వామ్మో.. విజయసాయిని తిట్ల‌తో కుమ్మేసిన బండ్ల గణేష్.. వింటే వికార‌మే!

Publish Date:Apr 16, 2022

Advertisement

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సినీ నిర్మాత బండ్ల గణేష్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. బండ్ల గణేష్ వరుస ట్వీట్లతో విజయసాయిని చెడుగుడు ఆడేశారు. ‘మీకు కులం నచ్చకపోతే, కమ్మవాళ్లు నచ్చలేదంటే నేరుగా తిట్టoడి. కానీ.. చంద్రబాబును, టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మవారిని తిట్టకండి’ అని సలహా ఇచ్చారు. ‘అధికారం శాశ్వతం కాదు, రేపు నువ్వు తప్పకుండా మాజీవి అవుతావు’ అని హెచ్చరించారు. ‘ప్రతి కమ్మవారు తెలుగుదేశం కాదు.. నేను కమ్మవాణ్ణే.. కానీ.. టీడీపీ కాదు సాయిరెడ్డి గారు’ అంటూ ట్వీట్లతో చేశారు.

‘అయ్యా.. ఆంధ్రకి పట్టిన అష్ట దారిద్రమా, నీ పిచ్చకి.. నీ కుల పిచ్చకి.. నీ డబ్బు పిచ్చకి.. కమ్మ కులాన్ని బలిచేయాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది’ అంటూ విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్‌ ఫైరయ్యారు. నాకు వైఎస్సార్ అన్నా, జగన్ అన్నా గౌరవం.. కానీ, నువ్వు రాష్ట్రానికి పట్టిన దరిద్రం.. నువ్వు పెద్ద దరిద్రానివి.. మా కులాన్ని ఎందుకు అన్‌ని విషయాల్లోకి లాగుతున్నావ్..? అని నిలదీశారు. ‘తెలంగాణ సీఎం కేసీఆర్ని చూసి నేర్చుకో’ అని విజయసాయిరెడ్డికి బండ్ల గణేష్ హితబోధ చేశారు.

అన్ని కులాల్లో మంచివాళ్లు చెడ్డవాళ్లు ఉంటారు సాయిరెడ్డి అని పేర్కొన్న గణేష్.. ‘చంద్రబాబుతో ఉంటే ఆయనతో తేల్చుకో.. విశాఖని దోచుకున్న డబ్బుతో హైదరాబాద్ కొనుక్కో.. వ్యక్తి మీద గొడవతో కులం మీద దూషణ చేస్తే జనం చెప్పు దెబ్బలు రుచిచూపిస్తారు’ అని హెచ్చరించారు. ‘నీకు నచ్చకపోతే వ్యక్తి పేరు పెట్టి తిట్టు.. కానీ, కులాన్ని కాదు.. నిన్ను జైల్ కు పంపింది కమ్మ వారు కాదు’ అన్నారు. ‘త్వరలో నువ్వు జగన్ కు వెన్నుపోటు పొడిచే దరిద్రుడివి.. ఈ ట్వీట్ తరువాత నన్ను ఎంత ఇబ్బంది పెడతావో కూడా తెలుసు’ అన్నింటికీ సిద్ధపడే ట్వీట్ చేస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశారు బండ్ల గణేష్.

‘కులాల పేరుతో చిచ్చు పెడితే నీ చరిత్రని నువ్వే చింపి చిచ్చు పెట్టుకున్న పిచ్చ పిచ్చుక అవుతావు’ అని సాయిరెడ్డిపై బండ్ల గణేష్ ఫైరయ్యారు. ఇదేనా నీ సంస్కారం? అని ప్రశ్నించారు. ‘నీ బతుకు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసు. ఎంపీగా ఉన్నావని, అధికారంలో ఉన్నానని.. కళ్లు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నావు’ అంటూ గణేష్ మండిపడ్డారు. ‘జగన్ గారు ఇలాంటి వారిని మీ దగ్గర పెట్టుకోవద్దు. మీ రాజకీయ భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు’ అని బండ్ల గణేష్ సూచించారు. ‘నాకు కులపిచ్చి లేదు. నా కులాన్ని నేను ప్రేమిస్తాను, ప్రతి కులాన్ని గౌరవిస్తాను’ అని స్పష్టం చేశారు.

‘పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం.. అలాగే మీ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి అంటే కూడా నాకు ఇష్టం. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టాలని అనుకుంటున్నావు. అది నీకు మంచిది కాదు. టీడీపీ కుల పార్టీ అయితే మీరు ఎందుకు కమ్మవారికి టికెట్ ఇచ్చారు?’ అని విజయసాయిరెడ్డిని బండ్ల గణేష్ నిలదీశారు. ‘కష్టాన్ని నమ్ముకున్న రైతులం మేం. విశాఖలో దోచుకొని హైదరాబాద్ కు తరలిస్తున్నావు. ఇది ప్రపంచానికి తెలుస’ని పేర్కొన్న గణేష్. ఈ పిరికి ముసలి నా కొడుకుని ఏమైనా ఇలాంటి ప్రశ్నలు అడిగితే బ్లాక్ చేసి మింగుతాడు. వేస్ట్ గాడు’ అంటూ సాయిరెడ్డి తనను ట్విట్టర్లో బ్లాక్ చేసిన స్క్రీన్ షాట్ ను బండ్ల గణేష్ షేర్ చేశారు. ‘అన్న కోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లిని ఆ అన్నకి దూరం చేయగలిగిన దగుల్భాజీవి.. నిన్ను జగన్ గారు కట్ చెయ్యడం ఖాయం. ఆ కట్ కి జనం కారం పెట్టడం ఖాయం’ అని హెచ్చరించారు. ‘వైజాగ్ ని కుదిపేసిన తుఫాన్ నయం నీ కన్నా.. రెండు రోజులు ఊపేసి పోయింది. దేశం గర్వించే సిటీని నీ పాపాలతో అయ్యో పాపం విశాఖ చేశావ్ విష సాయి’ అంటూ నిప్పులు చెరిగారు. ఇక, తన ప్రతీ ట్వీట్ను విజయసాయిరెడ్డికి బండ్ల గణేష్ ట్యాగ్ చేశారు.

 

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.