బండి భగీరథ్ పోక్సో కేసులో ఉత్కంఠ...నేడు హైకోర్టులో విచారణ

Publish Date:May 14, 2026

Advertisement

 

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసి విచారణ ముమ్మరం చేశారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పెట్ బషీరాబాద్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినప్పటికీ, భగీరథ్ హాజరు కాకపోవడం గమనార్హం.

మరోవైపు, విచారణాధికారులకు భగీరథ్ ఒక లేఖ పంపినట్లు సమాచారం. వ్యక్తిగత ఇబ్బందులు, తక్కువ సమయంలో నోటీసులు అందడం వల్ల తాను హాజరు కాలేకపోతున్నానని, మరో రెండు రోజుల సమయం కావాలని అందులో కోరినట్లు తెలుస్తోంది. అయితే భగీరథ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తోందని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అతని ఆచూకీ కోసం ఢిల్లీ, కరీంనగర్ ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపారు.

ఈ కేసు వివరాల్లోకి వెళితే.. ఓ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడమే కాకుండా, శారీరకంగా వేధించాడనే ఆరోపణలు భగీరథ్‌పై ఉన్నాయి. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు తొలుత లైంగిక వేధింపుల కేసులు నమోదు చేయగా, బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా తర్వాత పోక్సో సెక్షన్లను జోడించారు. అయితే ఇది తనపై జరుగుతున్న కుట్ర అని, ఆ కుటుంబమే తనను రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తోందని భగీరథ్ కౌంటర్ ఫిర్యాదు కూడా చేశారు.

ఈ వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ భావోద్వేగంగా స్పందించారు. తన కుమారుడు తప్పు చేసి ఉంటే చట్టప్రకారం కఠినంగా శిక్షించవచ్చని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని స్పష్టం చేశారు. అయితే తన కుటుంబాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసుపై సమీక్ష నిర్వహించి, విచారణలో ఎలాంటి పక్షపాతం ఉండకూడదని అధికారులను ఆదేశించారు.మరోవైపు బాధిత బాలిక వయసు విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయని భగీరథ్‌ న్యాయవాది పంపిన నోటీసుకు జవాబిచ్చేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు.

బాలికకు రెండు బర్త్‌ సర్టిఫికెట్లు

బాధిత బాలిక వయసుకు సంబంధించి కుటుంబసభ్యులు రెండు బర్త్‌ సర్టిఫికెట్లను చూపిస్తున్నారని, ఆధార్‌ కార్డులు రెండు వేర్వేరు పేర్లతో ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇలా రెండు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం బాలిక జన్మించిన హైదరాబాద్‌లోని ఆస్పత్రికి లేఖ రాశారు.

ప్రస్తుతం ఈ కేసు తెలంగాణ హైకోర్టు మెట్లెక్కింది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని భగీరథ్ పిటిషన్ దాఖలు చేయగా, దానిపై విచారణ గురువానికి వాయిదా పడింది. కోర్టు తీర్పును బట్టి పోలీసులు తదుపరి అడుగులు వేయనున్నారు. ఒకవేళ బెయిల్ రాకపోతే భగీరథ్‌ను అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ పరిణామాల మధ్య హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో "బండి భగీరథ్ పరారీ" అంటూ వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా మెట్రో స్టేషన్లు, బస్టాపుల వద్ద ఇవి దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం పట్టుబట్టి ఈ కేసును వేగవంతం చేస్తుండటంతో, రానున్న 48 గంటల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
 

By
en-us Political News

  
ప్రస్తుత సీజన్‌లో ఎల్ నినో పంజా విసరడం వల్ల రాయలసీమతో పాటు కోస్తాంధ్రలో అన్నపూర్ణగా పేరొందిన జిల్లాలపై తీవ్ర ప్రభావం పడింది. ఎండల తీవ్రతకు జలాశయాల్లోని నీరు ఆవిరైపోయే పరిస్థితులు తలెత్తాయి. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రధాన ప్రాజెక్టులు ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ వైపు నుంచి ఎగువ ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి.
తన సతీమణి సాధించిన ఈ గొప్ప విజయం పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో బ్రాహ్మణి చోటు దక్కించుకోవడం తనకు గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ఆమె భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహంతో ముందడుగు వేస్తూ, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి, ఆదర్శంగా నిలవాలని నారాలోకేష్ ఎక్స్ వేదికగా షేర్ చేసిన పోస్టులో ఆకాంక్షించారు.
భారతీయ మార్కెట్లో మిడ్, స్మాల్ క్యాప్స్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కొత్త త్రైమాసికంలో కల్యాణ్ జ్యువెలర్స్, టీసీఎస్ లలో ఇన్వెస్ట్ చేయడానికి నిపుణులు ఇస్తున్న బెస్ట్ స్ట్రాటెజీ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద మెగా డ్యామ్ కింద ప్రమాదకరమైన భూకంప రేఖ ఉన్నట్లు చైనా శాస్త్రవేత్తలే గుర్తించారు. ఈ ప్రాజెక్టుతో భారత్‌కు పొంచి ఉన్న ముప్పేంటి? పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
AMFI తాజా జూన్ డేటా ప్రకారం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఫ్లెక్సీ క్యాప్ కంటే మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. 30 నెలల తర్వాత జరిగిన ఈ మార్పునకు కారణాలు, వాటి రిటర్న్స్ వివరాలు ఇక్కడ చూడండి.
అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ముగిసిందని డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 90కి పైగా సైనిక స్థావరాలపై అమెరికా దాడులు చేయగా, ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. పెరిగిన ముడి చమురు ధరల వివరాలు మరియు తాజా పరిణామాలు ఇక్కడ చూడండి.
గల్ఫ్ ప్రాంతంలో అమెరికా, ఇరాన్ల మధ్య పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు మరియు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వివాదం అంతర్జాతీయ ముడిచమురు మార్కెట్‌ను ఎలా అతలాకుతలం చేస్తున్నాయో, దీనివల్ల భారత్‌పై పడే ఆర్థిక ప్రభావం ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.
రష్యా సైనిక డ్రోన్లలో ఐరోపా‌కు చెందిన అత్యాధునిక మైక్రోచిప్స్ విరివిగా లభ్యమవ్వడం సంచలనం సృష్టిస్తోంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలను తుంగలో తొక్కి, చైనా సరఫరా నెట్‌వర్క్ ద్వారా రష్యాకు చేరుతున్న ఈ రహస్య చిప్స్ మరియు గెరానియం డ్రోన్ల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఓకిటెల్ WP68 ఎయిర్ రగ్గడ్ ఫోన్ పూర్తి రివ్యూ ఇక్కడ చూడండి. 8000mAh బ్యాటరీ, 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ మరియు ఆండ్రాయిడ్ 16 వంటి అద్భుతమైన ఫీచర్ల వివరాలు, ధర మరియు పనితీరు విశ్లేషణ మీకోసం.
భారతీయ మ్యూచువల్ ఫండ్ మార్కెట్లో మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు మళ్లీ వరదలా వస్తున్నాయి. జూన్ నెలలో ఏకంగా 26 శాతం పెరిగిన ఈక్విటీ ఇన్‌ఫ్లోస్, టాప్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ మరియు నిపుణుల కీలక అంచనాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
దేశ రాజధానిలో.. అది కూడా అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారి దారుణ హత్యకు గురికావడం పాక్ ప్రభుత్వానికి, ఆ దేశ సైన్యానికి పెద్ద అవమానంగా మారింది. ఇక భద్రతా లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్ అబద్ధాల కథలల్లింది. వాటినే వాస్తవాలుగా అధికారికంగా ప్రకటనల రూపంలో వెల్లడించింది.
భారత స్టాక్ మార్కెట్లో ఐపీఓల జాతర ప్రారంభం కానుంది. రాబోయే రెండేళ్లలో జియో, ఎన్‌ఎస్‌ఈ సహా 210 కొత్త తరం కంపెనీలు ఐపీఓకి సిద్ధమవుతున్నాయి. పూర్తి వివరాలు మరియు మార్కెట్ అంచనాల కోసం ఇప్పుడే చదవండి!
రూ. 11,600 కోట్ల ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ భారీ ఐపీఓ వివరాలు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ మరియు హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీలతో వ్యాల్యుయేషన్ పోలిక, ప్రైస్ బ్యాండ్ మరియు ఇన్వెస్టర్ల లాభాల అంచనా విశ్లేషణ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.