బాలినేని ఉలికిపాటు ఎందుకో తెలుసా ?

Publish Date:Jul 29, 2022

Advertisement

బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి,. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబినెట్ లో అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రపదేశ్ వైఎస్సార్, రోశయ్య మంత్రి వర్గాల్లోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం వుంది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎన్నికయ్యారు. 1999 నుంచి అదే నియోజక వర్గం నుంచి  ఆరు సార్లు పోటీ చేసి ఒక్క సారి మాత్రమే ఓడి పోయారు. ఉమ్మడి ఒంగోలు జిల్లా రాజకీయాల్లోనే కాదు, ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లోనూ, ఆయన కీలక పాత్రను పోషించారు. ముఖ్యంగా క్యాష్ డీల్స్ లో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుందని అంటారు. 

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలే కాకుండా బధుత్వం కూడా ఉన్న బాలినేని ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రికి కొంత దూరమయ్యారు. అసంతృప్తి స్వరాలకు వేదిక అయ్యారు. అదలా ఉంటే, ఇప్పుదు ఆయనకు మరో సమస్య వచ్చిపడింది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో వెలుగు చూసిన చీకోటి ప్రవీణ్ కేసినో , హవాలాలో కేసులో ఆయనకు సంబంధం వుందో లేదో కానీ, ఆయనకు సంబంధాలే కాదు, అయన రోల్ కీలకమనే ప్రచారం అయితే జరిగింది.జరుగుతోంది. 
ఎక్కడ ఏ  నేరం జరిగిన పాత నేరస్తులు ఉలిక్కి పడడం సహజమే, కానే మాజీ మంత్రి, అధికార వైసీపీ ఎమ్మెల్యే బాలినేని ఈ విషయంలో ఎందకు ఉల్లిక్కి పడ్డారు? ఎందుకు మీడియా ముందు వచ్చి, కేసినో నిర్వాగకుడు చీకోటి ప్రవీణ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని  ఎందుకు చెప్పుకున్నారు? అంటే, ఏదో ఉండి అందుకే, ముందుగానే సంజాయషీ ఇచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే, ఏ సంబంధం లేక పోతే మాజే మంత్రి ఎందుకు, బుజాలు తడుము కుంటున్నారు, అని ప్రశ్నిస్తున్నారు. 

అయితే, బాలినేని మాత్రం, ‘నేను పేకాట ఆడతాను. అప్పుడప్పుడూ కేసినోకీ పోయివస్తూంటాను’ అని ఒప్పుకుంటూనే, అంత మాత్రాన చీకోటి ప్రవీణ్ కేసినోతో కానీ ఆయన హవాలా దండాతో  కానీ తనకు సంబంధం ఉన్నట్లు కాదన్నారు. అయితే, బాలినేనిపై ఇలాంటి  కేసినో, హవాల ఆరోపణలు రావడం ఇదే మొదటి సారి, కాదు. ఆయమ మంత్రిగా ఉన్న రోజుల నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి పేకాట, కేసినో వ్యసనపరుడని టీడీపీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. అప్పట్లో అయన ఆ ఆరోపణలను ఖండించినా, ఇప్పడు మాత్రం ’అవును .. నాకు పేకాట, కేసినోకు పోయివచ్చే అలవాటు ఉందన అంగీకరించారు. దీంతో అనుమనాలు ఇంకా ఎక్కవ అయ్యాయని అంటున్నారు. 

గతంలో అయన మంత్రిగా ఉన్నరోజుల్లోనే, ఒంగోలు నుంచి చెన్నైకు తరలిస్తున్న రూ. ఐదు కోట్ల నగదును తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో ఆ నగదు అంతా బాలినేని శ్రీనివాసరెడ్డి హవాలా రూపంలో పంపుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ ఇమేజ్ కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కేసినోలు.. హవాలా కేసుల గురించి చర్చ వచ్చినా ఆయన పేరు ప్రచారంలోకి వస్తోంది. నిజానిజాలు ఎలా ఉన్నా కేసినో, హవాల మచ్చలు మాత్రం బాలినేని, పుట్టుమచ్చల్లా, వదలడం లేదు.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.