Publish Date:Mar 16, 2026
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ‘వందేమాతరం’ అంశం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ శాసన సభలో ‘వందేమాతరం’ ఆలపిస్తున్న సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ ఆయన సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో స్పందిస్తూ ఎంఐఎం వైఖరిపై మండి పడ్డారు. తెలంగాణ శాసనసభలో జాతీయ గీతమైన ‘వందేమాతరం’ ఆలపిస్తున్న సమయంలో మజ్లిస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేయడం అత్యంత సిగ్గుచేటైన చర్య అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఇది కేవలం ఒక రాజకీయ నిరసన మాత్రమే కాదని, దేశానికి గౌరవ సూచకమైన జాతీయ గీతం పట్ల అవమానకరమైన ప్రవర్తనగా భావించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత దేశ స్వాతంత్ర్య పోరాట కాలంలో ప్రజల్లో జాతీయ స్పూర్తి ని నింపిన గీతం ‘వందేమాతరం’ అని గుర్తు చేసిన బండి సంజయ్, అలాంటి గీతాన్ని గౌరవించా ల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. దేశానికి సంబంధించిన చిహ్నాలు, సంప్రదాయాలు, జాతీయ భావాలను గౌరవించడం ప్రతి భారతీయుడి కర్తవ్య మని ఆయన అన్నారు. అయితే ఎంఐఎం ఎమ్మె ల్యేలు సభ నుంచి బయట కు వెళ్లడం ద్వారా తమ అసలు వైఖరిని మరోసారి బయటపెట్టారని బండి సంజయ్ విమర్శించారు.
భారతీయ చిహ్నాలు, జాతీయ భావాల పట్ల ఎంఐఎం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నికై శాసనసభకు వచ్చిన ప్రతినిధులు జాతీయ గౌరవాన్ని కాపాడే విధంగా ప్రవర్తించాల్సిన బాధ్యత ఉందని బండి సంజయ్ సూచించారు. ఈ ఘటనతో తెలం గాణ రాజకీయాల్లో మరోసారి జాతీయత, రాజకీయ నిరసనలపై చర్చ మొదలైంది. ఎంఐఎం ఎమ్మెల్యేల వాకౌట్‌పై వివిధ రాజకీయ పార్టీల నాయకులు భిన్నాభి ప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశముంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bandi-sanjays-sensational-comments-25-215590.html
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.