ముస్లింలకే ఎందుకు పరిమితం చేస్తున్నారు? ఇదేనా కేసీఆర్ చెప్పే సెక్యులర్ నీతి? అయినా రజాకార్ల చేతిలో.. అవమానాల పాలయిన హిందూ మహిళలను ఏ మతమయితే దారుణంగా వేధించిందో, అదే మతానికి చెందిన మహిళలకు బతుకమ్మ చీరలు ఇవ్వడమంటే, హిందూ మహిళలను అవమానించినట్టే’నని భాగ్యనగర్ విశ్వహిందూ పరిషత్, ప్రచార సహ ప్రముఖ పగుడాకుల బాలస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

-మార్తి సుబ్రహ్మణ్యం

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.