నా కొడుకు కేసులో నా పేరు వాడొద్దు...కోర్టును ఆశ్రయించిన కేంద్ర మంత్రి

Publish Date:May 15, 2026

Advertisement

 

బాలిక వివరాలు సోషల్ మీడియాలో పెట్టిన వారిపై కేసు నమోదు..

హైదరాబాద్‌లో సంచలనం గా మారిన బండి సంజయ్ కుమార్ కుమారుడికి సంబంధించిన కేసు నేపథ్యంలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దుష్ప్రచారాన్ని తక్షణమే నిలిపివేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటి వరకు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, శాటిలైట్ ఛానెళ్లలో ప్రసారం చేసిన వీడియో క్లిప్పింగులు, పత్రికా కథనాలు, డిజిటల్ కంటెంట్, వాల్ పోస్టర్లు వంటి పరువు నష్టం కలిగించే సమాచారాన్ని ఈ నెల 26లోపు తొలగించా లని కోర్టు ఆదేశించింది. 

ఇకపై ఇలాంటి దుష్ప్రచారం కొనసాగితే కోర్టు ధిక్కరణ చట్టం సహా ఇతర చట్టాల కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కోర్టు జారీ చేసిన ఈ గ్యాగ్ ఆర్డర్ అన్ని డిజిటల్ మరియు శాటిలైట్ మీడియా సంస్థలు, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా గ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలు మరియు ఇతర మధ్యవర్తులకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల లక్ష్యం సంబంధిత పక్షాల గౌరవం, గోప్యతను కాపాడడం మాత్రమే కాకుండా మీడియా విచారణల వల్ల న్యాయ ప్రక్రియకు ఆటంకం కలగకుండా చూడటమేనని న్యాయవాది  తెలిపారు.
పోలీసుల కీలక ప్రకటన ఇదిలా ఉండగా మరోవైపు పేట్ బషీరాబాద్ పోలీసులు ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. 

ఈ పోక్సో చట్టం కింద నమోదైన FIR No.684/2026 కేసులో బాధిత బాలిక వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు మరింత కఠిన చర్యలకు దిగారు. బాలిక ఫోటోలు, వీడియోలు, తల్లిదండ్రుల వివరాలు ప్రచారం అవుతున్నాయని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాలల సంక్షేమ కమిటీ ఫిర్యాదు మేరకు మరో కేసు (FIR No.706/2026) నమోదు చేశారు.
 

By
en-us Political News

  
హైదరాబాద్‌ మహానగరంలో వైద్య సేవల రంగంలో తనదైన ముద్ర వేసిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి
కూతురి ప్రాణాల కోసం తండ్రి మృత్యువుతో పోరాటం..
పేదలకు అండగా బసవతారకం ఆసుపత్రి సేవలు..
నల్లగొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా దిల్లీ వేదికగా కీలక అడుగులు పడ్డాయి.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు
రెండేళ్ల చిన్నారి హత్య కేసు ఛేదన.. తల్లి, ప్రియుడి కుట్ర బట్టబయలు...
ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదంలో 14 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
మా ఆయనే దొరికాడా..ఆయను ఏమైనా అయితే చూస్తూ ఉరుకోము...
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం సాయంత్రం ఒక ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించి
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పారుపూడి రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు సరికొత్త మలుపు తిరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.