మనిషి అభివృద్ధికి అసలైన ఆటంకం ఇదే...

Publish Date:Jul 18, 2023

Advertisement

మనషి తన జీవితంలో గెలవలేకపోతున్నాడు అంటే దానికి కారణం అతను గెలుపు కోసం ప్రయత్నం చేయడం లేదని కాదు. అంతకు మించి ఆ మనిషిలో భయం ఉందని అర్థం. భయం మనిషిని ఓటమి అంచుల్లోకి తీసుకెళ్తుంది. ఎంత ప్రతిభావంతుడినైనా పరాజయుడిని చేస్తుంది. ఇంతకూ భయం మనిషికి శత్రువుగా ఎలా మారుతుంది?? అసలు భయం అంటే ఏంటి?? దాన్ని ఎలా జయించాలి?? ఈ విషయాలు నేటి తరం వారు తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.

మన సామర్థ్యం మీద మనకు నమ్మకం తగ్గిపోయి, గెలుపుకు వ్యతిరేకంగా ఉండే విషయాల ప్రభావానికి లోనైనప్పుడు మనిషిలో కలిగే ఒత్తిడిని, మార్పును, ప్రవర్తనను భయం అంటారు. మన పరాజయాలన్నింటికీ మూలకారణం భయమే!

 భయం కలగడానికి ముఖ్య కారణాలు :

 ఆత్మవిశ్వాసం లేకపోవడం : 

మనం మన మీద విశ్వాసం కోల్పోయినప్పుడు ప్రతికూలభావాలు మనల్ని ఆవరిస్తాయి. "భయమే మరణం, భయమే పాపం, భయమే నరకం, భయమే దుఃఖానికి మూలకారణం. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త ప్రతికూల భావాలూ ఉత్పన్నమయ్యేవి భయం అనే దుష్టశక్తి నుంచే" అని అంటారు స్వామి వివేకానంద.

పరులపై ఆధారపడడం : 

మన స్వశక్తిపై ఆధారపడకుండా ప్రతిదానికీ ఇంకొకరిపై ఆధారపడే స్వభావం మనల్ని నిస్సహాయులుగా, భయస్థులుగా మారుస్తుంది. ప్రతి విషయంలో ఇతరుల సహాయం అర్థించేవాడు స్వశక్తితో ఎన్నటికీ ఎదగలేడు. ఆధారపడటం అంటే మనిషిలో పిరికితనం పేర్చుకుంటూ పోవడమే.

"Why are people so afraid? The answer is that they have made themselves helpless and dependent on others".- అంటారు స్వామి వివేకానంద. కాబట్టి నిస్సహాయత మనిషి భయానికి మూలం. 

పని మీద నిబద్ధత, నమ్మకం కోల్పోవడం : 

మనం చేసే పని ఎంత చిన్నదైనప్పటికీ ఇతరులు చులకనగా చూస్తారనే భావన మనలో రానివ్వకూడదు. దానివల్ల మనం పని మీద నిబద్ధతనూ, నమ్మకాన్నీ కోల్పోతాం. అలాంటి ఊహాజనిత భయాలను వీడితేనే ప్రగతి సాధ్యం. పేపర్లు వేసి డబ్బు సంపాదించడం, టీ అమ్ముతూ డబ్బు సంపాదించడం, చిరిగిపోయిన దుస్తులను కుట్టుకుని వాటిని ధరించడం, ఇలాంటి వాటికి మనిషి చిన్నతనంగా ఎవరో ఏదో అనుకుంటారేమో అని ఆలోచించాల్సిన అవసరం లేదు.

విమర్శల గురించి అతిగా ఆలోచించడం: 

ఇతరుల విమర్శలకూ, అభిప్రాయాలకూ భయపడితే ఏ కార్యంలోనూ విజయాన్ని సాధించలేం. కాబట్టి వాటి గురించి అతిగా ఆలోచించి భయపడకూడదు.

We cannot succeed in anything, if we act in fear of other people's opinions.- భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి గారు ఇలా చెబుతారు. ఎవరైనా ఏమైనా అనుకుంటారని భయపడితే మనం విజయం సాధించలేము.

భయాన్ని పోవాలంటే అందరూ ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి...

భయం మానసిక బలహీనత వల్ల కలుగుతుంది. 'A sound mind in a sound body' అనే నానుడి మనందరికీ తెలిసిందే! దృఢమైన మనస్సు ఉండాలంటే దృఢమైన శరీరం అవసరం. అందుకు ప్రతీరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం శరీరానికి అయినా ఎది మనసును కూడా దృఢంగా మారుస్తుంది. వ్యాయామం తో పాటు ధ్యానం మంచిది. ప్రతిరోజూ మనిషి తనగురించి, తను చేసిన పనుల గురించి ఆత్మవిమర్శ చేసుకోవడం మంచిది.

క్రమశిక్షణతో కూడిన నీతిబద్ధమైన జీవితాన్ని గడపడం అలవరచుకోవాలి. అప్పుడు ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. అదే క్రమశిక్షణ లేకోతే మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉండదు.

ఇతరుల విమర్శలను మనలోని బలహీనతల్ని తొలగించు కోవడానికి ఉపయోగించుకోవాలి. అంతేకానీ ఎవరైనా ఎదైనా అంటే వారిని కోపం చేసుకుని, నోరు పారేసుకోకూడదు. నెమ్మదితనం విజ్ఞుల లక్షణం.

పోలిక మనిషిని దారుణంగా దెబ్బతీస్తుంది. అందుకే ఇతరుల శక్తి సామర్థ్యాలతో పోల్చుకొని బాధపడకుండా నిరంతర తపన, నిర్విరామ కృషితో దేనినైనా సాధించగలమనే విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.

ప్రతి మనిషిలో లోటుపాట్లు అనేవి ఉంటాయి. మొదట్లోనే ఎవరూ సంపూర్మణులు కాదు. మనలోని లోటుపాట్లను అధిగమించడానికి అనుభవజ్ఞులైన పెద్దల నుంచీ, సన్నిహితుల నుంచీ సలహాలను స్వీకరించాలి.

                                       *నిశ్శబ్ద.

By
en-us Political News

  
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.