బండి అరెస్ట్.. మరో సెల్ఫ్ గోల్?

Publish Date:Apr 10, 2023

Advertisement

ఒన్స్ బిట్టెన్ ..ట్వైస్ షై (Once bitten, twice shy) ఇదొక ఇంగ్లీష్ సామెత. అంటే ఒకసారి పొరపాటునో,గ్రహపాటునో తప్పు చేసి దెబ్బతిన్న వ్యక్తి, రెండోసారి అదే తప్పు చేయడు. అదే తప్పు చేసేందుకు జంకుతారు, లేదా భయపడతారు .. జాగ్రత్త పడతారు. అనేది  ఈ ఇంగ్లీష్ సామెత సారాంశం. చదువు సంధ్యా లేని, చాయ్ వాలా ప్రధాని మోడీకి ఈ సామెత తెలియక పోవచ్చును కానీ, ఎ న్నోవేల పుస్తకాలను బట్టీయం పట్టేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలాగే  అమేరికాలో గొప్పగొప్ప చదువులు చదివిన మంత్రి కేటీఆర్ కు ఈ సామెత, ఈ సామెత సారాంశం తెలియదని అనుకోలేము. కానీ ఎందుకనో కేసీఆర్, కేటీఆర్ చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఈ మాటలు అంటున్నది ఎవరో తండ్రీకొడుకులంటే గిట్టని ప్రతిపక్షాలు కాదు.  బీఆర్ఎస్ అభిమానులే అంటున్నారు. ఒక రకంగా  సామాన్య ప్రజలకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు, మీడియా ముందుకొచ్చి సమాధానాలు ఇచ్చుకో లేక అవస్థ పడుతున్న గులాబీ పార్టీ వాచస్పతులు  విస్తు పోతున్నారు.

ధాన్యం రగడ మొదలు ఫార్మ్ హౌస్ ఎమ్మెల్యేల బేరసారల వరకూ, అక్కడి నుంచి ఇప్పుడు తాజాగా తెర పై కొచ్చిన పదవ తరగతి ప్రశ్న పత్రాల లీక్ లేదా మాల్ ప్రాక్టీసు వ్యవహారం వరకూ  కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని ఎండగట్టేందుకు చేసిన ప్రతి ప్రయత్నం, ప్రతి ఆందోళన, ప్రతి న్యాయ, రాజకీయ పోరాటం బూమరాంగ్ అవుతూనే ఉన్నాయి. అయినా తండ్రీకొడుకులు తగ్గేదే లే  అంటున్నారని, బీఆర్ఎస్  నాయకులు ప్రైవేటు టాక్ లో  తలలు పట్టుకుంటున్నారు.  

ముఖ్యంగా పదవ తరగతి హిందీ పేపర్ లీక్ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్’ని రాత్రికి రాత్రి అరెస్ట్ చేయడం, అది కూడా పది రోజుల క్రితం చనిపోయిన అత్తగారు దశదిన కర్మలో పాల్గొనేందుకు ఇంటికి చేరిన కొద్ది సేపటికే, పోలీసులు బిలబిల మంటూ ఆయన ఇంట్లోకి ప్రవేశించి, ఎందుకు, ఏమిటీ అన్న ప్రశ్నలను సమాధానం చెప్ప కుండా బలవంతంగా ఎత్తుకు పోవడం చట్ట పరంగా సరైనది అయినా కాకున్నా, సెంటిమెంట్ పరంగా, ప్రభుత్వం, పోలేసులు చేసిన బ్లండర్ మిస్టేక్ .. చాలా పెద్ద తప్పని బీఆర్ఎస్ నాయకులు ప్రైవేటు టాక్’లో ఒప్పుకుంటున్నారు. 
అలాగే, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజక వర్గానికి చెందిన ఓ మహిళా నాయకురాలు అయితే, ముఖ్యమంత్రికి ఆ సలహా ఎవరు ఇచ్చారో కానీ, బలగం సినిమా సెంటిమెంట్’ వెంటాడుతున్న సమయంలో తల్లితో సమానమైన  అత్తమ్మ దశదిన కర్మకు వచ్చిన అల్లుడు, బండి సంజయ్’ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోవడం ఎంత మాత్రం సమంజసం కాదని కాదని, చట్టాని పక్కన పెట్టి రాజకీయం గాచూసినా  పెద్ద తప్పని అన్నారు.

ముఖ్యంగా మహిళల సెంటిమెంట్’ను గట్టిగా దేబ్బతీసిందని అంటున్నారు. అందుకే, సిరిసిల్లల ముఖ్యంగా మహిళలు సర్కార్’కు శాపనార్ధాలు పెడుతున్నారని, ఈ ప్రభావం ఎన్నికలపై ఉంటుందని, ఆమె విశ్లేషించారు. ఈ సందర్భంగా బలగం సినిమాకు సిరిసిల్లకు ఉన్న సంబంధాన్ని, కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ సినిమా సెంటిమెంట్’ను మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 

అలాగే, ఫార్మ్ హౌస్ కేసులో చాంతాడంత రాగం తీసి, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బీజేపీ నాయకులను, ‘దొరికిన  దొంగలు’ అంటూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సహా దేశంలోని అనేక వ్యవస్థలకు చెందిన ముఖ్యులందరికీ ఆడియోలు, వీడియో క్లిప్పింగులు పంపి కూడా చివరకు, అదే సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో చీవాట్లు తిన్న వైనాన్ని బీఆర్ఎస్ అభిమానులే  గుర్తు చేస్తున్నారు.

ఇక పదవ తరగతి పరిక్ష పత్రం లీక్ కు సంబంధించి, వరంగల్ ఏసీపీ, బండి అరెస్ట్’కు ముందొక  రకంగా తర్వాత మరొక రకంగా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసి .. పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేకుండా చేశారని పోలీసు అధికారులే అంటున్నారు. ఇది సోషల్ మీడియా యుగం. ఒక్క సారి నిరు జారితే, ఇక వెనక్కి తీసుకోవడం అయ్యేపనికాదని, పోలీసు అధికారులు పూటకో మాట చెపితే, పోలీసుల పరువే పోతుందని, ఇప్పుడు ఈ కేసులోనూ అదే జరిగిందని అంటున్నారు.

అలాగే, ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారంలో డ్యామేజ్ అయిన ప్రభుత్వ ఇమేజ్’ ను కాపాడుకునేందుకు దారులు వెతుకుంటున్న సమయంలో,  టెన్త్ పేపర్ల మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో బండి సంజయ్’ ను ఇరికించే విఫల ప్రయత్నం చేసి, బీఆర్ఎస్ ప్రభుత్వం మరో మరకను కొని తెచ్చుకుందని, అంటున్నారు. నిజానికి, పదవతరగతి పరీక్ష పేపర్ మల ప్రాక్టీసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కుంటున్న బండి సంజయ్’ సమాధానాలు ఇవ్వవలసిన ప్రశ్నల కంటే, ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన ప్రశ్నలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు.

By
en-us Political News

  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.