Publish Date:May 15, 2026
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారం తెలంగాణలో రాజకీయంగాను, న్యాయపరంగాను పెను సంచలనం రేపుతోంది. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ బండి బగీరథ్ దాఖలు చేసిన పిటిషన్ ను గురువారం (మే 14) విచారించిన తెలంగాణ హైకోర్టు తీర్పు శుక్రవారానికి (మే 15)కు వాయిదా వేసింది.
ఈ కేసు వివరాల్లోకి వెళితే.. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పెట్ బషీరాబాద్ పోలీసులు భగీరథ్‌పై ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఆరోపణలను భగీరథ్ తరపున కోర్టులో వాదించిన న్యాయవాది, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి తోసిపుచ్చారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు పెట్టారని ఆయన వాదించారు. తమ క్లయింట్ విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, కేవలం అరెస్టు నుంచి రక్షణ మాత్రమే కోరుతున్నామని తెలిపారు. అయితే ఆ వాదనను ప్రభుత్వం, బాధితురాలి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు. పరారీలో ఉంటూ అరెస్టు నుంచి రక్షణ కోరడం సరికాదని వారు కోర్టుకు తెలిపారు.
అదలా ఉంటే పరారీలో ఉన్న బండి బగీరథ్ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. హైదరాబాద్, ఢిల్లీ, కరీంనగర్‌లలో ప్రత్యేక బృందాలు ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. అలాగే బాధితురాలి వయసు నిర్ధారణ కోసం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు నేపథ్యంలో బాధితురాలి గుర్తింపును బయటపెట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bandi-bagirath-obscanding-36-219828.html
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.
భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.
భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే