Publish Date:Mar 22, 2025
ఆంధ్ర ప్రదేశ్ అవనిగడ్డలో ఐసిస్ డ్రగ్ కలకలం రేపింది. తాజాగా ఈగల్ టీం దాడుల్లో విస్తుకోల్పోయే నిజాలు వెల్లడయ్యాయి. ఐసిస్ లాంటి తీవ్రవాద సంస్థలు వినియోగించే డ్రగ్స్ కృష్ణా జిల్లా అవనిగడ్డ వీధుల్లో లభ్యం కావడంతో అధికారుల ఫీజులు ఎగిరిపోయాయి. ఐసిస్ ఉగ్రవాద సంస్థ వినియోగించే ట్రెమడాల్ అనే సైకో ట్రోపిక్ సబ్ స్టెన్స్( మాదక ద్రవ్యం) ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. గత రెండేళ్ల కాలంలో 55,961 ట్రెమడాల్ ట్యాబ్లెట్లు, 2, 794 ఇంజక్షన్లు అనుమతి లేకుండానే విక్రయాలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అవనిగడ్డలోని భార్గవ్ మెడికల్ హాల్ ఈ చీకటి వ్యాపారాన్ని ప్రారంభించింది నిన్న మొన్న కాదు.2022 నుంచి అమ్మకాలుచేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. అప్పట్లో అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ఈ అమ్మకాలను కట్టడి చేయలేకపోయింది. ఐసిస్ డ్రగ్ దందాను నడుపుతున్న భార్గవ్ మెడికల్ షాపుపై కేసు నమోదైంది. మెడికల్ షాప్ యాజమాని కొనకళ్ల రామ్మోహన్ తాను చేసిన నేరాన్ని అంగీకరించారు. చాలాకాలం నుంచి నిషేధిత డ్రగ్స్ అమ్ముతున్నట్లు చెప్పారు. ఈగల్ టీం అధికారులు దాడులు జరపడం ఇదే మొదటి సారి అని రామ్మోహన్ పేర్కొన్నారు.
ఫైటర్ డ్రగ్ గా పిలిచే ఐసిసి డ్రగ్ ను మిలిటెంట్లు శిక్షణ కాలం నుంచే వాడతారు. కొత్తగా రిక్రూట్ అయిన మిలిటెంట్ల కు శిక్షణ ఇచ్చే కాలంలో ఐసిస్ డ్రగ్ వినియోగిస్తే అలసట, నిద్ర రాకుండా ఉంటుందని అధికారులు తెలిపారు, ఎక్కువ సేపు ఉత్తేజంగా పనిచేయటానికి ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఉగ్రవాదులకు ఈ ట్రెమడాల్ మాత్రలను అందిస్తుంటాయి. అందుకే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ''ఐసిస్ డ్రగ్''గా పిలుస్తారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు దాడులుచేసి నిషేధిత డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నట్టు విజిలెన్స్ ఈగల్ ఐజి రవికృష్ణ తెలిపారు. ట్రెమడాల్ డ్రగ్ ను 2018లో కేంద్ర ప్రభుత్వం నిషేధిత డ్రగ్ జాబితాలో చేర్చింది. అంతే కాదు ఎన్ డిపిఎస్ చట్టం పరిధిలో చేర్చింది. ట్రెమడాల్ ను మాదక ద్రవ్యంగా గుర్తించి కాంబినేషన్, అనుమతించిన పరిమాణంలోనే వైద్యుల సలహా మేరకు వినియోగించాలన్న నిబంధన పెట్టింది.
అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో యువత ఎక్కువగా ఈ నిషేధిత డ్రగ్ వినియోగిస్తున్నట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. వందలాది మంది యువకులు ఈ మత్తుకు బానిసలయ్యారు.ఎన్ డిపిఎస్ చట్టంలోని సెక్షన్ల క్రింద అవనిగడ్డ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
కాగా విశాఖ పట్నంలో కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్న ఐదు మెడికల్ షాపులను అధికారులు సీజ్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/banned-isis-drug-racket-in-avanigadda-shocking-facts-in-the-raids-by-the-authorities-39-194829.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.