బాలినేనికి పొమ్మన లేక పొగపెడుతున్నారా?

Publish Date:Apr 12, 2023

Advertisement

బాలినేని శ్రీనివాసరెడ్డి.. మాజీ మంత్రి.. సీఎంకు సమీప బంధువు..ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అయితే ఆయన మాటే శాసనం అన్నట్లుగా వ్యవహారాలు నడుస్తాయి. అలాంటి నేతకు అవమానం జరిగింది. అదీ జగన్ అధికారిక కార్యక్రమం సందర్భంగా. సీఎం జగన్‌ మార్కాపురం పర్యటన సందర్భంగా వెళ్లిన బాలినేని శ్రీనివాసరెడ్డిని   సీఎం హెలిప్యాడ్‌ దగ్గరకు వెళ్లకుండా పోలీసులు నిలిపివేశారు. పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తానెవరో.. తన పవరేంటో చెప్పుకున్నారు. అయినా ససేమిరా అన్నారు.

అంతే.. ఆయనకు ఒళ్లు మండింది. ఆగ్రహించిన ఆయన సీఎం కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. ఆయన అనుచరులూ అనుసరించారు.   బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో సొంత వర్గం ఉన్న నాయకుడు. అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉన్న నేత. అధికారదర్పం, అహంకారం పెద్దగా ప్రదర్శించరు. జిల్లాలో పేరుకు ఇద్దరు మంత్రులు ఉన్నా.. పలుకుబడి మాత్రం బాలినేనికే ఎక్కువ. అటువంటి ఆయన సీఎం హెలీపాడ్ వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని తట్టుకోలేకపోయారు. ఇంత అవమానం జరిగాకా తాను అక్కడ ఎందుకు ఉండాలనుకున్నారు. అంతే వెంటనే వెనక్కు వెళ్లిపోయారు.   బాలినేనిని పోలీసులు ఇంతగా అవమానించడం ఏమిటని వైసీపీ వర్గాలే ఆశ్చర్యపోయాయి. బాలినేనికి ముఖ్యమంత్రి వద్ద ప్రాధాన్యత లేదనడానికి నిదర్శనమా అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి.

కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో బాలినేనికి సీఎం ఉద్వాసన పలకడంతో ఆయన ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు. పునర్వ్యవస్థీకరణ సమయంలో ఆయన తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. ఆ తరువాత ఏదో సద్దుకుపోయినా,  తాజాగా ఎదురయిన అవమానం పుండుమీద కారం చల్లినట్లుగా అయ్యిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఇక ముఖ్యమంత్రి మార్కాపురం వచ్చిన తరువాత బాలినేనిని పోలీసులు నిలిపివేయడంతో ఆయన వెనక్కు వెళ్లిపోయిన సంగతి తెలుసుకున్న జగన్ స్వయంగా బాలినేనికి ఫోన్ చేసి పిలిపించారు.

దాంతో ఆయన వెనక్కు వచ్చి సీఎంతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అయినా ఆయనలో పరాభవ భారం కనిపిస్తూనే ఉంది. కార్యక్రమం మొత్తం ముభావంగానే ఉన్నారు. తన అసంతృప్తిని దాచుకోలేదు. అది ఆయన ముఖంలో కనిపిస్తూనే ఉంది. ఇదే విషయాన్ని ఆయన అనుచరవర్గం కూడా చెబుతున్నారు.  జరిగిన సంఘటన చూస్తుంటే పొమ్మనలేక పొగపెడుతున్నట్లుగా ఉందని అంటున్నారు. 

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.