జనసేనలో బాలినేని పరిస్థితి ఏంటి?

Publish Date:Sep 2, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒంగోలు నియోజకవర్గం ఎప్పుడూ కీలకంగానే ఉంటుంది. 2024 ఎన్నికల అనంతరం వైసీపీని వీడి  జనసేన  గూటికి చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.  ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 

ఇటీవల  టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ను లక్ష్యంగా చేసుకుని బాలినేని శ్రీనివాసరెడ్డి  మీడియా సమావేశంలో చేసిన విమర్శలు, ఆరోపణలు తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య దాదాపు చిచ్చు పెట్టినంత పని చేశాయి.  అయితే సకాలంలో తెలుగుదేశం, జనసేన అధినాయకత్వాలు జోక్యం చేసుకుని దామచర్ల, బాలినేనిలను గట్టిగా హెచ్చరించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే బాలినేని వ్యాఖ్యలు, విమర్శల పట్ల మాత్రం ఇరు పార్టీలలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. వ్యక్తిగత విభేదాలు,  పాత తగాదాల లేక్క తేల్చచుకునేందుకు బాలినేని  జనసేనను   వాడుకుంటున్నారన్న విమర్శలు ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ కూడా వెల్లువెత్తాయి.  పరిస్థితిని అర్ధం చేసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 

ఇటీవల జనసేన పార్టీ ప్రకటించిన స్థానిక సంస్థల ఎన్నికల కమిటీలో బాలినేనికి స్థానం దక్కలేదు. బాలినేని వంటి సీనియర్ నాయకుడికి   స్థానిక ఎన్నికల బాధ్యతల్లో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని బట్టి జనసేనాని బాలినేనిని దూరం పెట్టారని అవగతమౌతోందంటున్నారు పరిశీలకులు.  అలాగే  ఒంగోలులో ఎంతో ఘనంగా నిర్వహించిన జనసేన  ఆత్మీయ సమావేశానికి బాలినేని గైర్హాజరు కూడా బాలినేనికి జనసేనలో ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోందంటున్నారు.  అంతే కాదు.. ఒంగొలులో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశానికి బాలినేని గైర్హాజర్ కాలేదనీ, ఆయనను ఆ సమావేశానికి పార్టీ అధిష్ఠానం ఆహ్వానించలేదనీ, అందుకే ఆయన దూరంగా ఉన్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతున్నది. మొత్తం మీద ప్రకాశం జిల్లాలో, ఒంగోలులో బాలినేనికి జనసేనలో ప్రాధాన్యత తగ్గిందనీ, పార్టీ కార్యక్రమాలకు ఆయనను దూరం పెడుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

బాలినేని తీరును, పార్టీ కార్యకర్తల, స్థానిక నేతల అభిప్రాయాలనూ, అలాగే మిత్రపక్షమైన తెలుగుదేశం అభిప్రాయాలనూ పరిగణనలోనికి తీసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. పార్టీలో బాలినేని ప్రభావాన్ని,  జోక్యాన్ని తగ్గించారని అంటున్నారు.  పొత్తు ధర్మానికి విఘాతం కలగకుండా ఉండాలన్నా, పార్టీ అంతర్గత క్రమశిక్షణ దెబ్బతినకుండా ఉండాలన్నాబాలినేనిని పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టడమే మేలని, జనసేనాని అదే చేస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  పవన్ కళ్యాణ్  కూటమి ఐక్యత దెబ్బతినకుండా ఉండటానికీ, అలాగే ప్రకాశం జిల్లాలో జనసైనికులలో కొత్త జోష్ నింపడానికి బాలినేనికి పార్టీలో ప్రాధాన్యత లేకుండా చర్యలు తీసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

[Balineni Srinivasa Reddy Imoprtance Diminished, Pawan Kalyan, Janasena Party, Ongole Politics, TDP Janasena Alliance, Telugu One]

By
en-us Political News

  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.