తెలంగాణలో బతుకమ్మ ప్రత్యేకమైన పండుగ
Publish Date:Oct 3, 2024
Advertisement
తెలంగాణ అంటేనే జాతర, పండుగలు, బహుజన దేవతారాధన. ఇక్కడి చెట్టు, పుట్ట, చేను, చెలక, పిట్టా, పువ్వు అన్నిటికీ ఒక చరిత్ర ఉంటుంది. కాకతీయ సామ్రాజ్య పాలకులు చెరువులను అభివృద్ధికి ప్రతీకలుగా భావించి తెలంగాణ అంతటా చెరువులను తవ్వించారు. ప్రజలు సుభిక్షంగా ఉండేది చెరువుల వల్లే కాబట్టి అందరూ కలిసి ఏడాదికోసారి చెరువులకు పూలతో కృతఙ్ఞతలు చెప్పేవారు. అప్పటినుండి ఈ సాంప్రదాయాన్ని జానపదులు కాపాడుతూ చిరు మార్పులతో ఆ నాటి పండుగను నేటికీ జరుపుతున్నారు. బతుకమ్మ పండుగ జరిపే నాటికి వర్ష ఋతువు ముగిసి చెరువులు, కుంటలు నిండి, రకరకాల పుష్పాలు విరబూసి నేలపై సింగిడి ఏర్పడుతుంది. బతుకమ్మలో వాడే గునుగు, తంగేడు, గుమ్మడి లాంటి అనేక పుష్పాలు చెరువు నీటిని శుద్ధి చేస్తాయి. లయబద్దమైన పాద కదలికలు, లలితమైన చప్పట్ల మోతలు, అద్భుతమైన సారస్వత విలువలుగల పాటలతో రసరమ్య మోహనరాగాలతో ఒక అలౌకిక ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. ప్రేమలు, ఆప్యాయతలు, మానవ సంబంధాలను పెంపొందించే పండుగ బతుకమ్మ బతుకమ్మ పండుగ ఆశ్వీయుజశుద్ధ అమావాస్యనాడు మొదలవుతుంది. దీన్ని తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఇది నవరాత్రులకు ముందు రోజు ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ పండుగను చాలా వేడుకగా జరుపుకుంటారు. తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యమైన రంగురంగుల పూలను కీర్తిస్తూ బతుకమ్మ పండుగను వేడుకగా చేసుకుంటారు. మొదటి రోజు-ఎంగిలి పూల బతుకమ్మ : మహాలయ అమావాస్య రోజు నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని 'పెత్రామస' అని కూడా అంటారు. ఈ రోజు నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేసి బతుకమ్మకు నివేదిస్తారు. రెండో రోజు- అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అటుకుల బతుకమ్మ వేడుక జరుగుతుంది. ఈ రోజు సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడో రోజు-ముద్దపప్పు బతుకమ్మ : మూడో రోజు ముద్ద పప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి బతుకమ్మకు సమర్పిస్తారు. నాలుగో రోజు- నానే బియ్యం బతుకమ్మ : ఈ రోజు నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేసి బతుకమ్మకు నివేదిస్తారు. ఐదో రోజు- అట్ల బతుకమ్మ : ఈ రోజు బతుకమ్మకు అట్లు లేదా దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరో రోజు అలిగిన బతుకమ్మ : ఆరవ రోజైన ఆశ్వయుజ పంచమి నాడు బతుకమ్మను అలిగిన బతుకమ్మగా పూజిస్తారు. ఈ రోజున అమ్మవారు అలిగి ఉంటారని ఏమి తినరని అంటారు. అందుకే నైవేద్యమేమి సమర్పించరు. ఏడో రోజు- వేపకాయల బతుకమ్మ : ఈ రోజు వేపకాయల బతుకమ్మకు బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లు ఆకారంలో తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ : ఈ రోజు నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేసి బతుకమ్మకు నివేదిస్తారు. తొమ్మిదో రోజు- సద్దుల బతుకమ్మ : గ్రామీణ ప్రాంతాల్లో పూసిన పూలన్నిటిని సేకరించి, ఇంద్రధనస్సుల్లా పేర్చడం బతుకమ్మ వేడుకల్లో ప్రధాన క్రతువు. వాటిల్లో బంతి, చామంతి, గునుగు, సీతజడ, గుమ్మడి, తంగేడు, గడ్డి పూలు ఇలా అన్ని రకాల రంగు రంగుల పూలను శిఖరంగా పేర్చి, ఆ పైన గొబ్బెమ్మను ఉంచి, మహిళలంతా కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పువ్వుల పండుగగా పిలిచే ఈ ఉత్సవం సాంస్కృతిక, సంప్రదాయ, సామాజిక అనుబంధాల సమాహారం. ఇవి అందంగా వర్ణరంజితంగా కనిపిస్తూనే ఆరోగ్యాన్ని అందిస్తాయి. గునుగు పువ్వులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇంన్ ఫ్లమెటరీ గుణాలు వుంటే గుణాలు వుంటే బంతి ఎన్నో అనారోగ్యాలను నివారిస్తుంది. చామంతి కాల్షియమ్, ఫోలేట్, ఇనుము, జింక్ వంటి ఎన్నో పోషకాలను అందిస్తుంది. వైరస్ ను అరికట్టడంలో, గాయాలను మాన్పడంలో గడ్డి పువ్వు దోహదపడుతుంది. అక్కాచెల్లెలు అంతా ఒక దగ్గరకు చేరుకుని కలిసి, ఆడి, పాడుతారు. మహిళలు తొమ్మిది రోజులు బతుకమ్మను తయారు చేస్తారు. సద్దుల బతుకమ్మ రోజున బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మపై ఉంచిన గౌరమ్మను వెనక్కి తీసుకుని, మహిళలు తమ మంగళ సూత్రానికి పెట్టుకుంటారు. మహిళలు దుస్తులు ధరించి పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ నృత్యాలు చేస్తారు. బతుకమ్మ పండుగ ఫలహారాలలో పుష్కలమైన ఖనిజ, విటమిన్ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. తొమ్మిదిరోజులపాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు 9 రకాల ప్రసాదాలను నైవేధ్యంగా పెడతారు. ఏ రోజు ఏ బతుకమ్మను తయారు చేస్తారంటే, ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి నైవేద్యమేమీ సమర్పించరు, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మను పూజిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పూసిన పూలన్నిటిని సేకరించి, ఇంద్రధనస్సుల్లా పేర్చడం బతుకమ్మ వేడుకల్లో ప్రధాన క్రతువు. వాటిల్లో బంతి, చామంతి, గునుగు, సీతజడ, గుమ్మడి, తంగేడు, గడ్డి పూలు ఇలా అన్ని రకాల రంగు రంగుల పూలను శిఖరంగా పేర్చి, ఆ పైన గొబ్బెమ్మను ఉంచి, మహిళలంతా కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పువ్వుల పండుగగా పిలిచే ఈ ఉత్సవం సాంస్కృతిక, సంప్రదాయ, సామాజిక అనుబంధాల సమాహారం. ఇవి అందంగా వర్ణరంజితంగా కనిపిస్తూనే ఆరోగ్యాన్ని అందిస్తాయి. గునుగు పువ్వులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇంన్ ఫ్లమెటరీ గుణాలు వుంటే గుణాలు వుంటే బంతి ఎన్నో అనారోగ్యాలను నివారిస్తుంది. చామంతి కాల్షియమ్, ఫోలేట్, ఇనుము, జింక్ వంటి ఎన్నో పోషకాలను అందిస్తుంది. వైరస్ ను అరికట్టడంలో, గాయాలను మాన్పడంలో గడ్డి పువ్వు దోహదపడుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమ సందర్భంలో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. ఉద్యమ నాయకుల్లో స్ఫూర్తిని పెంచారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తరువాత బతుకమ్మ పండుగకు ప్రాధాన్యం మరింతగా పెరిగిపోయింది. ప్రస్తుతం విదేశాలలో కూడా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆశ్వయుజ అష్టమి నాడు దుర్గాష్టమి మహా పర్వదినం రోజున బతుకమ్మకు ఐదు రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం. ఇలా ఐదు రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు.
- కైలాస్ నాగేష్
http://www.teluguone.com/news/content/bathukamma-is-a-unique-festival-in-telangana-25-186118.html





