బండి వ్యాఖ్యలపై దుమారం.. మత విద్వేషాలే లక్ష్యమా? 

Publish Date:Sep 7, 2021

Advertisement

భారతీయ జనతా పార్టీ, బీజేపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సాగిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు మంచి స్పందనే వస్తోంది. ప్రజలు అనుభవిస్తున్న కష్టాలనే ఆయన తమ ప్రసంగాలలో ఏకరువు పెడుతున్నారు, కాబట్టి ప్రజలు గట్టిగానే చప్పట్లు కొడుతున్నారు. సమస్యలు చెప్పుకుంటున్నారు. బండి సంజయ్ కూడా, ఆలా నడుచుకుంటూ పోవడం కాకుండా, ఎక్కడంటే అక్కడ ఆగి, స్థానికులతో మాటామాటా కలుపుతున్నారు. వ్యక్తిగత సమస్యలు కూడా వింటున్నారు. ఆ విదంగా ప్రజా సమస్యల వరకే పరిమితమై,  ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేయడం వరకు అయితే, ఎవరికే ఎలాంటి అభ్యంతరం ఉండదు. సమస్యలకు తక్షణ పరిష్కారం చూపినా చూపక పోయినా, బండి యాత్ర రాజకీయంగా మంచి ముందడుగే  అనిపించుకుంటుంది. 

అయితే బండి సంజయ్,ఆయన వెంట నడుస్తున్నఇతర నాయకులు, కార్యకర్తలు అంతటితో ఆగడం లేదు. మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు వివాదస్పదం అవుతున్నాయి. హైదరాబాద్ పాత బస్తీ, భాగ్యలక్ష్మి అమ్మవారి  ఆలయం నుంచి  యాత్ర ప్రారంభించిన బండి సంజయ్, ఎంఐఎం బుజాన తుపాకిపెట్టి, తెరాస లక్ష్యంగా చేస్తున్న వ్యాఖ్యలు విమర్శలు మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే నిజాం ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని బండి అన్నారు. అంతే కాదు, అంతకు మించి, రాష్ట్రంలో 80 శాతం ఉన్న హిందువులకు బీజేపీ అండగా ఉంటుందని కుండ బద్దలు కొట్టారు. బీజేపీ హిందువుల పార్టీనే కానీ, ఇంతవరకు  రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నాయకులు ఎవరూ కూడా, ‘అవును, మాది హిందువుల పర్త్య, హిందువులకు అండగా  ఉండే పార్టీ, అని గట్టిగా చెప్పిన సందర్భం లేదు. అందుకే, బండి వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రగిల్చాయి. ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని ప్రత్యర్ధులు దుయ్యపడుతున్నారు. నిజానికి బడి సంజయ్, అక్కడితోనూ ఆగలేదు,మరో అడుగు ముందుకేశారు. హిందువులకు హని తలపెడితే మత విద్వేషాలను రెచ్చ కొట్టేందుకు కూడా  బీజేపీ వెనకాడదని  కుండబద్దలు కొట్టారు. ఒక విధంగా కుహన లౌకిక వాదంపై యుద్దాన్ని ప్రకటించారు. కుహనలౌకిక వాదులకు సవాలు విసిరారు.అయితే, బండి వ్యాఖ్యలపై ఎంఐఎం కంటే తెరాస నాయకులే ఎక్కువగా స్పందిస్తున్నారు.

తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన  కుటుంబ అవినీతి, అక్రమాస్తుల గురించి బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు, హెచ్చరికలు హాస్యాస్పదంగా, నవ్వుతెప్పించేలా ఉంటున్నాయని అంటున్నారు. నిజానికి, బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడు అయిన నాటి నుంచి, కేసీఆర్ అవినీతిని నిరూపించి జైలుకు పంపడం ఖాయమని అంటూనే ఉన్నారు. అందుకు అవసరమైన ఆధారాలు సేకరిస్తున్నామని, ఇక రేపో మాపో కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమన్న రీతిలో ప్రకటనలుచేస్తూనే ఉన్నారు. కానీ, అదేమీ జరగలేదు. అయినా, ఇప్పుడు పాదయాత్రలో మరోమారు. లేస్తే మనిషిని కాదు, అన్నట్లుగా, తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ నేతల లెక్కలన్నీ తేల్చి బొక్కలో వేస్తామంటున్నారు. అంటే, ఇప్పటికి ఏమీ చేయలేమని చేతులు ఎత్తేశారు అనుకోవచ్చును. అందుకే, కేసీఆర్ అవినీతి గురించి చెప్పే ఆయనకు ఎలా ఉన్నా వినేవారికి  మాత్రం బ్రహ్మానందం జోకులా నవ్వు తెప్పిస్తోందని అంటున్నారు. అప్పటిదాకా, ఆగడం ఎందుకు, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, ఆరోపణలే నిజం అయితే, అందుకు ఆధారాలు నిజంగా ఉంటే ఇప్పుడు చర్యలు తీసుకునేందుకు అభ్యంతరం ఏమిటి అన్న ప్రశ్నలకు బీజేపీ నాయకుల వద్ద సమాధానం లేదు. 

కేంద్ర నిధుల విషయంలోనూ బండి సంజయ్ ప్రజలను కన్విన్సు చేయలేక పోతున్నారని పార్టీ నాయకులే అంటున్నారు. కేంద్రం ఇచ్చే నిధులతోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్‌.. అవేవో తమ సొంత నిధులైనట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శలు అయితే చేస్తున్నారు, కానీ,  నిజానిజాలను జనం ముందు పెట్టడం లేదని అంటున్నారు.  బండి సంజయ్ సంగ్రామ యాత్ర సాగుతున్న తీరు పట్ల కేంద్ర నాయకత్వం సంతృప్తిని వ్యక్తచేసిందని, ప్రజల నుంచి వస్తున్న స్పందన కూడా ఆశాజనకంగా ఉందని, పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. మరో వంక తెరాస నాయకులు బండి పాదయాత్రను తేలిగ్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. పెట్రోల్ ధరల పెరుగుదలో ముడి పెట్టి జోకు లేస్తున్నారు. కానీ, అద్దాల మేడలో కూర్చున్న వారు, రోడ్డున పోయేవారి  మీద  రాళ్ళూ వేయడం అంత మంచింది కాదు.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.