బీజేపీకి పీడకలగా మారిన బంకీపూర్, దతియా ఓటములు.!
Publish Date:Aug 4, 2026
Advertisement
బీహార్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో రెండు నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలతాలు బీజేపీకి పీడ కలనే మిగిల్చాయి. బీజేపీకి కంచుకోటలు, అత్యంత సురక్షిత స్థానాలుగా గుర్తింపు పొందిన రెండు స్థానాలలోనూ కూడా ఉప ఎన్నికలో బీజేపీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. బీహార్‌లోని బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ దాదాపు 20 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ప్రశాంత్ కిషోర్‌కు 64,151 ఓట్లు రాగా, సిన్హా 44,827 ఓట్లు సాధించారు. ఇక మధ్యప్రదేశ్‌లోని దతియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్, బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై ఆరు వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. తివారీకి 60,741 ఓట్లు రాగా, సింగ్‌కు 66,757 ఓట్లు వచ్చాయి. ఈ రెండు ఫలితాలూ కూడా బీజేపీ ప్రజాదరణ కోల్పోతోందన్న సంకేతాలను బలంగా ఇచ్చాయి. ముందుగా బంకీపూర్ విషయాన్ని తీసుకుంటే.. ఈ నియోజకవర్గం.. కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్సొంత నియోజకవర్గం.అంతే కాదు బీజేపీకి అత్యంత సురక్షితమైన సీట్లలో ఒకటి. 1995 నుంచి బీజేపీ ఈ సీటు గెలుచుకుంటూనే వస్తోంది. అటువంటి స్థానంలో బీజేపీ ఓటమి.. మోడీ పాలనపై ప్రజావ్యతిరేకతకు బలమైన సందేశంగా నిస్సందేహంగా చెప్పవచ్చంటున్నారు పరిశీలకులు. ఇలా ఎందుకు చెప్పొచ్చంటూ.. బంకీపూర్ లో కానీ, దతియా నియోజకవర్గంలో కానీ జరిగినది ఉప ఎన్నిక. సాధారణంగా ఉప ఎన్నికలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల పార్టీలు సునాయాసంగా గెలిచేస్తాయి. బీహార్, మధ్య ప్రదేశ్ లో బీజేపీయే అధికారంలో ఉంది. హస్తినలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన, పోరాటం వల్ల మోడీ ప్రతిష్టకు కలిగిన నష్టం ప్రభావం కూడా బంకీపూర్, దతియా ఉప ఎన్నికలలో బీజేపీ ఓటమికి కారణమైందని చెప్పొచ్చు. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ ల ఆందోళన, నిరసనల సమయంలో ప్రధాని మోదీపై బహిరంగ విమర్శలు బ్రాండ్ ను మసకబార్చాయి. అలాగే.. బంకిపూర్, దతియా ఫలితాలు నిరుద్యోగం, విద్య, విద్యార్థులపై పోలీసుల చర్యలపై ప్రజలో వెల్లువెత్తిన ఆగ్రహజ్వాలలకు దర్పణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. Bankipur and Datia defeats nightmare to BJP, Modi, Pride, Diminish
http://www.teluguone.com/news/content/bankipur-and-datia-defeats-nightmare-to-bjp-25-227982.html





